TS TELUGU 3RD CLASS 2021

 

3 వ తరగతి

భాలల్లార బంగారు కొండల్లారా.

భారత జాతికి నేతలు మీరే ……. కపిలవాయి లింగమూర్తి.

 కపిలవాయి లింగమూర్తి గౌతమ బుద్ధుని సుద్దులు, గాంధి తాత వారసులని ఎవరి గూర్చి గేయం వ్రాసాడు - బాలలు.

 భారత జూలికి నేతలు మీరే

భావితరాలకు బాటలు మీరే ...... ఇందులో 'మీరే ఎవరు ? - బాలలు

 

లౌక్యములకు లోబడకుండ

బాల్యమునటులె భద్రపరచుకు

మానవ జన్మ లభించినందుకు

మహానందమును పొందండి   -  ఈ పంక్తులు గల గేయం "బాలల్లారా బంగరు కొండల్లారా".

 

1. వానదేవుడా!

ప్రక్రియ గేయం , ఇతివృత్తం : పర్యావరణం

గేయం :

వానల్లు కురువాలె వానదేవుడా!

వరిచేలు పండాలె వానదేవుడా!!

నల్లని మేఘాలు వానదేవుడా!

సల్లంగ కురువాలె వానదేవుడా!!


తూరుపు దిక్కున వానదేవుడా!

తుళ్ళితుళ్ళి కురువాలె వానదేవుడా!!

చాటంత మబ్బుపట్టి వానదేవుడా!

వర్షంగా మారాలె వానదేవుడా!!

 

చుక్కచుక్క నీరు చేరి వానదేవుడా!

మాకు ఆసరవ్వాలె వానదేవుడా!!!

మావూరి కుంటల్లు వానదేవుడా!

మత్తడై దుంకాలె వానదేవుడా!!

చెరువులన్నీ నిండాలె వానదేవుడా!

అలుగులై పారాలె వానదేవుడా!!

 

పెద్దలంతా కలిసి వానదేవుడా?

కాలువలు తవ్వాలె వానదేవుడా !!!

బీడు భూములన్నీ వానదేవుడా!

బిరాన తద్వాల వానదేవుడా!!

 

పడావు భూములన్ని వానదేవుడా!

పంట చేలవ్వాలి వానదేవుడా!!

పన్నెండు పరగణాల వానదేవుడా!

చేలన్ని తదవాలి వానదేవుడా!!

మూన్నాళ్ళు యెదగాలి వానదేవుడా!

యెన్నేలు వేయాలె వానదేవుడా!!

పన్నెండు ధాన్యాలు వానదేవుడా!

పంట చేల్లో పండాలె వానదేవుడా!!

గుమ్ములు నిందాలె వానదేవుడా!

భాగ్యాలు కలుగాలె వానదేవుడా!!

 

పేదసాద బతుకాలె వానదేవుడా!

గొడ్డుగోద బతుకాలె వానదేవుడా!!

కూలీనాలి దారుకాలె వానదేవుడా!

వెతలన్ని తీరాలి వానదేవుడా!!

వలసబోయినోళ్ళంత వానదేవుడా!

ఉళ్ళకు రావాలె వానదేవుడా!!

బతుకులన్ని మారాలె వానదేవుడా!

సౌభాగ్యమందాలి వానదేవుడా!!

 

గేయంలో గల అలంకారం - అంత్యానుప్రాసాలంకారం

బీడు భూములన్నీ ఎలా తడవాలి ? - బిరాన తడవాలి.

పంట భూములన్నీ ఎలా మారిపోవాలి ? - పన్నెండు రకాల ధాన్యాలు పండేలా మారిపోవాలి.

వానదేవుదా గేయంలోని ప్రాస పదాలు - కుడువాలి, నిండాలె, పందాలె.

 

అర్ధాలు

మత్తడి =

అలుగు =

పడావు భూములు =

గుమ్ములు =

 

వర్ణమాల

వాక్యం కొన్ని పదాలతో ఏర్పడుతుంది. పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడుతాయి.

మనం పలికే ధ్వనులకు గుర్తులను ఏర్పరచుకున్నాం. ఈ గుర్తులనే మనం అక్షరాలు అంటాం

అక్షరాలన్నింటిని కలిపి వర్ణమాల అంటాం.

 

అచ్చులు : అ - ఔ వరకు గల అక్షరాలు

హల్లులు : క' నుండి  ఱ వరకు గల అక్షరాలు.

ఉభయాక్షరాలు :  ఁ , ం ః

 

బాల భీముడు

ప్రక్రియ :కథ  ,

ఇతివృత్తం : ఇతిహాసం

ఇతిహాసం అనగా - ఇది ఇట్లు జరిగింది అని అర్ధం.ఇతిహాసంలో కథకు ప్రాధాన్యం ఇస్తారు.

పాత్రలు : కుంతి, భీముడు,  పాండురాజు, ధృతరాష్ట్రుడు, ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, దుర్యోధనుడు. ద్రోణాచార్యుడు

పాండురాజు, కుంతి : భీముడితల్లిదండ్రులు

ధృతరాష్ట్రుడు. :  హస్తినాపురానికి రాజు, పాండురాజుసోదరుడు . ఇతనికి 100 మందికుమారులుకౌరవులు .

దుర్యోధనుడు : కౌరవులలో పెద్దవాడు. భీముడుఅంటేద్వేషం. భీముడికి విషం పెట్టి చంపాలి అనుకున్నాడు. ద్రోణాచార్యుడు పెట్టిన పరీక్షలోభీముడు తో గదా యుద్ధం ఓడిపోయాడు .

ద్రోణాచార్యుడు : కౌరవ పాండవులకు గురువు.

పాండవులు : పాండురాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు.

బండరాయి మీద పడగా, ఎటువంటి దెబ్బ తగలకుండా, ఆ బండరాయే ముక్కలయ్యింది. ఆ రాయి మీద పడ్డ బాలుడు - బాల భీముడు

భీముడు కోపంతో చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపగా పండ్లలాగా జలజల కిందకి రాలిపడ్డది - కౌరవులు

ఒంటరిగా ఉన్న భీమునికి విషాహారం తినిపించినది - దుర్యోధనుడు

 కౌరవులు భీమునికి విషాహారం పెట్టి నదిలోకి దొర్లించగా, విషాన్ని పీల్చి అపాయం కలగకుండా చేసినవి - నదిలోని విష సర్పాలు,

పాతాళ లోకంలో ఉన్న భీముని బంధువు పేరు - నాగరాజు

ఎవరి దయ వల్ల భీముడు వెయ్యి ఏనుగుల బలాన్ని పొందాడు - నాగరాజు

దుర్యోధనునికి, భీమునికి జరిగిన గదాయుద్ధంలో గెలిచినది - భీముడు

 

సంభాషణలు

అయ్యోనా చిట్టి తండ్రి ఏమయిందో-. కుంతిదేవి

నాయనా నీ బలాన్ని ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగించు  - కుంతి

నేను పెద్దయ్యాక నా బలం తో చెడ్డ వాళ్లని శిక్షిస్తాను మంచి వాళ్లను రక్షిస్తాను” - భీముడు

 

జాతీయాలు :

ముక్కుమీద వేలు వేసుకోవడం : ఆశ్చర్యం

వచనాలు:

ఒక వస్తువు పేరును తెలిపి పదాన్ని ఏకవచనం అంటారు.

ఒకటి కంటే ఎక్కువ వస్తువులను తెలిపే పదాన్ని బహువచనం అంటారు.

 

వర్ణమాల

ప,ఫ,బ, భ,మ..ఈ అక్షరాలు,విటి గుణింత అక్షరాలు పలికేటప్పుడు పెదవులు కలుస్తాయి

 

 

3. అమ్మ

ప్రక్రియ - గేయం

ఇతివృత్తం : సంస్కృతి / విలువలు

కవి :వేముగంటినరసింహ చార్యులు

మూలం : బాలగేయాలు

అమ్మ' పాఠ్యభాగం గేయ ప్రక్రియకు చెందినది. గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది.

 

గేయం :

అమ్మ మనకు దైవము రా

అమ్మ ప్రేమ రూపము రా

అమ్మ వంటి దేవత ఈ

అవనిలోన లేదురా

 

తన రక్తము పోసి మనను

కనిపెంచెనురా!

తీపి కథలు చెప్పి బువ్వ

తీనిపించునురా ......

 

అమ్మ పిలుపు లోన

ఎంతో కమ్మదనం ఉందిరా

అమ్మ పలుకు మాటల్లో

అమృతమే చిందురా !

 

జోలపాట పాడి

ఉయ్యలలూపురా

లాలి పాట పాడి

నిద్దుర పుచ్చురా 

 

పదాలు :

పాటలు పాడేవారు గాయకులు

కథ చెప్పే వారు కథకులు

పుస్తకాలు చదివేవారు

చిత్రాలు గీసేవారు చిత్రకారుడు

ఆటలు ఆడేవారు క్రీడాకారులు

రచనలు చేసేవారు రచయిత

 

అర్ధాలు :

అవని భూమి

 

వచనాలు :

దైవం దైవాలు

రూపం రూపాలు

పలుకు పలుకులు

ఉయ్యాల ఉయ్యాలలు

పాటపాటలు

 

 

 

వర్ణమాల

, , , , , , ,, బవంటిఅక్షరాలను తేలికగా పలుకుతాం. ఇలా తీరగా పలికే అక్షరాలను అల్ప ప్రాణ అక్షరాలు అంటారు.

, ఘ,ఛ,ఝ,ఠ,ఢ,థ,ధ,ఫ,భవంటి అక్షరాలతో ఒత్తి పలుకుతాం ఇలా పలికే వాటిని మహా ప్రాణ అక్షరాలు అంటారు.

 

 

 

దయ:

పక్రీయా : కథ

ఇతివృత్తం: భూతదయ

పాత్రలు : శుధ్దోధనుడు , గౌతముడు, దేవదత్తుడు, న్యాయాధికారి , హంస

శుద్దోధనుడు : కపిలవస్తు నగరానికి రాజు.

గౌతముడు : శుద్దోధనుడు కొడుకు. మరో పేరుసిద్ధార్థుడు.

దేవదత్తుడు : సిద్ధార్థుడి బాల్యమిత్రుడు. హంసను బాణంతో కొట్టిన వాడు.

 

సంభాషణలు : 

నేను హంసనుకొట్టాను కాబట్టి అది నాదే”. -;దేవదత్తుడు

ఆకాశంలో హాయిగాఎగిరేహంసనుఎందుకు హింసించావు? జీవ హింస పాపం కదా!” – గౌతముడు

దేవదత్తుడు విధానం వల్ల హింస చనిపోతే అది అతనిదయ్యేది, దయతో గౌతముడు దాని ప్రాణాన్ని కాపాడినందుకు అది గౌతముడి అవుతుంది”.    న్యాయాధికారి

గౌతముడు ప్రేమగా పిలవగా చేతి పైన వచ్చి వాలింది ఎవరు ? - హంస

 

 

4. మన పండుగలు

ప్రక్రియ : సంభాషణ

ఇతివృత్తం : సంస్కృతి

పాత్రలు : టీచర్, దివ్య, కరుణ, లలిత, స్వప్న,  తిరుమల, రజియా

 

ఉగాది : చైత్ర మాసములో మొదటి తిథి పాడ్యమి రోజు జరుపుకునే పండుగ షడ్రుచులతో పచ్చడిని చేసుకోవటం,పంచాంగ శ్రవణం ఈ పండుగ ప్రత్యేకతలు.

శ్రీరామ నవమి : ఉగాది తరువాత తొమ్మిది రోజులకు, అంటే 'చైత్రమాస శుద్ధ నవమి' రోజున జరుపుకునే పండుగ. ఇది శ్రీరాముని జన్మదినం. ఈ రోజున సీతారాముల కల్యాణం చేసే సంప్రదాయం ఉన్నది.

దసరా: ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజునే ఈ పండుగ జరుపుకుంటాం.రాముడు రావణాసురుణ్ణి సంహరించింది. ఈ రోజే. మహాభారతంలో పాండవులు జమ్మి చెట్టు మీద ఆయుధాలు దాచితీసింది. ఈ రోజునే. అందుకే ఈ రోజును విజయదశమి అని పిలుస్తాం.

దసరానాడు పాలపిట్టను చూస్తాం. జమ్మిచెట్టుకు పూజ చేస్తాం.

 

బతుకమ్మ పండుగ : దసరా సమయంలో ఈ పండుగను జరుపుకుంటారు. దీనినే 'పూల పండుగ అని కూడా అంటారు.

బొడ్డెమ్మ పండగ :బొడ్డెమ్మ ఆడపిల్లల పండుగ. కన్నెపిల్లలు, బాలికలు తమ పెండ్లి ఘనంగా జరగాలని ఎంతో సంబురంగా జరుపుకుంటారు. ఈ పండుగ భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభం అవుతుంది. తొమ్మిది రోజులు ఆడిపాడి, అమావాస్యకు ముందే బొట్టెమ్ములను నిమజ్జనం చేస్తారు. పుట్టమన్నుతో గద్దెను చేసి, ముగ్గులు పెట్టి దానిలో 'వెంపలి చెట్టును పెడతారు. ఈ పందుగ బంజారాల తీజ్ పండుగను పోలి ఉంటుంది.

 

తీజ్ పండుగ : ఇది కన్నె పిల్లలు జరుపుకునే పండుగ తండాలోని ఆడపిల్లలు సీ» భవాని (లంబాడీ దేవత) కి పూజ చేసిన తర్వాత ఈ పండుగ జరుపుతారు. అడవిలో దొరికే దుసేరు తీగలతో అల్లిన బుట్టలో, తందా నాయకుని చేత పుట్ట మన్ను పోయించి, వాటిలో నానబెట్టిన గోధుములు జల్లుతారు. 9వ రోజున మొలకెత్తిన నారుని అన్నదమ్ములకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని నృత్యాలు చేస్తూ వెళ్ళి ఆ బుట్టలని నిమజ్జనం చేస్తారు.

 

రంజాన్ : రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్ లో ఒక నెల పేరు. ఈ రంజాన్ నెలలోనే ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ ఆవిర్భవించింది. నెల చివరన ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

 

క్రిస్టమస్ : డిసెంబర్ 25న ఈ పండుగను జరుపుకుంటారు. ఏసుక్రీస్తు జన్మించిన రోజైన క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. క్రైస్తవులు ఈ పర్వదినాన ఇంటిని నక్షత్రాలతో అలంకరించుకుంటారు.

 

దీపావళి : దసరా తరువాత 20 రోజులకు ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున జరుపుకునే పండుగ దీపావళి, నరకాసురవధ సందర్భంగా పటాసులు కాలుస్తూ, జరుపుకుంటారు.

 

వినాయక చవితి : వినాయకుని పుట్టిన రోజును వినాయక చవితిగా జరుపుతారు. శివ లింగోద్భవం జరిగిన రోజును శివరాత్రిగా జరుపుకుంటారు,

 

సంక్రాంతి : సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజును 'మకర సంక్రాంతి' గా ఘనంగా జరుపుకుంటారు.

ఆ రథసప్తమి పండుగ ఏ మాసంలో వస్తుంది ? - మాఘమాసం

ముస్లిం సోదరులు రంజాన్ తో పాటు త్యాగానికి ప్రతీకగా బక్రీద్, మొహర్రం పండుగలను పెద్ద ఎత్తున జరుపుకుంటారు.

బొడ్డెమ్మ పండుగ లాగానే గిరిజనులైన లంబాడీలు జరుపుకునే పండుగ  - తీజ్

 

ఉగాది పండుగ  - చైత్రమాసము, మొదటి తిథి పాడ్యమి

శ్రీరామనవమి పండుగ - చైత్ర శుద్ధ నవమి రోజున

విజయదశమి -  ఆశ్వయుజ శుద్ధ దశమి

రంజాన్ పండుగ - ఖురాన్ ఆవిర్భవించిన నెల

క్రిస్టమస్ -  డిసెంబర్ 25, క్రీస్తు జన్మదినం

తీజ్ పండుగ - లంబాడీల 'బొడ్డేమ్మ పండుగ' లాంటిది

 

పంచాంగ శ్రవణములు

1. తిథి 2.వారము 3. నక్షత్రము 4. యోగము 5.కరణము


షడ్రుచులు

1. తీపి 2. చేదు 3.పులుపు, 4.కారం 5. వగరు 6. ఉప్పు

 

5. కాకుల లెక్క

ప్రక్రియ - కథ  ; ఇతివృత్తం : హాస్యం

కాకుల లెక్కను ఏ ప్రాంతంలో లెక్కించారు - ఆగ్రా

ఆగ్రాలో ఎన్ని కాకులున్నాయని బీర్బల్ అక్బరుతో చెప్పాడు ? - 6803 కాకులు

 

సంభాషణ ( ఎవరు ఎవరితో అన్నారు ? )

“ప్రభూ! నేనుచెప్పినసంఖ్యనేసరియైనది. 

 మొదటివ్యక్తిలెక్కపెట్టినప్పుడుకాకులచుట్టాలుపక్కఊరినుండిమనఊరికివచ్చాయి.

 అందుకేఅతనికిఎక్కువకాకులుకనిపించాయి.

 రెండోవ్యక్తిలెక్కపెట్టేటప్పుడుమనఊరికాకులుపక్కఊళ్ళోనిచుట్టాలఇంటికిపొయాయి. అందుకేలెక్కతక్కువవచ్చింది" అన్నది - బీర్బల్

“ఆగ్రాపట్టణంలోఎన్నికాకులున్నవోలెక్కపెట్టారా?" - అక్బర్

 

ఏకవచన - బహువచన రూపాలు

1. కాకి - కాకులు

2. ఉద్యోగి - ఉద్యోగులు

3. కూర్చున్నాడు - కూర్చున్నారు.

4. లెక్క - లెక్కలు

5. వంద - వందలు

 

 

6. లేగదూడ

ప్రక్రియ: గేయం 

ఇతివృత్తం : భూతదయ

గేయం :

ఉసులాడే మూగ

లేగదూడను పిలువ

ఉకురికి వచ్చింది

దరిజేరి నిలిచింది

 

చిరునవ్వుతో నేను

తలమీద దువ్వగనే

నా చెయ్యి నాకింది

చెవులు నిక్కించింది

 

ముద్దులొలికే లేగదూడ

మెడకు మెడ కలుపగ

మురిసిపోయి తోకత్తి

చెంగున ఎగిరింది.

 

తుర్రుమని లేగదూడ ఎందుకు పరుగు తీసింది. - మీసాల తాతయ్య కర్ర చప్పుడు విని పరుగు తీసింది.

 

ఉసులు అనగా అర్థం - మాటలు

 

సంధులు :

 ఉరికురికి -  ఉరికి + ఉరికి : అమ్రెడిత సంధి

ఎగిరెగిరి - ఎగిరి + ఎగిరి: అమ్రెడిత సంధి

ఉరిమురిమి - ఉరిమి + ఉరిమి : అమ్రెడిత సంధి

వినివిని - విని + విని : అమ్రెడిత సంధి

 

 

7. నీటి అందాలు

ప్రక్రియ : వ్యాసం  

ఇతివృత్తం : దర్శనీయ స్థలాలు

 

లక్నవరం చెరువు :

లక్నవరం చెరువు ఎక్కడ కలదు ? - గోవిందరావు పేట మండలం, జయశంకర్ జిల్లా (ప్రస్తుతం : ములుగు జిల్లా)

లక్నవరం చెరువు హైదరాబాద్ కు 212 కిలోమీటర్లు, వరంగల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది.

లక్నవరం చెరువు తగ్గించింది కాకతీయులు

లక్నవరంచెరువులో  ద్వీపాల సంఖ్య - 13

లక్నవరంచెరువులో ఏన్ని ద్వీపాలను కలుపుతూ తెలంగాణా ప్రభుత్వం రోప్ వే ఏర్పాటు చేసింది – 3

 

కుంటాల జలపాతం

 ఆదిలాబాదును తెలంగాణా కాశ్మీరంగా పిలుస్తారు. సహజసిద్ధమైన అడవులు, జలపాతాలు ఉండటం ప్రత్యేకత.

 రాష్ట్రంలోనే ఎత్తయిన జలపాతం కుంటాల జలపాతం". ఇది నిర్మల్ జిల్లాలో ఉత్తర సహ్యాద్రి కొండలలో కడెం నదిపై ఉన్నది.

దీని ఎత్తు దాదాపు 145 అడుగులు (45 మీటర్లు)

శకుంతల - దుష్యంతుల కథలో శకుంతల ఇక్కడే నివాసమున్నట్లు చెపుతారు. అందుకే ఈ ప్రాంతాన్ని 'కుంతల' అని పిలిచేవారు క్రమంగా కుంటాల'గా మారింది.

కుంటాల జలపాతం పక్కన గుహ, అందులో పురాతన శివలింగం కలవు.

 

నాగార్జున సాగర్ :

ప్రపంచంలోనే అతి పెద్దదయిన రాతి కట్టడం - నాగార్జున సాగర్

నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఏ నదిపై కలదు ? - నల్గొండ జిల్లా, కృష్ణానది పై

నాగార్జున సాగర్ ఆనకట్టను 1955లో శంఖుస్థాపన చేసిందెవరు ? - భారత తొలి ప్రధాని నెహ్రూగారు

నాగార్జున సాగర్ లో ఎన్ని కి.మి పయనిస్తే నాగార్జున కొండ వస్తుంది – 14 కి.మి.

నాగార్జున కొండవద్ద  క్రీ.శ 1-3 శతాబ్దాల కాలం నాటి బౌద్ధ శిల్పాలు దొరికినవి.

నాగార్జున సాగర్ , అనుపు అనే ప్రదేశం మధ్య దూరం – 10 కి.మి

ఆచార్య నాగార్జునుడు విశ్వవిద్యాలయం నిర్మించిన ప్రాంతం - అనుపు

ఇక్ష్వాక రాజులు ఈ ప్రాంతాన్ని 'విజయపురి' అని పిలుస్తారు.

నాగార్జున సాగర్ భారతదేశంలో రెండవ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు, (మొదటిది భాక్రానంగల్)

సాగునీరుతో పాటు విద్యుత్ ఉత్పత్తి - రోజుకి 810 మెగావాట్లు

 

 

ఒక పదం వేరుగా ఉన్నది. దానిని గుర్తించండి

1. చెరువు, కుంట, సరస్సు, నది. - నది

2. మందారం, గులాబి, కలువ, మల్లెలు. - కలువ

3. గోదావరి, కృష్ణా, లక్నవరం, మంజీరా - లక్నవరం

4. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, హైదరాబాద్, జూరాల - హైదరాబాద్

 

 

వరసక్రమం

1. మేఘాలు పంటలు వర్షం చెరువు

మేఘాలు - వర్షం -  చెరువు -  పంటలు

 

2. వర్షాలు -  పంటలు - చెరువు - సంతోషం

వర్షాలు - చెరువు - పంటలు - సంతోషం

 

3. ఆనకట్ట - నది - కాలువలు - వ్యవసాయం

నది - ఆనకట్ట - కాలువ - వ్యవసాయం

 

4. చేపలు - అంగడి - చెరువు - ఆదాయం

చెరువు - చేపలు - అంగడి - ఆదాయం

 

5. ఆనకట్ట - పంటలు - నదులు - కాలువలు

నది - ఆనకట్ట - కాలువ - పంటలు

వర్ణమాల :

అచ్చులలో పొట్టిగా పలికే వాటినిహ్రాస్వాలు అని అంటారు . అ,ఇ, , ఋ,ఎఒ

అచ్చులో దీర్ఘం తీసి పలికేవాటిని దీర్ఘాలు అని అంటారు ఆ,ఈ,ఊ,,

 

8. మతిమరుపు ఈగ

ప్రక్రియ : కథ

ఇతివృత్తం : హాస్యం

ఇల్లు అలుకుతూ ఈగ ఏమి మర్చిపోయింది. " - తన పేరేమిటో మర్చిపోయింది.

మతిమరుపు ఈగ తన పేరును అడిగిన వరుస క్రమం

1. లేగదూడ

2 దూడ తల్లి ఆవు

3. అవును మేపే మల్లన్న

4. నీడనిచ్చే చెట్టు

5. చెట్టు క్రిందనున్న గుర్రం

6. గుర్రం కడుపులో పిల్ల

 

సంభాషణ ( ఎవరు ఎవరితో అన్నారు ? )

చెంగున ఎగిరే లేగమ్మా

నా పేరేమిటో చెప్పమ్మా ..... అని ఎవరు ఎవరితో అన్నారు  - ఈగ ,లేగ దూడ తో

నీ పేరానాకేం తెలుసు,మా అమ్మని అడిగి చూడు “ – లేగ దూడ , ఈగ తో

నీ పేరా ! నాకేం తెలుసు ? అయినా నన్ను మేపే మల్లన్నని అడుగు అని ఈగతో అన్నది అవు

 

ఈగకు గుర్రాన్ని అడగమని సలహా ఇచ్చింది ఎవరు ? చెట్టు

ఈగ , గుర్రం పిల్లని ఏమని అడిగింది  -

“ఛెంగున ఎగిరే లేగమ్మా!

లేగము కన్నా ఆవమ్మా!

అవును మేపే మల్లన్నా!

నీడనిచ్చే చెట్టమ్మా!

చెట్టుకిందా ఓ గుర్రమా!

గుర్రం కడుపులో పిల్లమ్మా!

నాపేరేమిటో చెప్పమ్మా! చెప్పమ్మా"

 

 గుర్రం పిల్ల ఇచ్చిన సమాధానం - ఇహిహి..... నీ పేరా ఈగ కదూ ? ఇహిహీ ..... అంటూ నవ్వింది.

మతిమరుపు ఈగ తన పేరు గుర్తుకు వచ్చాక ఇంటికి తుర్రుమని ఎందుకు వెళ్ళింది ? - సగంలో ఆపేసిన ఇల్లు అలకటానికి,

 

9. ఏమేమి చూడాలి?

ప్రక్రియ : గేయం 

ఇతివృత్తం - ప్రకృతి పరిశీలన

ఉద్దేశం : చిత్రాన్ని వర్ణిస్తూ, అందులోనిప్రకృతి సౌందర్యాన్ని పరిచయం చేయటం ఈ పాఠం ముఖ్య ఉద్దేశ్యం.

 

 

 

గేయం :

ఏమేమి చూడాలి? ఏమి చూడాలి?

ఏమేమి చూడాలి? ఏమి చూడాలి?

పక్షి పక్షి ఎగిరె తీరునే చూడాలి!

ప్రకృతిచ్చిన పక్షి రంగులను చూడాలి.

ఏటి సాగసులు ఊట చెలిమెలను చూడాలి!

నదుల నడకల తీరు మిలమిలలు చూడాలి!

చెట్టు చేమకు పూసే పువ్వులను చూడాలి!

చెట్ల కొమ్మల చిట్టి పిందెలను చూడాలి!

కొండ కోనల వెండి వెలుగులను చూడాలి!

అడవి అంచున మేసే పశువులను చూడాలి!

పశుల మందల లేగదూడలను చూడాలి!

గొర్ల మేకల వెంట కుక్కలను చూడాలి!

 

 

 

10. వేమన శతకం

ప్రక్రియ : పద్యాలు

ఇతివృత్తం : విలువలు

శతకం : వేమన శతకం

మకుటం : విశ్వదాభిరాము ! వినురవేమ!

వేమన పద్యాలలోని ఛందస్సు ఏమిటి ? - ఆటవెలది

ఆటవెలది అనగా అర్ధం - నాట్యం చేసే శ్రీ

 

అర్ధాలు

కనకం బంగారం

అతిశయించు = బాగుగా ఉండు

ధర = భూమి

ఇరుమారు = రెండు సార్లు

ముమ్మారు = మూడు సార్లు

ఉర్వి = భూమి

గిట్టుట = మరణించుట

సజ్జనులు - మంచివారు

అధికుడనని = గొప్పవాడినని

తండోపతండాలుగా = గుంపులు గుంపులుగా

 

వ్యతిరేక పదాలు:

కోపం × శాంతం

దుర్జనులు - సజ్జనులు

ముచ్చు × మంచి

పిరికి ×  ధైర్యము

మేలు ×  కీడు

సంధులు

అల్పుడెప్పుడు = అల్పుడు + ఎపుడు : ఉత్వసంధి

పురుషులందు = పురుషులు + అందు : ఉత్వసంధి

తప్పులెరుగరు = తప్పులు + ఎరుగరు : ఉత్వసంధి

 

 

 

అలంకారాలు:

అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను

సజ్జనుండు పల్కు చల్లగాను

కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా

విశ్వదాభిరామ వినురవేమ!          - దృష్టాంతాలంకారం

 

ఉప్పుకప్పురంబు నొక్క పోలిక నుండుఁ

జూడ జూడ రుచుల జాడవేరు

పురుషులందు పుణ్య పురుషులు వేరయా

విశ్వదాభిరామ వినురవేమ!               -    - దృష్టాంతాలంకారం

 

 అనువుగాని చోట నధికులమనరాదు.

కొంచెమైన మరియు గొదవగాదు

కొండయద్దమందు గొంచెమైయుండదా !

విశ్వదాభిరామ వినురవేము !          -    - దృష్టాంతాలంకారం

 

తప్పులెన్నువారు తండోపతండంబు

లుర్విజనులకెల్ల నుండు తప్పు

తప్పు లెన్నువారు తమ తప్పులెరుగరు

విశ్వదాభిరామ వినురవేమ!    - వృత్యానుప్రసాలంకారం

 

తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు

పుట్టనేమి వాడు గిట్టనేమి

పుట్టలోన చెదలు పుట్టదా, గిట్టదా !

విశ్వదాభిరామ వినురవేము !     -    - దృష్టాంతాలంకారం

 

4. మేడిపండు చూడ మేలియైయుందును

పొట్ట విప్పి చూడ పురుగులుండు

పిరికివాని మదిని బింకమీలాగురా !

విశ్వదాభిరామ వినురవేమ!    -    - దృష్టాంతాలంకారం

 

5. ఇనుము విరిగినేని ఇరుమారు ముమ్మారు

కాచియతుక వచ్చు గమ్మరీదు

మనసు విరిగినేని మరియంట చేర్చునా !

విశ్వదాభిరామ వినురవేమ!    -    - దృష్టాంతాలంకారం

 

దయలేని పుత్రుడు ఎవరితో సమానం ? - పుట్టలోని చెదలతో

 పిరికివాడు దేనితో పోల్చబడ్డాడు ? ఉపమాలంకారం

ఏది విరిగితే అతికించలేము-మనసు

 

 

వర్ణమాల :

• ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే వాటిని ద్విత్వాలు' లేదా 'ద్విత్వాక్షరాలు' అంటారు.

 

 

11. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు

ప్రక్రియ : వ్యాసం

ఇతివృత్తం : సంస్కృతి

తెలంగాణా జూన్ 2, 2014 రోజున భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది.

 తెలంగాణా రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు,

 తెలంగాణ రాష్ట్ర జంతువు - జింక”. (తెలంగాణ ప్రజల భోళాతనానికి, ప్రేమరి గుర్తు)

రాష్ట్ర పక్షి -  పాలపిట్ట, (స్వేచ్ఛకు చిహ్నం) పాలపిట్టను చూస్తే పాపాలు పోతాయని నమ్మకం

రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు (శమీ వృక్షం) (విజయానికి చిహ్నం), తెలంగాణలో జమ్మి ఆకుల్ని 'బంగారం' అని పిలుస్తారు.

రాష్ట్ర పుష్పంగా తంగేడు పూవును ఎంపిక చేశారు.

తెలంగాణా రాష్ట్ర పండుగ - బతుకమ్మ (దసరా)

జాతీయ జెండా - మూడు రంగుల జెండా

కాషాయరంగు త్యాగానికి, దేశభక్తికి చిహ్నం

తెలుపు రంగు - శాంతికి, సత్యానికి చిహ్నం

ఆకుపచ్చ రంగు సమ్మతానికి, సమృద్ధికి, భూమికి సంకేతం

అశోక చక్రం - 24 ఆకులు, 24 గంటలకు, ధర్మానికి ప్రతీక

 

జాతీయ పక్షి - నెమలి

 జాతీయ జంతువు - పెద్ద పులి

 జాతీయ వృక్షం - మట్టిచెట్టు

జాతీయ పుష్పం - తామర

జాతీయ ఫలం - మామిడిపండు

 

వర్ణమాల

ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఉదా : క్ర, మ్ర, స్ప 

 

 

12. తోటతల్లి

 ప్రక్రియ : గేయం

ఇతివృత్తం : పర్యావరణం

తోటతల్లి పాఠ్యభాగం రచయిత - సింగిరెడ్డి నారాయణ రెడ్డి

పాత్రలు- రామూ, సోమూ

తోట తల్లి పాఠంలో కవి ప్రస్తావించిన ఆట - దాగుడు మూతలు

 పాఠంలో కవి ఆటలైన తరువాత ఎవరితో మాటలాడుదాం అన్నాడు - వన్నెపూల బాలలతో , చిన్న చిగురు పాపలతో

గేయంలో అంత్యానుప్రాస అలంకారం కలదు.

గేయం :

అదుగదుగో కోటతల్లి

మన పాలిట పాలవెల్లి

రమ్మని పిలిచెను గదరా

రామూ, సోమూ పదరా

 

తమ్ములార మనమంతా

తప్పక వెళ్లాలిరా

ఆటలతో పాటలతో

పూటలు గడపాలిరా....

 

ముందు ముందుగా దాగుడు

మూతలె ఆడాలిరా

ఏమ్మట పాటలతో, తల

దిమ్మును వీడాలిరా.....

 

ఆటపాటలైనాక

అలసి పోపునందాక

చిన్న చిగురు పాపలతో

వన్నెపూల బాలలలో

 

మనసు దీర మమతలూరు

మాటలాడుదామురా

మంచి మంచి కథలను

మనమంతా విందామురా...

 

వర్ణమాల :

ఒక హల్లుకు రెండు హల్లులు ఒత్తులుగా చేరితే వాటిని సంశ్లేష అక్షరాలు అంటారు. ఉదా : క్ష్మి, త్స్ప, త్ర్వ , ర్త్వ

 

పక్షులు:

ప్రక్రియ : గేయం

ఇతివృత్తం : పర్యావరణం

గేయం :

పక్షుల చూడచె చెల్లెలా!

జ్ఞానం నేర్వర తమ్ముడా!!

 

కావుకావు మని యరిచే కాకులు

ఏకతచేర్చే వెలుగు రేకలు

చిలుకలు పలికే కమ్మని మాటలు

తీపిని పంచే తేనెల ఊటలు |

 

గడ్డిపోచలను ఏరుక వచ్చెను

గిజిగాడల్లే గూడే వచ్చెను

ఒంటికాలిపై చేపల వేట

కొంగరి నిజముగ సహనపు కోట

 

కూకూ యంటూ పలికింది.

కోయిల నిన్నే పిలిచింది.

స్వచ్ఛపు తెల్లని పావురము

శాంతికి తానే చిహ్నము

 

రంగుల శోభతో మెరిసింది.

దివ్య పాలపిట్టగ విరిసింది.

అందపు పింఛం పురి విప్పంగ

సుందర నెమలి నాట్య మాడంగ

 

కిచకిచ మనియెడి విచ్చుకల్

మనకందరికీ బహు మచ్చికలే

కొక్కొరొకో యను కోడి పిలుపులే

జగానికంతా మేలు కొలుపులే

 

గేయంలో అంత్యానుప్రాసాలంకారం కలదు.

 

 

 

13. మహాత్ముడు

పక్రియ : వ్యాసం

ఇతివృత్తం : స్ఫూర్తి

చిన్న పెన్సిల్ ముక్క కోసం వెతుక్కుని, పెన్సిల్ దొరికే వరకు చూసి దానితోనే రాసినవారు - గాంధీజీ

"పనికొచ్చే ప్రతి వస్తువుకూ విలువ ఇవ్వాలి. పదేయకూడదు.దేనినైనా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి". ఈ మాటలు ఎవరివి ? గాంధీజీ

గాంధీజీ 1869 అక్టోబర్ 2న గుజరాత్ లోని పోరుబందర్ లో జన్మించాడు.

గాంధీజీ తల్లిదండ్రులు - పుల్లీబాయి, కరమ్ చంద్

గాంధీజీ, అతని తండ్రియైన కరమ్ చంద్ గాంధీ ఇచ్చిన పుస్తకం - శ్రవణ కుమారుని నాటకం

"గుడ్డివారైన తల్లిదండ్రులకు సేవ చేసినది - శ్రవణ కుమారుడు

గాంధీ భార్య పేరేమి ? - కస్తూరిబాయి

గాంధీజీ సత్య హరిశ్చంద్ర నాటతాన్ని చూసి ఏమి నిర్ణయించుకున్నాడు ? - తాను కూడా సత్యాన్ని ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు.

ఆ గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో బోర్డు మీద రాయించిన మాటలు -

"ఆశ్రమం ఆస్తి అందరిది. ఇది ఈ దేశంలోని బీదవాళ్ళ ఆస్తిగా భావించాలని నేను ఆశిస్తున్నాను",

"అవసరానికి మించి ఉప్పయినా సరే వడ్డించుకో వద్దు, నీరు కూడా సృథా చేయకూడదు".

అంటరానితనం మహాపాపం, మానవులంతా ఒక్కటే అని చెప్పినవారు - గాంధీజీ

గాంధీజీ ఏనాటకం చూసిన తరువాత సత్యం మాట్లాడుట మొదలు పెట్టెను -  సత్యహరిశ్చంద్ర

- కార్డుతో సరిపోయేదానికి కాగితం ఎందుకు, కవరు అదనపు పోస్టేజి ఎందుకు వృధా చెయ్యడం అని అన్నది - మహాత్మాగాంధీజీ

 

ఆట బతుకు:

ప్రక్రియ - గేయం

ఇతివృత్తం - పిల్లల ఆసక్తులు నైపుణ్యాలు

గేయం :

పుంగిరులు పూయంగ

పూబంతు లాడంగ

గుడిగుంచ మాడంగ

చెడుగుడులు దూకంగ

ఆరి తేరిన పిల్లలూ అల్లు

         - పెరిగేటి నెల పొడుపులు

 

వన్నె వన్నెల పురుగు

అంగన్న దొరికింది

అగ్గిపెట్టెలో దాచి

అడుకుంటారంట

బంతి ఆకునే తెచ్చిక దానికి

               - బువ్వ అని తినిపిచ్చి

 

ముక్కు గిల్లీ ఆట

మెల్లగొచ్చీ గిల్లి

చక్కని పాపెవరు

స్పర్శతో పసిగట్టిరీ పిల్లలు

        - ప్రతిభ మాటేఅందుము

 

సూటి నేర్పిడి ఆట

చిత్తు బిల్లాడుతూ

నడక నేర్చిన తీరు

ఆటల్లో బ్రతుకున్నది పిల్లలకు

                  - పాటల్లా తెలివున్నది

 

తాటి కాయలు రెండు

బండి చక్రాలంట

మూడు మూలల బండి

ముందుకొక తాడంట

చిన్న పిల్లలు ఎక్కుగా గుంటరి

                    - బాటసాగెను చక్కగ

 

కార్తె గుర్తుకు పేరు

ఆరుద్ర పురుగంట

కుంకుమై మెరువంగ

పట్టువలె మురువంగ

గుంటే జేబులో దాచిరి గుట్టుగ

                     - తోటి వాళ్ళకు చూపిరి

కుడుమాట గుప్పెట్లో

తెలుపాలి ఏముందా

ఇటు నుండి వచ్చాడు

ఏమి తెచ్చుంటాడు.

ఉహలతో విహరించిరి పిల్లలు

                           - ఉన్నదే చెప్పేసిరి.అనే పంక్తులు ఏ గేయంలోనివి - ఆట బతుకు

ఆటలన్నింటిలో ఆరితేరిన పిల్లలను గేయంలో ఏమని పేర్కొన్నారు. - పెరిగేటి నెల పొడుపులు

ఆట బతుకు గేయంలో పేర్కొన్న కార్తె - ఆరుద్ర

కుంకుమై మెరువంగ

పట్టువలె మురువంగ

ఇందులోని అలంకారం - - అంత్యానుప్రాసాలంకారం

 

14. చెట్టు కోరిక

ప్రక్రియ : కథ (కాల్పనికత)

ఇతివృత్తం :సృజనాత్మకత

పాత్రలు : బుజ్జిమామిడిచెట్టు, పక్షి, కోతులు, చీమ, ఉడుతలు, పెద్దమామిడిచెట్టు, వనదేవత,

Content:

·        బుజ్జి మామిడి చెట్టు కొమ్మల మధ్య నుండి దూరి వెళ్లడం గాలికి ఇష్టం. కొమ్మల మీద కూర్చోవడం పక్షులకుఇష్టం. చెట్ల తోర్రలో చీమలు కాపురం ఉండేవి.

·        కోతులు కొమ్మలను పట్టుకుని ఊగుతూ ఉండేవి ఉడుతలు పైకి కిందికి తిరుగుతూ ఉండేవి.

·        బుజ్జిమామిడిచెట్టునుమంటనుండికాపాడిందిపక్షులు, గాలి , మేఘం

కట్టెలు కొట్టుకునే వాళ్ళ నుండి కాపాడింది    - చీమలు

పోలీస్నుంచికాపాడిందికోతులు

·         బుజ్జి చెట్టు పక్షులు, చీమలు, కోతులు వలె నడవాలని ఎవరిని ప్రార్ధించినది ? - వనదేవతను.

·         కోతులు తమతో పాటు ఏమి తెచ్చాయి. " - టోపి

·         మొదట చిన్న మామిడి చెట్టును కాపాడినవారు - పక్షులు

·         నడుచుకుంటూ వెళ్ళిన చెట్టుకు ముందుగా ఎవరు కనిపించారు - వంటవాళ్ళు

·         ఆ చిన్ని మామిడి చెట్టు నడుస్తూ పోయిన ఊరు - మిట్టపల్లి

 

సంభాషణలు :

ఆహారం కోసం నేను తిరగని చోటు లేదు, చివరకు ఒక పాప తినడానికి కొన్ని గింజలు పెట్టింది”. -;పక్షి

రాబోయేది వానకాలం కదా! ముందుచూపుతో తిండి సంపాదించుకుని తెస్తున్నాం”–చీమలు

నువ్వు చాలా మారిపోయావు, విశాల ప్రపంచాన్ని చూశావా? తనివితీరిందా? ఎలా ఉంది నీకు? ”  పక్కనున్నపెద్దచెట్లుబుజ్జిమామిడిచెట్టుతో.

 

గూడు కట్టడం కోసం గట్టి పుల్లలు ఏరుకొస్తున్న - పక్షి

మేము గుడికి వెళ్ళాం, తోటకి వెళ్ళి పళ్ళు తిన్నాం, టోపీలు అమ్ముతున్న ఆయన దగ్గర టోపీలన్నీగుంజుకొచ్చినం. ఇదిగో ! మానెత్తుల మీద చూడు - కోతులు

నేను కూడా నడుస్తున్నా', నేనింక ప్రపంచమంతా చూసివస్తా'బుజ్జి మామిడి చెట్టు

ఊళ్ళో పిల్లలకు ఉసిరి కాయలు తెంపిచ్చాం. మేమూ కొన్ని తిని వస్తున్నాం' అని చెట్టుతో చెప్పినది - ఉడుతలు

 

వచనాలు :

బండి - బండ్లు

బడి బడులు

కన్ను కండ్లు

పండు పండ్లు

కీలు కీళ్ళు

గుండు గుండ్లు

కాలు కాళ్ళు

రోలు రోళ్ళు

గుడి గుడులు

పెన్సిల్ పెన్సిళ్ళు

 

 

 

 

 

 

 

కొబ్బరి బొండం:

ప్రక్రియ - చిత్రకథ

ఇతివృత్తంహాస్యం

పాత్రలు - జింక, పులి, ఏనుగు, సింహం,కుందేలు

కుందేలుకి ఎదురైన జంతువుల వరుస క్రమం - జింక, పులి, ఏనుగు, సింహం

కుందేలు ఏచెట్టు కింద పడుకొంది కొబ్బరి

కొబ్బరి చెట్టుకింద పడుకున్న కుందేలుకు ఏమి అనిపించింది. - ఆకాశం విరిగి పడినట్లుగా శబ్దం వినిపించింది.

ఏమైంది ? ఎందుకు ఉరుకుతున్నావు ? అని కుందేలును అడిగింది. ఎవరు ? - జింక

అగండాగండి ! ఎందుకు ఉరుకుతున్నావు అని అడిగింది ఎవరు ? - పులి

ఆకాశం విరిగి పడినప్పుడు నువ్వు చూసావా ? అని అడిగింది ఎవరు? - సింహం

ఇదేనా విరిగిపడ్డ నీ ఆకాశం ? అని ఎవరు ఎవరితో అన్నారు? - సింహం, కుందేలుతో 

AUTHOR 

SATHISH RAO 

9000089049




Post a Comment

10 Comments