TELUGU THALLI
తెలుగు తల్లి
పాఠ్యాంశం :
ఇతివృత్తం – దేశభక్తి,
ప్రక్రియ – గేయం ,
కవి – శ్రీ శ్రీ
కవిపరిచయం:
శ్రీ రంగం శ్రీనివాసరావు (14.04.1901 – 15.06.1983)
రచనలు:-
మహా ప్రస్థానం , మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి.
ఈయన ఆత్మకథ – అనంతం
గేయం :
అదెవో తెలుగుతల్లి
అందాల నిండు జాబిల్లి
ఆనందాల కల్పవల్లి
అదే నీ తెలుగుతల్లి
పదవోయి తెలుగోడా
అదె నీ తెలుగు మేడ
సంకెళ్ళు లేని నేల
సంతోష చంద్రశాల
కనవోయి తెనుంగు రేడా
అదె నీ అనుంగు నేల
అదిగో సుదూర నేల
చనవోయ్ తెలుగు వీరా!!
పదవోయి నిర్భయంగా
పదవోయి నిశ్చయంగా
కదలవోయ్ ఆంధ్ర కుమారా
నిద్ర వదలవోయ్ నవ యుగం
నిర్మింపగ సాగవోయ్
కదలవోయ్ ఆంధ్ర కుమారా!
అర్థాలు :
తెనుంగు = తెలుగు
అనుంగు = ప్రియమైన
చనవొయ్ = వెళ్లవొయ్
రేడు = రాజు
కల్పవల్లి - కోరిన కోరికలు తీర్చేది
చంద్రశాల - చలువ రాతి మేడ
కనువోయి - చూడవోయి
నిశ్చయంగా - నమ్మకంగా
Post a Comment
1 Comments
14_4_1910 DOB (sri sri )
ReplyDelete