THALLI BHARATHI VANDANAM


కవి పరిచయం : 



దాశరథి కృష్ణమాచార్య జనన - 1925 - 07 - 22 

 దాశరథి కృష్ణమాచార్య మరణం - 1987 - 11 -05 

నిజాం వ్యతరేక ఉద్యమం లో పాల్గొన్నాడు.

అగ్నిధార, రుధ్రవిణ , మహాంద్రోదయం, తిమీరం తో సమరం

ఆంధ్ర ప్రదేశ్ ఆస్థాన కవిగా సేవలందించారు.

ఆత్మకథ యాత్రా స్మృతి




పాట :  


తల్లీ భారతి వందనము

నీ ఇల్లే మా నందనము

మేమంతా నీ పిల్లలమూ

నీ చల్లని ఒడిలో మల్లెలమూ

                                   || తల్లీ భారతి

చదువులు బాగా చదివెదమమ్మా

జాతి గౌరవం పెంచెదమమ్మా

తల్లిదండ్రులను గురువులను

ఎల్లవేళలా కొలిచెదమమ్మా

                                 || తల్లీ భారతి

కుల మత భేదం మరిచెదము

కలతలు మాని మెలిగెదము

మానవులంతా సమానమంటూ

మమతను సమతను పంచెదము

                                    || తల్లీ భారతి

తెలుగు జాతికి అభ్యుదయం

నవ భారతికి నవొదయం

భావి పౌరులం మనం మనం

భారత ప్రములను జయం జయం

                                     || తల్లి భారతి


Post a Comment

0 Comments