నా బాల్యం

 

రచయిత 


షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో 

1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు.

నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బినామీ,

తల్లిదండ్రుల, గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు.

పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతి వృత్తాలలో సమకాలీన అంశాలు జతచేసి నాజర్ బుర్రకథలు రూపొందించారు.

నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది

నాజర్ 1997 ఫిబ్రవరి 21వ తేదీన మరణించారు.

షేక్ నాజర్  తన ఆత్మకథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి

అక్షరీకరించాడు. చరిత్రాత్మకమైన ఈ కథకు 'పింజారి' అని పేరు పెట్టాడు.


కథ 

పొన్నెకల్లు తూర్పు వీధిలో సాయిబుల పందిరిగుంజ కూడా పాట పాడుతుందని పేరు. నేను ఆ పందిరి కింద పుట్టాను. నేను పుట్టగానే “ఆబ్దుల్ అజీజ్" అని పిలిచారట మా గారపాడు తాత. మా నాన్నకు ఆ పేరు నచ్చలేదు.నాజర్ అని పిలవాలని ఆయన ఆశ.

మా గారపాడు. మామలూ, అత్తలూ నన్ను “అబ్బుల్ అజీజ్" అనీ, పొన్నెకలు పెదనాన్నలు, చిన్నాన్నలు, అమ్మలూ, అక్కులూ "నాజరూ" అని పిలుస్తూ వచ్చారు. నేను తప్పటడుగులు వేస్తూనే వచ్చీరాని మాటలతో

“హ... అదిగో లేడీ

పరిగెడుతోంది.

లేడి బోయెరా

హ... బాణమేయరా" అని పాడుతూ ఎగిరి గంతులేసేవాడినట!

దున్న తోక వెంట్రుకలు పీక్కొచ్చి, గడ్డాలూ, మీసాలు, బొట్లు పెట్టి

     -నేనే బ్రహ్మనురా

       పామరులారా

      ఓ జనులారా

నేనే బ్రహ్మనురా" అని కూనిరాగాలు తిస్తుండే వాడిని

అమ్మా నాన్న ఆరుగాలం ఎండనక, వాననకా, అలుపు సొలుపు లేకుండా కష్టపడేవారు. మా అమ్మ చారెడు గింజలు దంచి, వండి నాకూ మా చెల్లికి పెట్టడం, మళ్ళీ అంతా పనులకు పోవడం దినచర్యగా జరుగుతుండేది.


నాకు బడిలో వేసే వయసు వచ్చింది. ఎలాగో శ్రమపడి కొత్తలాగూ, కొత్తచొక్కా కుట్టించాడు మా నాన్న.చదువు మూడొ నేత్రం  కొబ్బరికాయ, ఆకులూ, వక్కులూ పావలా గురుదక్షిణ గురువు గారిచ్చి నన్ను వీధి బడిలో అప్పగించాడు. 

మా నాన్న మధ్యాహ్నం బడి నుండి ఇంటికి వెళ్ళగానే "గింజలు తీసుకొని యింకా మీ నాన్న యింటికి రాలేదు. నాయనా!ఇంకా వండలేదు. సాయంకాలం పంతులు గారి ఆడిగి పెందలకడ రా అయ్యా" అని అమ్మ పాలో, పెరుగో, చల్లో తాగడానికి ఇచ్చేది.

నేను తాగి మూతి తుడుచుకొని సజ్జ జొన్నలు లేవు గానీ చల్ల తాగి చదువుకోపోయేవాణ్ణి

హార్మోనిస్టు భాదర్ ఒకరోజు మా ఇంటికొచ్చి, మస్తాన్ గారూ మన కుర్రాడు. మంచి తెలివి కలవాడు. శ్రుతి, లయ, గానం, మంచి కంఠం కలవాడు. నాతో పంపండి. చదువు, సంగీతం నేర్పించి గొప్పవాళి చేస్తానన్నాడు. మా నాన్న సరేనన్నాడు.

గోగుపూల్ల గొట్టంలో నీళ్ళ చెంబులో, వూదిస్తూ, శ్రుతి గుక్క నేర్పించేవాడు. ఏడ్వడం , నవ్వడం, కోపంగా మాట్లాడడం, చూడడం,మూతి ముడవడం, కళ్ళురమడం లాంటివి నేర్పేవారు. 

కళ్ళలో కొబ్బరి నూనె వేసి, లైట్ వంక చూసి నీరు కారుతుంటే ఏడుపు చెప్పించేవాడు

పాఠశాల వార్షికోత్సవం నాడు " ద్రోణ విజయం" అనే చిన్న నాటిక ఆడాము. నేను ద్రోణాచార్యులుగా పద్యాలు, పాటలు పాడాను. 

మా పంతులు గారు నా వీపు తడుతూ బాగా చదువుకోరా మంచి గాయకుడవు నటుడువూ అవుతావని, ఐదు రూపాయలు, పుస్తకం, పెన్సిలు బహుమతిగా ఇచ్చారు. అలా నా బాల్యం ఆకలితో ఆటలతో పాటలతో గడిచిపోయింది.


అర్థాలు 

ఆశ = కోరిక

ఆరుగాలం = ఏడాది అంతా

దినచర్య = ప్రతిరోజు చేసే పనులు

గురుదక్షిణ =  గురువులకు ఇచ్చే తానుక

వార్షికోత్సవం  = సంవత్సరం చివరన జరుపుకునే వేడుక

గుంజ - రాట 

మర్తులు = చదువుకోనివారు


కొండపల్లి బొమ్మలు పొణికి కర్రతో చేస్తారు. 


పదజాలం 

కుండ - మట్టి 

అద్దం - గాజు 

గునపం - ఇనుము 

బుట్ట - వెదురు 


పర్యాయ పదాలు

గుంజ రాట , నిట్టాడు ,స్తంభం

బాబాయి : చిన్నన్న, పినతండ్రి, చిన్నాబ్బ

బువ్వ : అన్నం, కూడు ,మెతుకులు


విరామ చిహ్నాలు 

  • ? --> ప్రశ్నార్థకం 
  • ! --> ఆశ్చర్యార్ధకం



Post a Comment

0 Comments