ఐకమత్యం


రచయిత 

లియోటాల్ స్టాయ్ రష్యన్ కథ ఆధారం 

రచనలు సమరం – శాంతి, అనాకెరనీనా,

 

ప్రక్రియ - కథ  

రామాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. వారు చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగారు. కాని పెద్దవాళ్ళయ్యే కొద్దీ వారిలో వారు కలహించుకోవడం మొదలుపెట్టారు. 

వాళ్లలో మార్పు తేవడం ఎలా అని తండ్రి ఆలోచించాడు. ఒకరోజు వాళ్లతో కొన్ని పుల్లలు తెప్పించాడు. వాటిని కట్టగా కట్టమని చెప్పాడు.



మొదటి కొడుకును పిలిచాడు. పుల్లల కట్టను అతను విరవలేకపోయాడు. రెండవ కొడుకుని

పిలిచాడు. పుల్లల కట్టను విరవమన్నడు.. కూడా విరవలేకపోయాడు చివరిగా మూడవ కొడుకుని పిలిచాడు. పుల్లల కట్టను వీరవమన్నాడు పిల్లలకట్టను విరవడం అతనివల్ల కూడా కాలేదు.



తండ్రి ముగ్గురు కొడుకులకు పుల్లల కట్టను విప్పి విడిగా ఒక్కొక్క పుల్లను విరచమని చెప్పాడు. వాళ్ళు గా విరిచేశారు. అప్పుడు తండ్రి కొడుకులవైపు చూసి అడిగాడు, "మీకు ఏంమర్ధమైంది?" 

నాన్న కలిసి ఉంటే మమ్మల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. విడిపోతే బలహీనులమైపోతాం. నాన్నా! ఇక కలసి వుంటాం. ఎప్పుడూ కలహించం" అన్నారు. కొడుకులు,

తండ్రి సంతృప్తి చెందాడు.



Post a Comment

0 Comments