మంచి బాలుడు


కవి పరిచయం : 
ఆలూరి బైరాగి జననం --> 5.11.1925 
ఆలూరి బైరాగి మరణం --> 9.9.1978
20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు. 
మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు. 
'చీకటిమేడలు', 'నూతిలో గొంతుకలు', 'ఆగమగీతి', 'దివ్యభవనం' ఆయన ప్రసిద్ధ రచనలు.
బాలల కోసం చక్కటి గేయ కథలు రచించారు. కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం పొందారు.



గేయం : 
తళతళ మిల మిల మెరుపులు మెరసి
హోరున, జోరున వర్షం కురిసి
వీథుల్లో కాల్వలు కట్టాయి
కాల్వల నిండా నీళ్లిచ్చాయి

చెప్పులు తడిసీ బట్టలు తడిసీ
చిందే నీళ్ళకు, బురదకు జడిసీ
జనులు మెల్లగా పోతున్నారు
లేకుంటే జారే పడతారు

ఆ త్రోవను పాపం ఒక ముసలమ్మ
కాటికి కాళ్ళు చాచినట్లున్నది
గడగడ వణికీ, తడ బడి తొణికీ
అడుగులు లెక్కిడుతూ పోతున్నది

మెదలక ఎవరి త్రోవనే వారు
పిన్నలు పెద్దలు పోతున్నారు
వణికే వాణికే ఆ ముసలమ్మకు
ఎవ్వరు సాయం చేసేవారు?

ఇంతలోన దగ్గరలో ఒక బడి
వదలి పెట్టగా పిల్లలు వడి వడి
కేకలు వేస్తూ పరుగులు తీస్తూ
వచ్చారెంతో సందడి చేస్తూ

కిలకిలలాడే, ఆడే, పాడే
బాలుర అడుగులు ఆనవు భూమిని 
వారు అసలు చూచారో, లేదో
గడగడ వణికే ముదుసలి ఆమెను

కానీ వారిలో ఒక్క బాలుడా 
ముదుసలి అవ్వను చూచి,జాలిగొని 
చేయి బట్టి కొనిపోయాడామెను 
విడిచి వచ్చినాడామె భవనమున 

తిరిగి వచ్చి తన తోటి వారితో
అన్నాడాతడు - "స్నేహితులారా!
ఆ ముసలమ్మ కూడ మరి యొకరికి
అమ్మే అని ఆలోచించారా?

మరి మాయమ్మ కూడ ముదుసలియై
నే దూరానెచటో ఉన్నప్పుడు,
అవసర మందు ఆదుకొని దయతో
సాయం చేయొద్దా మరి ఒక్కడు?"

ఇది విని ప్రతి బాలుడు తన మనమున
సిగ్గు జెంది అనుకొన్నాడిట్లని
"దుర్బలులకు సాయం చేయని యెడ
కొరగా దెందుకు మనుజుని మనుగడ" 


అర్థాలు : 

వీథులు = బజారులు
జడిసి= భయపడి
జనులు= ప్రజలు
త్రోవ = దారి
వడి = వేగం 
సాయం =  సహాయం
ముదుసలి = ముసలి
జాలి = దయ
కొనిపోవు = తీసుకుపోవు
మనము = మనస్సు
దుర్బలులు = బలం లేనివారు
మనుజుడు = మనిషి
మనుగడ = జీవనం, జీవితం 
 జోరున ----> వాన కురిసింది
 ముసలమ్మ --> గడగడ వణికింది
నేలంతా --> బురదగా మారింది
అందరూ --> అభినందించారు
 పిల్లవాడు --> చేయిపట్టుకొని నడిపించాడు
 

గేయ పాదాలు : 
 జోరున ----> వాన కురిసింది
 ముసలమ్మ --> గడగడ వణికింది
నేలంతా --> బురదగా మారింది
అందరూ --> అభినందించారు
 పిల్లవాడు --> చేయిపట్టుకొని నడిపించాడు

వచనాలు : 
కేక - కేకలు 
పిల్ల - పిల్లలు 
కల - కలలు
అడుగు - అడుగులు 

జంట పదాలు : 
తళతళ 
కిలకిల 
గడగడ 

విరామ చిహ్నాలు : 

పూర్ణ బిందువు - వాక్యంత బిందువు. వాక్యం చివర ఉంటుంది 

స్వల్ప విరామ బిందువు (కామా) - వాక్యంలో స్వల్ప విరామం అవసరం అయినప్పుడు  











Post a Comment

0 Comments