జింక

 


జింక ఒకటి నీళ్లు తాగడానికి సెలయేటి దగ్గరికి వెళ్లింది. నీళ్లలో తన ప్రతిబింబం చూసుకుంది. తన

కొమ్ములు ఎంత పెద్దవో, ఎంత బాగా ఎదుగుతున్నాయో చూసి మురిసిపోయింది. తర్వాత కాళ్లు చూసుకుంది.

ప్స్.. నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లల్లా ఉన్నాయి, ఏం బాగా లేవు" అనుకుంది.

ఇంతలో హఠాత్తుగా ఒక సింహం తన మీదకు దూకబోవటం చూసింది. జింక భయంతో రివ్వున దూసుకుపోయింది. 

అది అలా పారిపోతూ పారిపోతూ ఆడవిలో చెట్ల గుబురుల్లోకి వెళ్ళిపోయింది. దాని అందమైన కొమ్ములు కొమ్మలకు తగులుకుని ఇరుక్కుపోయాయి. సింహం దగ్గరికి వచ్చేస్తోంది. జింక కొమాలు వదిలించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది. అదృష్టవశాత్తు సింహం మీదపడే లోపలే కొమ్ములు బయటపడ్డాయి. బతుకు జీవుడా అని జింక వేగంగా పారిపోయింది.

మళ్ళీ సెలయేటి దగ్గరికి వెళ్ళి "ఎంత దద్బమ్మను నేను! బాగా లేవు నుకున్న పుల్లల్లాంటి కాళ్ళు నన్ను కాపాడాయి. నేను మురిసిపోయిన కొమ్ములు నాకు ప్రాణం మీదికి తెచ్చాయి." అనుకుంది.


ఈసప్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి. ఇవి 2500 సంవత్సరాల నాటివి. ఈ కథలు అన్ని ప్రపంచ భాషలలోకి అనువదించబడ్డాయి.


Post a Comment

0 Comments