బావిలో నీళ్ళు

 



అక్బర్ ఆస్థానంలో బీర్బల్ అనే మంత్రి ఉండేవాడు. ఆయన ఏ సమస్యనైనా తన తెలివితేటలతో సులువుగా పరిష్కరించేవాడు.

రాజ్యంలో ఒక జమీందారు ఉన్నాడు. అతను రైతుకి ఒక బావి అమ్మాడు. ఆ రైతు బావిలో నీళ్ళు

తోడుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు జమీందారు రైతుని ఆపాడు. "నేను నీకు బావిని అమ్మాను కానీ, అందులోని నీళ్ళు అమ్మలేదు. అవి నావి. ఆ నీళ్ళు కావాలంటే తగిన ధనం ఇచ్చి తోడుకో!" అన్నాడు.రైతుకి కోపం వచ్చింది. వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. న్యాయం కోసం అక్బర్ ఆస్థానానికి వెళ్ళారు.

అక్బర్ వారు చెప్పినదంతా విని బీర్బల్ వైపు చూశాడు. సమస్యను పరిష్కరించమన్నా

బీర్బల్ కొద్ది సేపు ఆలోచించాడు. జమీందారు వైపు చూసి ఇలా అన్నా సరే నువ్వు బావి ఒక్కటే

అమ్మావు, నీళ్ళు అమ్మలేదు కదా!" జమీందారు సంతోషంగా “అవును” అన్నాడు , బీర్బల్  అడిగాడు "బావి రైతుదేనా?"

జమీందారు "అవును" అన్నాడు.

"సరే, రైతు బావిలో నీ నీళ్లు ఉన్నాయి. వెంటనే బావిలో వేళ్ళన్నీ తోడుకొని వెళ్ళిపో లేదా నీళ్ళు పెట్టుకున్నందుకు రైతుకు అద్దె చెల్లించు" అని తీర్మానించాడు.

జమీందారు ముఖం పాలిపోయింది. చేసిన తప్పుకు అందించుకున్నాడు. రైతుని మోసం చేయాలనుకున్నందుకు

తనను క్షమించమని అక్బర్ పాదుషాని వేడుకున్నాడు సంతోషించాడు. అక్బర్ బీర్బల్ ని అభినందించాడు.


Post a Comment

0 Comments