రేలా... రేలా...
ప్రక్రియ - జానపద పాట
గేయం -
రేలా రేలా రేలా రేలా రేలారె
రేలా రేలా రేలా రేలా రేలారె
అడవి తల్లికి దందాలో - మా తల్లి అడవికి దండాలో....
అడవి చల్లంగుంటె - అన్నానికి కొదవే లేదు.
పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము.
కొండలనుండి కోనలనుండి
గోదారమ్మ పరుగులు చూడు
గోదారమ్మ పరుగులు చూడు
ఒంపులు తిరుగుతు ఒయ్యారంగా
పెనుగంగమ్మ ఉరకలు చూడు
పెనుగంగమ్మ ఉరకలు చూడు
ఏటిలోన ఊట చూడు
నీటిలోన సుడులు చూడు
అందరికీ అండగనిలిచె
అడవితల్లి అందం చూడు
| రేలా ||
కిల కిల కిలకిల కిలకిల
రామచిలుకల పలుకులు చూడు
రామచిలుకల పలుకులు చూడు
కుహూ కుహూ కుహూ కుహూ
కోయిలమ్మల పాటలు చూడు
కోయిలమ్మల పాటలు చూడు
పావురాల జంట చూడు
పాలపిట్ట పాట చూడు
అందరికీ అండగ నిలిచె
అడవితల్లి అందం చూడు
| రేలా |||| రేలా ||
Post a Comment
0 Comments