కలపండి చేయి చేయి


కవి పరిచయం 

దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి (1.11.1897 - 24.2.1980)

ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. అచ్చమైన తెలుగు కవి.

అక్షర రమ్మత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు. అందుకనే వీరి కవిత్వాన్ని శ్రీశ్రీ  ఇక్షూ సముద్రంతో పోల్చారు.

'కృష్ణపక్షం, 'ఊర్వశి", ప్రవాసము' వీరి ప్రసిద్ధ రచనలు. 

పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు


 

గేయం  

కలపండి చేయి చేయి కలపండి

పదిమంది భుజం భుజం కలపండి

చేయి చేయి కలపండి.


కొండరాళ్ళు పగులగొట్టి కోన చదును చేద్దాం

కోన వెంట దారితీసి రాదారులు వేద్దాం

కొండరాళ్ళు పగులగొట్టి కోన చదును చేద్దాం

కోన వెంట దారితీసి గోదారులు వేద్దాం

కొండ కోన లొంగ దీసి కొల్లలు పండిద్దాం

                                                   || కలపండి ||


పాడుకుంటు పనిచేస్తే పదిమందికి లాహిరి

ఆడుకుంటు పనిచేస్తే అనిపించదు చాకిరి

పాడుకుంటు పనిచేస్తే పదిమందికి లా!

ఆడుకుంటు పనిచేస్తే అనిపించదు చాకిరి

కలకత్తా కాశ్మీరం కాశీ కన్యాకుమారి

కలిపేస్తాం రైలుదారి కానకోన రహదారి

                                                      || కలపండి ||


Post a Comment

0 Comments