TS TELUGU 6TH CLASS 2021 PART- 2

 6. పోతన బాల్యం

ప్రక్రియ : కావ్యం

ఇతివృత్తం : పిల్లల ఆసక్తులు

మూలం :పోతన చరిత్రములోని - ప్రథమా శ్వాసంలోనిది.

కవి : డా, వానమామలై వరదాచార్యులు

జన్మస్థలం :  జననం : 16, 8, 1912, మరణం : 30, 10, 1984

జన్మస్థలం : వరంగల్ జిల్లా మడికొండ గ్రామం (ప్రస్తుతం : వరంగల్ అర్బన్ జిల్లా)

నివాసం : ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు గ్రామం (ప్రస్తుతం : మంచిర్యాల జిల్లా)

రచనలు : పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ (వచన కవితా సంపుటి) రైతుబిడ్డ (బుజ్జ కథల సంపుటి)

బిరుదులు : అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవిచక్రవర్తి,

పురస్కారాలు :  : పోతన చరిత్రమునకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం వారి విద్యావాచస్పతి (డిలిట్) అవార్డు

పక్రీయ : కావ్యం - కావ్యం అనగా వర్ణనతో కూడినది అని అర్థం.

 

పాఠ్యాంశ విశేషాలు:

పోతన అన్న పేరు - తిప్పన

తిప్పనకు పంచప్రాణాల వంటివాడు - పోతన

 'పైనీగ వ్రాలనీడు' అను జాతీయానికర్థం - చిన్న ఆపాయం కూడా దరిచేరనివ్వడు

తిప్పన పద్యం చదివితే దానిని విని పుస్తకం విప్పకుండానే దానిని అప్పజెప్పే ఏక సంతాగ్రాహి - పోతన

పోతనకు హరికథలు వినాలనే కోరిక ఉండేది.

చదువుల్లో పోతనకు పోతనే సాటి అనే వాక్యంలోని అలంకారం -ఉపమేయోపమాలంకారం

పోతనకు ఎదిగే వయస్సులో వేటి పై ఆసక్తి పెరిగింది - సాధు సజ్జనుల దర్శనం, హరికథా పురాణాలు వినడం, శివుని పూజించడములయందు.

 

 తిప్పన చదివెడు పద్యముఁ

జప్పున సౌకసారి వినిన సరి పోతన తా

విప్పక పొత్తము నొప్పం

జెప్పును నద్దాని నేమి చెప్పుట తెలివిన్

 

 

ఆటల మేటి విద్యల యందున వానికి పొందే సాటి కొ

ట్లాటను బాలు రంద బొకటైన నెదిర్చెడి ధాటి, తీయగా

బాటలు పాడుటందుఁ బికవాణికి వానికిఁ బోటి యెందు మో

మోటముఁ గొంకు జంకులను బొత్తుగ వీడి చరించు నాతఁడున్.

 

సాధుసజ్జన దర్శనోత్సాహ గతియు

హరికథాపురాణ శ్రవణాభిరతియు

శంభుపద సరోజార్చ నాసక్త మరియు

బెరుగసాగే వేటొక ప్రక్క బిడ్డ యెడద,

 

అర్ధాలు :

పికవాణి – కోకిల

 

భాషా భాగాలు :

నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం - (ఎర్రని)

నామవాచడానికి బదులుగా వాడేది సర్వనామం - (ఆమె)

పనిని తెలిపే మాట క్రియ - (చదివింది)

లింగవచన భక్తులు లేనిది. అవ్యయం - (కాని)

పేరును తెలిపే పదం నామవాచకం - (హైదరాబాదు)

 

ప్రకృతి - వికృతులు :

భోజనం - బోనం

నిద్ర - నిదుర

పుస్తకం - పొత్తం        


 

పర్యాయపదాలు :

పురం : పట్టణం , నగరం

ధరణి = పుడమి, అవని

కోతి = కపి, వానరము

గుడి = కోవెల, దేవాలయం

తమ్ముడు అనుజుడు అవరజుడు,అను జన్ముడు

 

 

 

సంధులు:

చిన్న పెద్దలందరికి = చిన్న పెద్దలు + అందరికి  - ఉత్వ సంధి

తనకెవ్వరేదేని = తనకు + ఎవ్వరు + ఏదేని  - ఉత్వసంధి

వెదకుంగన్పడుదాఁక =  వెదకున్ + కన్పడుదాఁక  - సరళాదేశ సంధి

బాలురందఱొకటైన = బాలురందరు + ఒకటైన -  ఉత్వ సంధి

 విస్మయమంద = విస్మయము + అంద - ఉత్వ సంధి

 దర్శనోత్సాహం = దర్శన + ఉత్సాహం - గుణసంధి

శ్రవణాభిరతి = శ్రవణ + అభిరతి - సవర్ణదీర్ఘ సంధి

 

సమాసాలు:

రామలక్ష్మణులు - రాముడును, లక్ష్మణుడును - ద్వంద్వ సమాసం

గొంకు జంకులు - గొంకును, జంకును - ద్వంద్వ సమాసం

ఆటలమేటి - ఆటలలో మేటి - షష్టీతత్పురుష సమాసం

 చిఱుతందసాధ్యుండు - అసాధ్యుడైన చిరుతడు -  విశేషణ ఉత్తరపదకర్మధారయ సమాసం

 

 

 

7. ఉడుత సాయం

ప్రక్రియ : ద్విపద

ఇతివృత్తం : సహకారం

కవి : గోన బుద్ధారెడ్డి

మూలం : రంగనాథ రామాయణంలోని - యుద్ధకాండలోనిది.

ఉద్దేశం : ద్విపదని పిల్లలకి పరిచయం చేయడం, ప్రాచీన సాహిత్యం పట్ల అభిరుచిని కల్పించడం,అడగకుండానే ఇతరులకి శక్తిమేరకు సహాయం చేయాలనే ఆలోచనా కల్పించడం ఈ పాఠం ఉద్దేశం.

కాలం :  13వ శతాబ్దం

తండ్రి : విఠల రంగనాథుడు

రచన : రంగనాథ రామాయణం (ద్విపద) (యుద్ధకాండ వరకు)

విశేషాలు : తొలి తెలుగు రామాయణం - రంగనాథ రామాయణం

గోనబుద్ధారెడ్డి కాకతీయుల సామంతరాజుగా వర్ధమానపురాన్ని పాలించేవాడు.

రంగనాథ రామాయణం ఉత్తరకాండను బుద్ధారెడ్డి కుమారులు కాచ భూపతి, విఠలనాథుడు వ్రాసారు

బుద్ధారెడ్డి తండ్రి కోరికపై రచించబడటంతో రంగనాథ రామాయణం అని పేరు వచ్చింది.

 

ప్రక్రియ :

 ద్విపద రెండు పాదాలు ఉంటాయి.పాడటానికి అనుకూలంగా ఉండేది. కావ్యం ఆసాంతం ద్విపద ఛందస్సులో వ్రాయబడితేదానిని ద్విపద కావ్యం అంటారు.

 

అర్ధాలు :

పుచ్చి – గ్రహించి

తడయక – ఆలస్యం చేయకుండా

దవ్వు – దూరం

తరుమూషికం – ఉడత

చనుదెంచి 

కమలాప్తుడు  - సూర్యుడు

చులుక – అందం

 

ప్రకృతి - వికృతులు :

భక్తి - బత్తి

దూరం - దవ్వు

సహాయం - సాయం

శక్తి - సత్తువ

 

పర్యాయ పదాలు:

పర్వతం - అద్రి, కొండ

వంతెన - వారధి, సేతువు

పచ్చిక - గడ్డి, తృణం

సముద్రం - వార్థి, కదలి వనధి

 

సంధులు:

గావింతుననుచు = - గావింతును + అనుచు ( ఉత్వ సంధి)

ఇవ్విధంబున =  ఈ+విధంబున ( త్రికసంధి)

మనమునఁజేర్చి =  మనమునన్ + చేర్చి (సరళాదేశ సంధి)

కరమొప్పు = కరము + ఒప్పు ( ఉత్వ సంధి)

నలినాప్తుడు - నలిన + ఆప్తుడు ( సవర్ణదీర్ఘ సంధి)

కరాగ్రము = కర + అగ్రము ( సవర్ణదీర్ఘ సంధి)

ఇనకులాధీశుడు =  ఇనకుల + అధీశుడు ( సవర్ణదీర్ఘ సంధి)


 సమాసాలు:

ఉడుతసాయం = ఉడుత యొక్క సాయం - షష్టీతత్పురుష సమాసం

సేతువు నిర్మాణం = సేతువు యొక్క నిర్మాణం - షష్టీతత్పురుష సమాసం

నిర్మలభక్తి =  నిర్మలమైన భక్తి - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

పాధపద్మాలు = పద్మాలు వంటి పాదములు - ఉపమానుత్తరపద కర్మధారయ సమాసం

మూడు రేఖలు - మూడు అను సంఖ్యగల రేఖలు - ద్విగు సమాసం

నలినాప్తసుతుడు   = నలినాప్తుని యొక్క సుతుడు - షష్టీతత్పురుష సమాసం

 తరుగిరులు - తరువులు, గిరులు - ద్వంద్వ సమాసం

 

అలంకారాలు:

తడయక చనుదెంచి తన మేని యిసుక

వదిగట్టపై రాల్చి వనధిలో మునింగి

తేలిగట్టునకేగి తిరుగంగఁ బొడలి

వాలిన భక్తితో వచ్చి విదుల్చె

- స్వభావోక్తి అలంకారం

 

పాఠ్యాంశ విశేషాలు:

శ్రీరాముని అదేశం మేరకు సముద్రంపై వారధిని ఎవరి ఆధ్వర్యంలో వానరులు నిర్మించారు - నలుడు

వారిధి నిర్మాణ కార్యక్రమంలో దిట్ట - నలుడు

 శ్రీరాముని అడుగు తామరలను మనస్సునందుంచుకొనినది - ఉడుత

కపికులాధీశులు ఉరుశక్తితో తరుగిరులోగి తెచ్చుచోట 'తానెంత' అని మది తలపక ప్రేమ పూని సహాయమై పొదలు చున్నది - ఉడుత

భక్తితో భగవంతుని పాదపద్మాలను మనస్సునందుంచుకొని గడ్డిపోచ సమర్పిస్తే అది కొండవుతుందని తెలిపినవాడు  - లక్ష్మణుడు

 ఉడుతను శ్రీరాముని వద్దకు తీసుకువచ్చినది - సుగ్రీవుడు

 ఉడుత వీపు పై రేఖ ఏర్పడటానికి కారణం - శ్రీరాముడు తన కుడిచేతితో దాని వీపును దువ్వటం 

 

 

 8. చెరువు

ప్రక్రియ - స్వగతం 

రచయిత లేదా రచనలోని ఒక పాత్ర తన మనోఫలకాన్ని, హృదయగతమైన తర్జనభర్జనను,జ్ఞాపకాలను, ఆనందావేశాలను, అనుభూతులను, యథాతథంగా రచించడాన్ని స్వగతం అంటారు

ఎవరికి వారు తముకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడం స్వగతం - ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది

ఇతివృత్తం -  సంస్కృతి, పర్యావరణం 

ఉద్దేశం :  భాషా సౌందర్యాన్ని పెంపొందించే జాతీయాలు, సామెతల గురించి తెలుపడం ఉద్దేశం

 నిలువ నీడకై తరువు, నిలువ నీటికై చెఱువు అనునది - సామెత

చెరువు గట్టుపై ప్రతిష్టించి పూజించేదేవత కట్టమైసమ్మ

 వానలు పదకుంటే వానల కోసం చెరువు గట్టుపై చెప్పించే పురాణ ప్రవచనం - విరాట పర్వం

చెరువులకు సప్త సముద్రాలు అని పేరు పెట్టుకున్న రాజులు - వనపర్తి రాజులు

శిల సముద్ర మెచట గలదు - మంథని

కాకతీయులు నిర్మించిన చెరువులు - రామప్ప చెరువు, పాకాల చెరువు, లక్నవరం చెరువు మొ||

'ఎప్పుడు సంపద కల్గిన' పద్యాన్ని రచించిన శతకకర్త - బద్దెన

వేటి వద్ద సాహసం పనికిరాదని పెద్దలు చెబుతాడు - నీటి వద్ద, నిప్పు వద్ద

చెరువులకు పునర్వైభవాన్ని తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకం - మిషన్ కాకతీయ

 జాతీయం :

ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష ఆర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అని అంటాం. దీనిని పలుకుబడి, నానుడి అనే పేరుతో కూడా పిలుస్తారు. వీటిని ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది.

ఉదా : చెవినిల్లు గట్టుకొని, గుండెచెరువైంది.

 

సామెత : సామ్యత నుండి సామెత ఏర్పడింది. ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆతరువాత సామెత అవుతుంది. మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్పడం సామెతల లక్షణం. సామెతలు సంక్షిప్తంగా, గూఢార్థకంగా ఉంటాయి.

ఉదా : కుండబద్దలు కొట్టినట్లు, ఉర్కబోయి బోర్లపడ్డట్లు,

 

సామెతలు :

 నానాటికి తాసుకట్టు నాగంబొట్టు

నిలువ నీడకై తరువు, నిలువ నీటికై చెరువు

చెవిలో లోపాలు - చెపితే కోపాలు

చేతులు కాలినంక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం ?

పరోపకారార్థమిదం శరీరమ్

నీటి కొలది తామర

గంగాళమంత ఉండేదాన్ని తాంబాళమంత అయిన

చేరువును పొమ్మనడమంటే కరువును రమ్మనడమే

చేర్లోబర్లను తొలి కొమ్ములకు బ్యారంపెట్టినట్లు

కలిసి ఉంటే కలదు సుఖం

అనిత్యాని శరీరాణి,అందరి సొమ్ము నాకే రానీ

నానాటికీ తిసికట్టు నాగంబొట్లు

 

జాతీయాలు:

 చెవి నిల్లుగట్టుకొని మళ్ళీ మళ్ళీ చెప్పటం

కండ్లలో నిప్పులు పోసుకొనుకోపం

తామర తంపర  - విశేష అభివృధ్ది

నిప్పులు చెరుగు కొప్పడు

కాళ్ళకు బుద్ధిచెప్పు పారిపోవు

గుండె చెరువైంది భాధ

గండి కొట్టడం – దెబ్బ తీయడం

గాలం వేయడం -

కప్పలు చేపలు బయటపడ్డాయి – అసలు రహస్యం బయట పడ్డప్పుడు

అల్లందిన్న కాకొలే  - గట్టిగా అరవడం

 


సంధులు:

ఇప్పటికైనా = ఇప్పటికీ + ఐనా - ఇత్వసంధి

ఎక్కడుంటయో = ఎక్కడ + ఉంటయో - అత్వసంధి

ప్రజలెంత =  ప్రజలు + ఎంత - ఉత్వ సంధి

నేనెవరినీ = నేను+ ఎవరిని - ఉత్వ సంధి

పోరేమిటి - పోరు + ఏమిటి - ఉత్వ సంధి

ఇవన్నీ - ఇవి + అన్నీ - ఇత్వసంధి

సోమనాద్రి - సోమన + అద్రి - సవర్ణదీర్ఘ సంధి

 

సమాసాలు:

ఆటపాటలు = ఆటలు, పాటలు - ద్వంద్వ సమాసం

ఆట స్థలం - ఆటల కొరకు స్థలం - చతుర్థ సమాసం

చేపల వేట - చేపల కొరకు వేట - చతుర్థి సమాసం

 సాగునీరు - సాగుకొరకు నీరు - చతుర్టీ సమాసం

తరతరాల చరిత్ర - తరతరాల యొక్క చరిత్ర - షష్ఠీ తత్పురుష సమాసం

సప్త సముద్రాలు -  సప్త అను సంఖ్య గల సముద్రాలు - ద్విగు సమాసం


9. చీమల బారు

ప్రక్రియ : గేయకవిత

ఇతివృత్తం : వ్యక్తిత్వ వికాసం 

ఉద్దేశం : మన చుట్టూ ఉన్న ప్రాణులను చూసి క్రమశిక్షణ, నిరంతరం శ్రమించడం వంటి గుణాలను నేర్చుకోవాలని తెలియజేసే ఉద్దేశం

కవి : పొట్లపల్లి రామారావు

మూలం : ఆత్మవేదన' కవితా సంపుటి

కాలం : 1917-2001

జన్మస్థలం : ధర్మసాగరం మండలం, తాటికాయల గ్రామం (వరంగల్ అర్బన్ జిల్లా)

రచనలు : ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు, అనే కవితా సంపుటాలు,

 

మహత్కాంక్ష, జీవితం (ఖండికలు), పగ మున్నగు అనే రచనలు;

జైలు అనే కథా సంపుటి.

విశేషాంశాలు :వాడుక భాషలో సరళమైన శబ్దాలతో,సుందర శైలిలో ఉంటుంది .

 

ప్రక్రియగేయకవిత గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితనుగేయ కవిత అంటారు.

 

Content

మనిషికి వేటి యందు శిక్షణ ఉంటే లేములుండవు - వివేకము, పొదుపు

కండ్ల ముందు ఎపుడు తిరుగు ఘనులు ఎవరు - చీమలు

చీమలను నడిపించే వారి లక్షణమేమని పొట్లపల్లి వారి అభిప్రాయం - ఇంగితజ్ఞనం

మడిమాన్యము లేకుండానే ధాన్యమును సమకూర్చునవి చీమలు

 

ఎక్కడికి, ఎక్కడికి,

ఈ సమూహ మెక్కడికి ?

కయ్యానిక, వియ్యానిక

అయ్యారె ! మీరేగుట ? అని కవి వీటిని ప్రశ్నించాడు  - చీమలను

 


అర్థాలు:

సీమ -  సరిహద్దు ప్రాంతం

కయ్యం - గొడవ

బారుకట్టి వరుసలో

ప్రాలుమాలు  - సోమరితనం

మాన్యాలలో - పోలాల్లో (నేలలో)

ఓరిమి - సహనం

కడుదుర్గం – మిక్కిలి కష్టం

లేమి – పేదరికం

 

ప్రకృతి - వికృతులు:

విద్య - విద్దె

చిత్రం - చిత్తరువు

మాన్యం - మన్నెం

 

 

సంధులు:

మీరేగెదరు = మీరు + ఏగెదరు - ఉత్వసంధి

ఎవరోయి - ఎవరు + ఓయి - ఉత్వ సంధి

మాకైనను = మాకు + ఐనను : ఉత్వ సంధి

 కోటి విద్యలైన = కోటి విద్యలు + ఐన : ఉత్వసంధి

మనిషికున్న = మనిషికి + ఉన్న - ఇత్వసంధి

ఏమేమి = ఏమి + ఏమి : ఇత్వ సంధి

గింజైన= గింజ + ఐన - వృద్ధి సంధి

ఎవరిళ్ళకు - ఎవరి+ ఇళ్ళకు  : ఇత్వసంధి

 

సమాసాలు:

సమాసం : అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్తపదంగా ఏర్పడటాన్నే సమాసం అంటారు.

ద్వంద్వ సమాసం : రెండు కాని అంతకంటే ఎక్కువగాని సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒరే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వసమాసం అంటారు.

 కూరగాయలు - కూరయు, కాయయు

గురుశిష్యులు - గురువును, శిష్యుడును

 

దేశభక్తి - దేశమునందు భక్తి - సప్తమీ తత్పురుష సమాసం

తెల్ల చొక్కా - తెల్లనైన చోక్క : విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

లక్ష్మి పతి- లక్ష్మి యొక్క పతి - షష్ఠీ తత్పురుష సమాసం

గురు దక్షిణ - గురువుకొరకు దక్షిణ - చతుర్థి తత్పురుష సమాసం

పది ఎకరాలు - పది సంఖ్య గల ఎకరాలు- ద్విగు సమాసం

 

అలంకారాలు :

1.    కళ్ళముకొక గింజయైన

కావేకొల్లలుకొల్లలు. – వృత్యానుప్రాస అలంకారం

 

2.    యేమేము నేర్వధలచి

యేటకేటికో పోయేదము. - వృత్యానుప్రాస అలంకారం


10. బాలనాగమ్మ

ప్రక్రియ : జానపద కథ

ఇతివృత్తం సాహసం

పాత్రలు నవాం భోజరాజు,లక్ష్మీ దేవమ్మా,మాణిక్యాల దేవి,వధ్ది రాజు,బాల నాగమ్మ,కార్య వధ్ది రాజు,బాల వధ్దిరాజు,మాయల ఫకీరు,గండ భేరుండ పక్షి

డా జానపదులు కథలుగా చెప్పుకునే కథలను జానపదకథలంటారు. ఇవి వాగ్రూపంలోనే ప్రసిద్ధమై ఉంటాయి.బహుకర్తృత్వం వీటి లక్షణం .

తెలంగాణా ప్రాంతంలో ప్రసిద్ధమైన జానపద కథల్లో బహుళ ప్రజాదరణ పొందినది - బాలనాగమ్మ

బాలనాగమ్మ, కార్యవధి రాజులకు వచ్చిన ఆపదను తొలగించేటందుకు బాలవధ్ది రాజు చేసే సాహసాలున్న జానపద కథ - బాలనాగమ్మ

కాశీకి పడమటి దిక్కున మున్నూరామడల దూరాన చక్రపట్నం అనే రాజ్యం ఉంది.

చక్రపట్నాన్ని పాలించే రాజు - నవాంభోజరాజు, అతని భార్య - లక్ష్మీదేవమ్మ

పిల్లల కోసం బాల మామిడి పండ్లు తినమని లక్ష్మీదేవమ్మకు చెప్పినవాడు జటంగముని

జటంగమునిఏమామిడిపండు తినమన్నడు గుట్టకు ఈశాన్యం మూలాన 4 మధ్ది చెట్ల నడుమ ఉన్న బలమామిడిచెట్టు పండు

 

 పిల్లలు పుట్టిన ఎన్ని నెలలకు  12 తలల నాగేంద్రుని చేరుకుంటానని లక్ష్మీదేవమ్మవాగ్దానం చేసినది – 9 నెలలు

ఒకటే కాన్పులో ఏడుగురు ఆడబిడ్డలకు జన్మనిచ్చినది  లక్ష్మీదేవమ్మ

వారు - సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, ఉత్తరకన్య, దక్షిణ కన్య, పగడాల సంగమ్మ, మునికన్య, బాలనాగమ్మ.

ఏడుగురు బిడ్డలను కన్నమ్మ కష్టాలు పెట్టిన మారుడు తల్లి - మాణిక్యాల దేవి

వద్దిరాజు ఏరాజ్యానికి రాజు – పానుగంటి

బాలనాగమ్మ కథలో అడవిలో విడిచివేయబడిన ఏడుగురాడబిడ్డలను తన అక్కబిడ్డలుగా గ్రహించి తన ఏడుగురు కొడుకులకు ఇచ్చి వివాహం చేసినవాడు - వద్దిరాజు

సూర్యవర్థిరాజుకు - సూర్యనాగమ్మ

శరభవద్దిరాజుకు - ఉత్తరకన్య

కామవద్దిరాజుకు పగడాల సంగమ్మ

కార్యవర్థిరాజుకు -  బాలనాగమ్మ

చంద్రవర్ధిరాజుకు - చంద్రనాగమ్మ

పాపవద్దిరాజుకు - దక్షిణకన్య

రామవధ్ధిరాజుకు - మునికన్య భార్యలు

 

నిండు గర్భవతియైన బాలనాగమ్మను బయటకు రావద్దని ఏడు గిర్రలు గీసి కోటరక్షణ తలారి రామయ్యకు చెప్పి తండ్రితో గండికోటకు పోయినది - కార్యవద్దిరాజు

నాగళ్ళ పూడిలో గాండ్ల సంగమ్మతో కలిసి ఉండేవాడు - మాయల పకీరు

మాయల పకీరు బాలనాగమ్మకు బాలింత రోగం రాకుండా విభూతి తెచ్చానని నమ్మపలకడానికి వేసిన వేషం - జంగమదేవర

గీత దాటిన బాలనాగమ్మను మాయల ఫకీరు ఏవిధంగా మార్చి తీసుకుపోయినవాడు. - నల్లకుక్కగా మార్చి

పుట్టంగనే తల్లిదండ్రిని పోగొట్టుకున్నోడివి అంటూ బాలవద్దిరాజును తూలనాడినది - నంది నర్సమ్మ

తల్లిని వెదుకుతూ వెళ్ళిన బాలవద్దిరాజు మార్గమధ్యంలో ఎవరెవరిని రక్షించాడు - పులిరాజు పట్టణం లో ప్రజలని, చిలుకవాది పట్న రాకుమార్తెను

మాయల ఫకీరు కోటలోపలికి పోవాలి అంటే మార్గం – తంబళ్ళ పెద్దమ్మ ఇంటికి పోయి ఆమె మనవణ్ణి అని చెప్పి మాలలు తీస్కొని లోపలికి పోవాలి.

 మాయల ఫకీరు ప్రాణరహస్యాన్ని ఎవరికి చెప్పాడు బాలనాగమ్మకు

మాయల ఫకీరు ప్రాణం ఎక్కడ ఉంది ఏడు సముద్రాల అవతల జీవిగడ్డ, జీవిగడ్డలోన రాతిగోడ, రాతిగోడలోన రాగికోట, రాగికోటనడుమ ఉక్కుకోట, ఉక్కుకోట లోన ఇన్నూరు యెలగచెట్లు, మున్నూరు మునగచెట్లు, నన్నూరు తాటిచెట్ల, ఐదునూర్ల యేపచెట్లు, వీటి నడుమ ముంతమామిడిచెట్టు, ఆ చెట్టు తొర్రలో ఏడు దొంతులు, అడుగున ఉన్న దొంతిల బంగారు పంజరం. ఆ బంగారు పంజరంల వజ్రాల చిలుక. ఆ చిలుక కంఠంల ఉన్నది

పాము కాటేయడం తో చనిపోయిన బాలవద్దిరాజు ని బతికించింది గండభేరుండ పక్షి

బాల వద్దిరాజు ఆయుధం – చంద్రహాసం ( కత్తి)

బాలవద్దిరాజును సప్తసముద్రాలవతల జీవిగడ్డకు తీసుకుపోయినదెవరు - గండభేరుండ పక్షి

నీవంటి దుర్మార్గుడు బతికుంటే ఈ లోకానికి చాలా నష్టం' అని వజ్రాల చిలుక మెడను విరిచేసినవాడు - బాలవద్దిరాజు

 

అర్థాలు:

మున్నూరు = 300

మున్నూరు ఆమడలు – 8 మైళ్ళు

తాకీదు – నోటీసు

దిక్కున = దిశ

సాధన = అభ్యాసం

ఆరగించాడు = తిన్నాడు

రాజులు - ప్రభువులు

శిరస్సు = తల

 

సంధులు:

వారుండిరి -వారు + ఉండిరి ( ఉత్వ సంధి)

ఎవరికెంత = ఎవరికి + ఎంత (ఇత్వ సంధి)

ఇంకొకరు = = ఇంక + ఒకరు ( అత్వసంధి)

సెలవిచ్చి - సెలవు + ఇచ్చి( ఉత్వ సంధి)

మీరెవరు - మీరు + ఎవరు( ఉత్వ సంధి)

పట్టినంత = పట్టిన + అంత ( అత్వసంధి)

ఎదైనా ఎది ఐనా : ( ఇత్వ సంధి )

 


సమాసాలు:

తల్లిదండ్రులు - తల్లియు, తండ్రియు : ద్వంద్వ సమాసం

భీమార్జునులు - భీముడును, అర్జునుడును : ద్వంద్వ సమాసం

తోడునీడలు – తోడుయును,నీడయిను ద్వంద్వ సమాసం

కాయగూరలు – కాయయిను,కూరయును ద్వంద్వ సమాసం

గండభేరుండపక్షి - గండభేరుండమను పేరు గల పక్షి : సంభావన పూర్వపద కర్మధారయ సమాసం

 

సంభాషణ ఎవరు ఎవరితో అన్నారు ? )

   “ ఎందుకచ్చినవు స్వామి నా ప్రాణాలు తీయడానికా?” – లక్ష్మీ దేవమ్మ , 12 తలల నాగేంద్రుడు తో

 “ పిల్లలకు తల్లివైన,తండ్రివి అయిన నువ్వే.కడుపులో పెట్టుకొని కాపాడుకో.మరుమానువు జేసుకోకు ” – లక్షిదేవమ్మ ,నవాం భోజరాజు తో.

 “ పిల్లలను నా కంటిపాపలలాగా చూసుకొంటా నీకేం భయంలేదు పోయ్యిరా ’ – మాణిక్యాల దేవి నవాం భోజరాజు తో

 “ బాలెంతరోగం రాకుండా ఉండటానికి బసవన్న విభూతి తెచ్చిన బాలనాగమ్మ బయ్యటకచ్చి బిచ్చం పెట్టు ” – మాయల ఫకీరు

“ గీరలుదాటి బిచ్చం బెట్టకుంటే నీ బిడ్డ నీకు దక్కదు”–మాయల ఫకీరు

“ నేను ఒక అర్థం చేసుకున్నా అది పూర్తి అవడానికి పన్నెండేళ్లు అవుతది అప్పటివరకు నిన్ను తాకదు తాగితే నీవు తల పగిలి చస్తావు ” – బాల నాగమ్మ మాయల ఫకీరు తో

 “ పుట్టంగనే తల్లిదండ్రిని పోగొట్టుకున్నోడవు ” – నంబినర్సమ్మ బాల వధ్దిరాజు

“ అడవి అవుతల ఉన్న చిలుకవాదిపట్నం రాజు కూతురు రాచపుండుతో రెండు రోజులో చనిపోతుంది”–పులి,నక్క ఎలుగుబంటి,నాగుపాము మాట్లాడుకుంటూనే బాలవద్దిరాజు విన్నాడు.

“ వీడు కర్కోటకుడు బిడ్డ పాణం దిస్తాడు వెళ్ళిపో ” – బల నాగమ్మ,బాలవధ్ది రాజుతో మాయల ఫకీరు గురించి.

“ నాయనా నా ప్రాణం దియ్యకు నీవు చెప్పినట్లు జేస్తా “ –మాయల ఫకీరు,బాలవద్ధిరాజుతో

“ నీవంటి దుర్మార్గుడు బతికుంటే ఈ లోకానికి చాలా నష్టం ” – బాలవధ్దిరాజు ,మాయల ఫకీరు తో

 

జాతీయాలు :

చిలుక పలుకులు

కన్నమ్మ కష్టాలు

కాళ్ళ భేరం

కాలం చేయుట

ఆరు నూరైనా

కడుపులో పెట్టుకొని చుసుకొనుట

అల్లారుముద్దుగా

 

వ్యతిరేఖ పదాలు

సంతోష పడటం – భాధ పడటం

సుఖం – దుఃఖం

మేలు – కీడు

విషాదం – ఆహ్లాదం

 


11. పల్లెటూరి పిల్లగాడ

ప్రక్రియ : పాట

ఇతివృత్తం : మానవీయ విలువలు / బాల కార్మికులు

మూలంపల్లెటూరిపిల్లగాడ పాటల సంకలనం లోనిది.

ఉద్దేశంగ్రామాల్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన

కవి : సుద్దాల హనుమంతు

జననం : 6, 6, 1910, మరణం : 10.10.1982

తల్లిదండ్రులు : లక్ష్మీనరసమ్మ, బుచ్చిరాములు

జన్మస్థలం : నల్లగొండ జిల్లా పాలడుగు (ప్రస్తుతం : యాదాద్రి భువనగిరిజిల్లా)

రచనలు : వీర తెలంగాణ, గొల్లసుద్దులు, రాజకీయ సాధువేశాలు, యధార్ధ భజనమాల,పల్లెటూరి పిల్లగాడ గేయం మొ||

విశేషాలు : చైతన్య గీతాలు యక్షగానాలు, బుట్ట కథలు, పిట్టలదొర కళారూపాల ద్వారాప్రజలను చైతన్యపరిచాడు. హేతువాదిగా పేరుపొందాడు.

ప్రక్రియ ఒక పల్లవి,కొన్ని చరణాలతోలయత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉండేది పాట.

 

Content

సుద్దాల హనుమంతు శతజయంతి సందర్భంగా ప్రచురించిన పాటల పుస్తకం - పల్లెటూరి పిల్లగాడ

పాలబుగ్గల జీతగాడి జీతం ఎంత - నెలకు కుంచం

పాలబుగ్గల జీతగాడు ధరించిన కాలిజోడు - తాటి జెగ్గల

పాలబుగ్గల జీతగాడి తోడు - చేతికర్ర.

పాలబుగ్గల జీతగాడికి బాటతో పనిలేకుండుటకు కారణం - తాటి జెగ్గల కాలిజోడుతో తప్పటడుగులు వేయడం

పాలబుగ్గల జీతగాడిని ఏమి కాటు వేసి ఉండవచ్చని కవి భావించాడు - ఆకుతేలు, కందిరీగలు,అడవి కీటకాలు

పల్లెటూరి పిల్లగాడు ఎందుకు వెలవెలపోతున్నాడు - చదువుకునే తోటి బాలురను చూసి బాధతో

జీవితానికి వెలుగు - చదువు

 

అర్థాలు:

పెందలాడే - ఉదయాన్నే

కొలువు = - ఉద్యోగం

ఏరు = వాగు

అడలుచూ ఎడ్చుచు

 

ప్రకృతి - వికృతులు:

అడవి - అటవి

పశువులు - పసులు

అమ్మ - అంబ

గ్రాసం - గాసం

 

 

 

సంధులు:

చింపులంగి – చింపుల అంగి - (అత్వసంధి)

నాయనమ్మ - నాయన + అమ్మ - (అత్వసంధి)

నిజాశ్రమంబు- నిజ + ఆశ్రమంబు(సవర్ణదీర్ఘ సంధి)

పోయితివయ్యా = పోయితివి + అయ్యా(ఇత్వ సంధి)

నిజమూహింప - నిజము + ఊహింపు (సవర్ణదీర్ఘ సంధి)

వలయమందు =  వలయము + అందు(ఉత్వ సంధి)

ముఖారవిందం =  ముఖ + అరవిందము - (సవర్ణదీర్ఘ సంధి)

ఎవరేమన్నారో – ఎవరు ఏమన్నారో (ఉత్వ సంధి)

నిన్నడుగ నిన్ను అడుగ (ఉత్వ సంధి)

ఇడుమకోర్చి ఇడుమకు + ఓర్చి(ఉత్వ సంధి)

ఇప్పుడేమిటి ఇప్పుడు ఏమిటి(ఉత్వ సంధి)

ఎవ్వరేమనిన ఎవ్వరు + ఏమనిన:(ఉత్వ సంధి)

నిమిషమేని నిమిషము ఏని : (ఉత్వ సంధి)

 


 

సమాసాలు:

వెలుగునీడలు = - వెలుగును, నీడయును(ద్వంద్వ సమాసం)

భూమ్యాకాశాలు = భూమియు, ఆకాశం(ద్వంద్వ సమాసం)

ధర్మాధర్మాలు = - ధర్మము, అధర్మము(ద్వంద్వ సమాసం)

శాంత్యహింసలు = - శాంతియు, అహింసయు(ద్వంద్వ సమాసం)

సూర్యచంద్రులు = సూర్యుడును, చంద్రుడును(ద్వంద్వ సమాసం)

నీతినిజాయితీలు = నీతియును, నిజాయితీయును(ద్వంద్వ సమాసం )

 

అలంకారాలు:

పల్లెటూరి పిల్లేగాడ

పనులగాచే మొనగాడ-అంత్యాను ప్రాస అలంకారం

 

ఆకుతేల్లు కందిరీగలు

అడవిలో గల కీటకాదులు - అంత్యానుప్రాస అలంకారం

 

 

 

చాలీ చాలని చింపులంగి

సగము ఖాళి చల్లగాలి

గొనేచింపు కొప్పెర పెట్టావా -. స్వాభావోక్తి అలంకారం

 

 

 

12. కాపాడుకుందాం

ప్రక్రియ - సంభాషణ

ఇతివృత్తం - పర్యావరణం

సంభాషణ - ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపునుసంభాషణ అంటారు. సంభాషణలు మనకళ్ళ ముందు పాత్రలు మాట్లాడినట్లు అనుభూతిని కలిగిస్తాయి

ఉద్దేశం - ప్రకృతిని కాపాడుకోవటం మనధర్మం అనీ తెలపడం

పాత్రలు - అన్నమ్మ, నర్సయ్య, గోపాల్, లక్ష్మీ

అన్నమ్మ -  అమ్మమ్మ

నర్సయ్య - తాతయ్య

గోపాల్ - మనువడు

లక్ష్మి - మనువరాలు

 తోకవాయ కత్తి వచ్చే ఢాంఢాం అంటూ కోతి పాట పాడినదేవరు - అన్నమ్మ

అడవి జంతువులు గ్రామాల్లోకి రావడానికి కారణం - మనుష్యులు అడవులను నరకడం

పక్షులంతరించి పోవడానికి కారణం - సెల్ ఫోన్ సిగ్నల్స్

 'మనం బతుకుతలేం మిగతా జీవులను బతకనిస్తలేమని' -  గోపాల్

 అడవుల్ని పెంచాలె, జంతువుల నుంచాలె అంటూ బాలల గేయం పాడి వినిపించినది - గోపాల్

 

 

భాషాభాగాలు

రాధ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టింది. (నామవాచకం )

అమ్ముచేసిన పాయసం కమ్మగా ఉన్నది. (విశేషణం)

గోపాలు దాక్టరే కాదు అతను యాక్టరు కూడా (సర్వనామం)

నవీన్ బాసరకు వెళ్ళి సరస్వతీ దేవిని దర్శించుకున్నాడు. (క్రీయ)

రవి ఉరుకుతూ కిందపడి అబ్బా! అని అరిచాడు. (అవ్యయం)

 

 

ప్రకృతి - వికృతి:

రాత్రి - రాతిరి

సింహం - సింగం

లక్ష్మి - లచ్చి

శక్తి -సత్తువ

ఆశ - ఆస

అడవి - అటవీ


సంధులు :

రామాలయం - రామ + ఆలయం : సవర్ణదీర్ఘ సంధి

మేనత్త = మేన + అత్త : అత్వ సంధి

దేవేంద్రుడు = దేవ + ఇంద్రుడు - గుణసంధి

నీవెక్కడ నీవు ఎక్కడఉత్వ సంధి

లేకుంటే లేక ఉంటే – అత్వ సంధి

మరేమి = మరి ఏమిఇత్వ సంధి

మనసైన మనసు ఐన ఉత్వ సంధి

ఏమంటివి – ఏమి అంటివి ఇత్వ సంధి

 

సమాసాలు:

కృష్ణార్జునులు - కృష్ణుడును, అర్జునుడును - ద్వంద్వ సమాసం

 శివకేశవులు - శివుడును, కేశవుడును:  ద్వంద్వ సమాసం

నిరాశానిస్పృహలు - నిరాశయు, నిస్పృహయు :  ద్వంద్వ సమాసం

భయాందోళనలు -భయమును, ఆందోళనయును - ద్వంద్వ సమాసం

న్యాయాన్యాయాలు - న్యాయమును, అన్యాయమును - ద్వంద్వ సమాసం

 

అలంకారాలు:

అడవుల్ని పెంచాలి

జంతువుల నుంచాలె దుబుడుక్కుడుండుం

నీళ్ళన్ని ఇంకా

బావులను పెంచాలె డుబుడుక్కుడుండుం -     అంత్యానుప్రాస అలంకారం

 

ఉపవాచకం

సోమనాద్రి

రచయిత : సురవరం ప్రతాపరెడ్డి

మూలంహైందవ వీరులు

గద్వాల సంస్థానం పాలకులు వీరికి సామంతులుగా ఉండేవారు - నిజాం నవాబు

గద్వాల సంస్థానపు రాజులలో మొదటివాడు - సోమనాద్రి (పెద్ద సోమభూపాలుడు) - భార్య లింగమ్మ

సోమనాద్రి కాలం - క్రీ.శ. 1750

గద్వాల్ కోటని నిర్మించాడు.

సోమనాద్రి తల్లిదండ్రులు - బక్కమ్మ, పెద్దారెడ్డి

గద్వాల్ సంస్థాన ఆస్థాన కవి కాణాదం పెద్దన రచించిన గ్రంథం - రామాయణం

ఆరగిద్ద యుద్ధంలో సోమనాద్రి ఎవరిని ఓడించాడు - ఉప్పేడు పాలకుడు సయ్యద్ దావూద్ మియా, రాయచూరు నవాబు బసరుజంగు ప్రాగటూరు పాలకుడు ఇదురు సాబు,

యుద్ధ పరిహారంగా సోమనాద్రి దావూద్ మియా నుండి వసూలు చేసినవి - దావూద్ మియా యుద్ధ చిహ్నాలైన నగారా, పచ్చజెండా, ఏనుగులను

“ తెల్లారేసరికి సోమనాద్రి గుర్రం ఎవరు తేస్తారో వారికి జాగీరు ఇస్తాను “ – నిజాం నవాబు

సోమనాద్రి గుర్రాన్ని తిరిగి తెచ్చిన బొచ్చెంగన్నపల్లి బోయసర్దారు – హనుమప్పనాయుడు

సోమనాద్రి కి,నిజాం నవాబుకు మధ్య యుద్ధంలో నిజాం సైన్యం విడిది – తుంగభద్ర కి దక్షిణంగా నిడుదూరు

సోమనాద్రి కి,నిజాం నవాబుకు మధ్య యుద్ధంలో సోమనాద్రిసైన్యం విడిది – కలుగొట్ల

నిజాం నవాబు నుండి యుద్ధ పరిహారంగా సోమనాద్రీ గ్రహించినవి - ఎల్లమ్మ ఫిరంగి, రామలక్ష్మణ ఫిరంగులు

 

 

 

మనజాతర- జనజాతర

యాత్ర పదానికి వికృతి - జాతర

జాతర అసలు ఉద్దేశం - మనుషులు కలుసుకోవడం, ఒక ఊరిలో జరిగిన మార్పులు, వింతలు విశేషాలు మరో ఊరికి తెలియజేయడం 

భారతదేశంలో జరిగే అతి పెద్ద జాతర - మేడారం గిరిజన జాతర

మేడారం జాతర జరిగే స్థలం - వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామం (ప్రస్తుతం : ములుగుజిల్లా)

 మేడారంలో  సమ్మక్క సారక్క జాతర సమయం - రెండేళ్ళకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి మొదలు మూడు రోజులపాటు

గిరిజన హక్కుల కోసం పోరాడి దేవతలుగా పూజింపబడే వీరవనితలు - సమ్మక్క, సారక్క

12వ శతాబ్దంలో కరీంనగర్ జిల్లా పొలవాస ప్రాంతాన్ని పాలించిన గిరిజన దొర - మేడరాజు

పులుల మధ్య ఆడుకుంటున్న సమ్మక్కను తెచ్చి పెంచి పెద్ద చేసినవాడు - మేడరాజు

సమ్మక్కను వివాహం చేసుకున్న కాకతీయ సామంతుడు - పడిగిద్దరాజు

సమ్మక్క పడిగిద్ద రాజుల సంతానం - నాగులమ్మ, సారలమ్మ, జంపన్న

కాకతీయులు పగిడిద్ద రాజు పై దాడి చేసింది యుగంధరాయిడి నాయకత్వం లో లక్కవరం వద్ద స్థావరం .

కాకతీయులతో వీరోచితంగా పోరాడి చివరికి సంపెంగ వాగులో దూకి వీరమరణం పొందినవాడు - జంపన్న

యుద్ధంలో గాయపడి చిలుకలగుట్టపై అదృశ్యమై కుంకుమబరిణగా కనిపించినది - సమ్మక్క

కాకతీయుల కులదైవం - ఏకవీరా దేవి

సమ్మక్కకు జాతర చేయించమని కలలో కాకతీయ ప్రతాపరుద్రుని అదేశించినది - ఏకవీరాదేవి

 సమ్మక్క గాయపడిన చోటు - తల్లిగద్దె

సారలమ్మ వీరమరణం పొందిన చోటు - పిల్లగద్దె

మూడవనాడు జాతరలో జరిగే చివరి ఘట్టం - దేవతల వనప్రవేశం

మేడారం జాతరలో బెల్లాన్ని ఏమని వ్యవహరిస్తారు - బంగారం

రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను ఎప్పటి నుండి అధికారికంగా నిర్వహిస్తుంది - 1996


ఎలుకమ్మ పెళ్ళి

బ్రహ్మయ్య దంపతులు తుంగభద్ర నది ఒడ్డున నివసించేవారు.

బ్రహ్మయ్య భార్య కోరిక పై గాయపడిన ఎలుకను ఎలా మార్చాడు - పాపగా

ఎలుక బుద్ధులు గల పాపకేమని పేరు పెట్టారు - మూషిక బాల

మూషిక బాల ఎవరిని తన్మయత్వంతో పూజించేది వినాయకుని

మూషిక బాల 4వ తరగతి లో ఉండగా కాపాడిన అమ్మాయి – గీత

మూషిక బాల సూర్యుని తన వరునిగా తిరస్కరించడానికి కారణం - సూర్యుడు వెలుగుచిమ్మడం

అందగాడే కాని నల్లగా ఉన్నాడు' అని మూషిక బాల ఎవరిని తిరస్కరించింది - మేఘుని

మూషిక బాల వాయుదేవుని పెళ్ళాడటానికి తిరస్కరించడానికికారణం – నిలకడలేదని

బండబారినట్లుండటం చేత మూషిక బాలచే తిరస్కరింపబడినవాడు - మేరుపర్వతుడు

 మూషిక బాల చివరికెవరిని వివాహమాడినది - మూషికరాజును

 

తెలంగాణ పల్లెలు - సంస్కృతి

కొత్త పంట:

 పంట పండంగనే ఇంట్లో చేసుకొనే పండుగ – కొత్త

 కొత్తంత పండుగలేదు - అత్తంత ఆత్మలేదు అనునది - సామెత

సంవత్సరానికి రెండుసార్లు చేసుకునే పండుగ కొత్త

కొత్త బియ్యం తీసి,వండిపదిమందిని పిలిచి కడుపు నిండా భోజనం పేట్టి పంపే పండుగ – కొత్త

యాసంగికోత్తకు  ( ఏప్రిల్,మే ) – కూరగాయల కరువు

వానాకాలం కోత్తకు – పచ్చటాకుల కరువు

“ అరువయారు రోకండ్లు ఆరు కుందెన్లు

ముప్పయారు రోకండ్లు మూడు కుందెన్లు

రారమ్మా చెలులారా రాజనాలు దంచ

రాజనాలు దంచినారు రాసివేసినారు

అడ్డాగొప్పులవారు ఇద్దరుయారండ్లు

రామాలచ్చుమనులాది లగ్గమెల్లుండి ”  - కొత్త పండుగ

 

శుభకార్యాల్లో పూజించే 'కూరాడు' అనగా  కుండ

కూరాడు ను అలంకరించి,కొత్త అన్నాన్ని నైవేద్యంగా పెట్టే పండుగ – కొత్త పండుగ

ఐదురకాల కూరలతో కుటుంబ సభ్యులు, చుట్టుప్రక్కల వాళ్ళతో బంతి

కూర్చొని తినే పండుగ కొత్త

 

రైతులు వ్యవసాయపు పనులు మొదలు పెడుతూ చేసుకునే పండుగ - సాగువాటు

 సాగువాటుకు మరొక పేరు - ఏరువాక లేదా ఏకాంక

వ్యవసాయపు పనిముట్లను శుభ్రంచేసి, ఎవరితో మాట్లాడకుండా పొలంవెళ్ళి, నాగలి కట్టి దున్ని తిరిగి వచ్చే వరకు కుటుంబసభ్యులు నిద్రపోకూడదనే ఆచారం గల పండుగ - సాగువాటు

సాగువాటు నాడు సాగకపోతే సాలంతా అగిపోతది అనునది - సామెత

సాగువాటు నాడు ఉపవాస ముందునది - రైతుదంపతులు

రైతులకు కావలసిన నాగండ్లను, గొర్రులను, కర్ర పనిముట్లను తయారుచేసేవారు - వడ్రంగులు

కొడవలి, పార, గడ్డపార, బండికమ్ములు వంటి ఇనుప పనిముట్లను చేసేది - కమ్మరివారు

కుండ, గురిగి, పటువ, ఎసుల వంటి మట్టి పనిముట్లను చేసేవారు - కుమ్మరివారు

బంగారు నగలు చేసేవారు - అవుసులవారు

పద్మశాలి వాళ్ళు బట్టలు వేస్తారు.

మేదరివాళ్ళు, ఎరుకుల వాళ్ళు - బుట్టలను అల్లుతారు.

రైతులు పండించిన పంటలను అన్ని కులాల వారికివారి వస్తువులు ఉపయోగించుకున్నందుకు  ఈ పేరుతో పంచేవారు - ఏరం

బట్టలు కుట్టి ఇచ్చేవారు - మేరవాళ్ళు

తమ దగ్గర ఉన్నది ఇచ్చి తమకు కావలసినది తీసుకోవడం - వస్తుమార్పిడి

కశికతో గీకి పిల్లలకు పెట్టే పాల కుండ అడుగున ఉంటుంది - పాలగోకు

పూర్వం పల్లెల్లో ఆడే ఆటలు - గోటీలు, చిత్ర గోనె, కబడ్డీ, గుడ్డిరాజు, ఓమనగుంటలు, గచ్చకాయలు, తొక్కుడుబిళ్ళ, పరమపదసోపానపటం, పచ్చీసు, అష్టాచెమ్మా, మట్టికుప్పలు, రేసు, కాశిపుల్ల దాల్చడి, దుస్సన్న పొడి మొ॥

ఆటలతో పాటు పాటలూ ఉండేవి - బతుకమ్మ, కోలాటం, జాజిరి, అలావా, చప్పట్లు మొ||

చెరువు నీళ్ళను పొలాలకు సమంగా పంచేవాడు - పెద్దనీరటికాడు (ఈ పదవి వంశపారంపర్యం)

చిన్న నీరటిగాళ్ళను నియమించుకునేది - రైతులు

లగ్గాలప్పుడు మైలహాలు తీసేవారు మంగలివారు కాగా సన్నాయి వాయించునది  బత్తినివారు , లగ్గాలలో పూలు అల్లి ఇచ్చేది - తమ్మలి వారు , పోలు ముంతలు, కూరాటి కుండలు ఇచ్చేవారు - కుమ్మరివారు

లగ్గాలలో పత్రికలు పంచి సమాచారమిచ్చెడివారు - చాకలివారు

ధాన్యాన్ని నిలువచేయడానికి ఉపయోగించే గది - గరిసె అగ్ర

పల్లె ప్రజల వినోదాలు - నాటకాలు, యక్షగానాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, చిందుబాగోతాలు


వాగ్గేయకారుడు రామదాసు

కవి : కంచర్ల గోపన్న (రామదాసు)

కాలం : 1620 - 1680

వ్యవహార నామం : గోపరాజు

తల్లిదండ్రులు - కామమ్మ, లింగన్న

బిరుదు : భక్తరామదాసు

జన్మస్థలం : ఖమ్మంలోని నేలకొండపల్లి గ్రామం

రచనలు - దాశరథీ శతకం, దాసబోధ, కీర్తనలు

గోదావరి - మహారాష్ట్రలోని నాసికా త్రయంబకం క్షేత్రంలో పుట్టింది. దక్షిణ భారతదేశంలోని నదుల్లోకెల్లా పొడవైనది.

గోదావరి నది ఎన్ని మైళ్ళు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది - 900 మైళ్ళు

భద్రాచల పుణ్యక్షేత్రం ఎప్పుడు రూపుదిద్దుకున్నది - 16వ శతాబ్దం తర్వాత

 తెలుగు చాటువుల్లో కనిపించే మల్కిభరాముడు - ఇబ్రహీం కుతుబ్ షా

 నేటి హైద్రాబాద్ నగరాన్ని నిర్మించినవాడు - మహమ్మద్ కులీకుతుబ్ షా |

 గోల్కొండ రాజ్యాన్ని పాలించిన చివరి రాజు - అబుల్ హసన్ కుతుబ్ షా

అబుల్ హసన్ బిరుదు - తానాషా (అంటే అర్ధం మంచిరాజు)

 తానాషా కొలువులో మంత్రి, దండనాయకుడు - • అక్కన్న

మాదన్న (ప్రధానమంత్రి) అసలు పేరు - సూర్యప్రకాశరావు

 శివాజీ, తానాషాకి సంధి జరిపింది - అక్కన్న, మాదన్నలు

కంచర్ల గోపన్న తల్లిదండ్రులు - లింగన్న, కామమ్మ

కంచర్ల గోపన్న 1620 ప్రాంతంలో ఎక్కడ జన్మించాడు - నేలకొండపల్లి

ఏ వైష్ణవదీక్షా గురువు గొప్పన్నకు బాల రామాయణాన్ని తాత్పర్య సహితంగా చెప్పడం వల్ల గోపన్న మనసులో శ్రీరాముని మహిమలు నాటుకొని పోయాయి - రఘునాధ భట్టాచార్యులు

 కంచర్ల గోపన్న భార్య - కమల

కంచర్ల గోపన్న కొడుకు - రఘురాముడు

కంచర్ల గోపన్నకు తారక మంత్రోపదేశం చేసినది - కబీరు

గోపన్నను భద్రాచలం తహసీలుదారునిగా నియమించినవాడు తానాషా

 భద్రాద్రిలో దేవతా విగ్రహాలకు ఆరులక్షల వరహాలు ఖర్చుచేసినవాడు - రామదాసు

చెరశాలలో గురదారుల కొరడా దెబ్బలు తినలేక రామదాసు పాడినపాట

అబ్బబ్బ దెబ్బలకు తాళ లేర, రామప్పా

గొబ్బున నన్నాదు కోరా

 

 రామదాసు చెరశాలలో ఎన్నాళ్ళున్నాడు - 12 సం||

ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి అనే కీర్తనని పాడినది

 రామనామము బల్కవే పాపపు జిహ్వా అనే కీర్తనను వ్రాసినది - రామదాసు

 రామదాసు రచించిన దాశరథీ శతకంలోని మకుటం - దాశరథీ! కరుణాపయోనిధీ!

'శ్రీరామ నామం మరువాం మరువాం సిద్ధము యమునికి వెరువాల వెరువాం అన్నది' - కంచర్ల గోపన్న.

ఇక్ష్వాకు కులతిలక! ఇకనైన పలుకవే రామచంద్రా!' అనే కీర్తన రాసినది - రామదాసు,

 'సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా!" అన్నది - రామదాసు

 

తలుపు తియ్యవయ్య తానీషా! నీ కియ్యెడి పై కమునియ్యవచ్చితిమయ్య' అని తానీషాతో మారువేషంలో ఉన్న రామలక్ష్మణులు అన్నారు.

మారు వేషంలో ఉన్న రామలక్ష్మణులు ఆరు లక్షల వరహాలను తానీషాకు చెల్లించి రామదాసును విడిపించారు.

 

6వ తరగతి విశేషాంశాలు

నలుడు : విశ్వకర్మ అంశతో పుట్టిన ఒక వానరుడు. ఇతడు వానర సేన లంకకు పోవడానికి సముద్రానికి సేతువు కట్టాడు.

 

గండభేరుండ పక్షి : రెండు తలలు గల పక్షి. ఇది ఏనుగులను తన్నుకొనిపోవు శక్తిగలది.

 

జానపద సాహిత్యం : జనపదం అంటే గ్రామం. జనపదాలలో నివసించేవారు. జానపదులు, జానపద సాహిత్యం ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా పుట్టిందో చెప్పడం కష్టం. జానపద సాహిత్యం మౌఖికంగా ప్రసారమవుతూ ఉంటుంది. జానపద సాహిత్యానికి కర్త ఎవరో తెలియదు. సామూహిక కర్తృత్వం, సామూహిక ప్రచారం దీని లక్షణం. జానపద సాహిత్యాన్ని అధ్యయనం చెయ్యడం వల్ల ప్రజల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవచ్చు.

 

జినవల్లభుని శాసనం : వేములవాడ చాళుక్య రాజైన రెండవ అరికేసరి ఆస్థానకవి పంపడు. పంపని తమ్ముడు జినవల్లభుడు,

ఈయన క్రీ! ఈ 940లో 'కుర్క్యాల శాసనం' వేయించాడు. ఇది తెలంగాణలో తొలి పద్యశాసనం. దీనిలోమూడు కందపద్యాలు ఉన్నాయి. కుర్క్యాల శాసనాన్నే జినవల్లభుని శాసనం అంటారు. కుర్క్యాల గ్రామం కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలో ఉన్నది.

 

అజ్ఞాతవాసం : కౌరవులు పాండవులతో పాచికలు ఆడేటప్పుడు పందెం కాస్తారు. పందెంలో ఓడిపోయినవారు పన్నెండు ఏండ్లు వనవాసం, ఒక యేడు అజ్ఞాతవాసం చెయ్యాలి. మాయాజూదంలో పాండవులు ఓడిపోతారు.

పన్నెండేండ్లు వనవాసం పూర్తయ్యాక ఒక యేడు అంతవాసం చేస్తారు. అజ్ఞాతవాసంలో ఎవరూ పాండవులను గుర్తుపట్టారు. అట్లా ఎవరైనా గుర్తుపడితే తిరిగి పన్నెండేండ్లు వనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. పాండవులు విరాటరాజు రాజ్యంలో అజ్ఞాతవాసం చేస్తారు.

 

కన్నమ్మ కష్టాలు - కష్టాల మీద కష్టాలు పెట్టడం' లేదా రాచిరంపాన పెట్టడం' అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

 

రామవారధి : తమిళనాడులోని ధనుష్కోటికి, శ్రీలంకకు మధ్యన రాముడు వారధిని నిర్మించాడని ప్రతీతి. అమెరికాలోని నాసా అంతరిక్ష పరిశోధన సంస్థ ఉపగ్రహం ద్వారా భూమి ఛాయాచిత్రాన్ని తీసింది. ఈ ఛాయాచిత్రంలో సముద్రంలో కట్టబడిన సేతువు స్పష్టంగా కనబడుతుంది. ఈ వారధి మూలంగా భారతదేశానికి 'సునామీల ప్రభావం అంతగా ఉండడం లేదు. దీనికి ఆంగ్లములో 'ఆడమ్స్ బ్రిడ్జ్' అని పేరు.

 

కాకతీయ శిలాతోరణం : తెలంగాణ చరిత్రలో సువర్ణ ఆధ్యాయం కాకతీయుల కాలం. వారు చాలా కాలంపాటు ఓరుగల్లు కోట నుండి పాలన సాగించారు. 1199లో కోట నిర్మాణానికి గణపతిదేవుడు శ్రీకారం చుడితే అరివీర భయంకర వీరనారి అయిన ఆయన కూతురు రుద్రమదేవి కాలంలో కోట నిర్మాణం పూర్తయింది. కోట ఒక అద్భుత నిర్మాణం. కోట ద్వారంగా కీర్తి తోరణాలు ఉన్నాయి. ఆ కీర్తితోరణమే ఇప్పటి తెలంగాణ రాష్ట్ర అధికార

చిహ్నం. 

Post a Comment

0 Comments