TS TELUGU 4TH CLASS 2021
4 వ తరగతి తెలుగు (తెలంగాణ)
1. తెలంగాణ వైభవం
ప్రక్రియ : గేయం
ఇతివృత్తం : తెలంగాణ గొప్పతనం
గేయం :
వీర చరితల కోన నా తెలంగాణ
తరగలై గోదారి - తలస్నాన మయ్యింది
నురగలై కృష్ణము - నీ కాళ్ళు కడిగింది
తల్లి నీ కడుపులో - తరగనన్నీ గనులు
సింగరేజీ సిరులు - నల్ల బంగరు పొరలు
||
తీయతేనియ ||
పోతన్న కైతలో - పొంగి పొరలిన భక్తి
రుద్రమ్మ చాటింది - నీ పరాక్రమ శక్తి
పాల్కురికి కవనాన - దేశి పదములబాట
పలుకే బంగారమౌ రామదాసుని పాట
|| తీయ ||
ఎములాడ వేల్పునకు - కోడె మొక్కుల కొలుపు
జాన్పాడు సైదులు వీరి దట్టిల మెరుపు
మెదకు చర్చిలో తళుకు - క్రీస్తు కథలను తెలుపు
తెలగాణదీ నేర్పు - సామరస్యము నిలుపు
రామప్ప శిల్పాల - రాజిల్లెడీ సౌరు
నింగి నంటిన తీరు - నిలిచె చార్మీనారు
అడవిలో దేవుడు - భద్రాద్రి రాముడు
ఆదివాసికి దీము - కుంఠమ్ము భీముడు
|| తీయ ||
భాగవతమును రచించిన పోతన (భక్తకవి) ఏ ప్రాంతము
వాడు ? - బమ్మెర
రాణి రుద్రమ్మ ఏ రాజవంశమునకు చెందిన వీర వనిత ?
- కాకతీయుల
తెలంగాణలో నున్న అతి పెద్ద క్రైస్తవ దేవాలయమేది
? - మెదక్ చర్చి
వీరి దట్టీలలో మెరుపులాంటి వాడెవరు - జానపాడు
సైదులు
దేశి పదాలకు పేరెన్నికగన్న కవి - పాల్కురికి
సోమనాథుడు
తెలంగాణలో తరగలై, నురగలై పాలేవి - గోదావరి,
కృష్ణా
తెలంగాణలో ఉన్న నల్ల బంగరు పారలు - సింగరేణి బొగ్గుగనులు,
ఆదివాసి ప్రజలకు ధైర్యము ఎవరు - కుమరం భీముడు
తెలంగాణలోని జానపద కళలు - పేరిణి నృత్యం,
మిమిక్రీ, ఒగ్గుకథ, యక్షగానం మొదలగునవి.
నిజాంను ఎదురించిన తెలంగాణ వీరుడు - నారాయణరావు
పవార్
తెలంగాణ రాష్ట్ర ఆదికవి - పాల్కురికి సోమన
ఆదివాసీలకు దీము ఎవరు ? - కొమరం భీమ్
గేయంలో అంత్యానుప్రాసాలంకారం కలదు.
వర్ణమాల :
ప్రస్తుతం ౘ,ౙ,ఱ అక్షరాల బదులుగా చ,జ, రఅక్షరాలను
ఉపయోగిస్తున్నాం.
ౘలి – చలి
ౘలువ – చలువ
ౘన్నీళ్ళు – చన్నీళ్ళు
ౘందమామ – చందమామ
ౙల్లెడ – జల్లెడ
ౙంకు – జంకు
ౙమ – జమ
ౙంగుపిల్లి – జంగుపిల్లి
ఱంపం -రంపం
ఱంకె - రంకె
ఱెక్క - రెక్క
ఱొమ్ము -రొమ్ము
పిల్లల్లారా రారండి ..........
ప్రక్రియ -
గేయం
ఇతివృత్తం - పిల్లల
ఆసక్తులు
గేయం :
రారండోయ్ రారండి... పిల్లల్లారా రారండి
మబ్బులనెక్కి వస్తున్నా - పడవలు చేయగ రారండి!!
సముద్రాలను నింపుకొని
మేఘాలల్లో చాచుకొని
చిటపట చినుకుల రూపంలో
మురిపెంగానే వస్తున్నా!
ఆనందాలే హద్దులుగా
ఆడుకుందాం రారండోయ్!!
కుండపోతగా కురుస్తూ
వాగులు వంకలు దాటుతూ
చెరువులు కుంటలు నింపుతూ
మీ ఇళ్ళ ముంగిట కొస్తున్నా!
సంతోషంగా గంతులు వేస్తూ
చిందులు వేయగ రారండోయ్!!
ఎరుపు, పసుపు, నీలం, పచ్చ
మెరుపు కాగితాలన్నిటితో
భలే భలేగా పడవలు చేస్తూ
వర్ణశోభితం చేసేద్దాం!
కలిసి మెలసి మీరంతా
సందడి చేయగ రారండోయ్!!
రారండోయ్ రారండోయ్ ... పిల్లల్లారా రారండోయ్ఈ
గేయంలో తన గురించి చెప్పుకున్నది - నీరు
వర్షం కురుస్తుండగా పడవలు చేసి ఆడుకుందాం అనే
గేయం - "పిల్లల్లారా రారండి"
సముద్రాలను నింపుకొని
మేఘాల్లో దాచుకొని - (అంత్యానుప్రాసాలంకారం)
2. పరమానందయ్య శిష్యులు
ప్రక్రియ : కథ
ఇతివృత్తం :
హాస్యం
పరమానందయ్య శిష్యులు ఎంత మంది - 12 మంది
పరమానందయ్య శిష్యులు వాగు దాటడానికి వారు
నిద్రపోలేదని ఎలా గ్రహించారు ? - మండుతున్న కట్టెను వాగులో ముంచగా “సుయ్' మని
శబ్దం రావటంతో వాగు నిద్ర పోలేదని గ్రహించారు.
ఒకరి చేతిని మరొకరు పట్టుకుని వాగు దాటి
లెక్కపెట్టగా ఎంతమంది తగ్గారు ? - ఒకరు.
లెక్కపెట్టేవాడు వాడిని లెక్కించకుండా మిగతా
వారిని మాత్రమే లెక్కించటం వల్ల ఒకరు తక్కువగా వస్తున్నారు.
చిన్ని కృష్ణుడు :
ప్రక్రియ -
కథ
ఇతివృత్తం–ఇతిహాసం
·
దేవకి యొక్క
సోదరుడురాక్షసుడు అయినటువంటి కంసుడు, దేవకీ వసుదేవుల ఎనిమిదవ
సంతానంగా పుట్టే బిడ్డ తనను తుధముట్టిస్తాడని వీరిని కారాగారంలో బంధించాడు.
·
కంసుని కారాగారంలో
బంధీలుగా ఉన్న దేవకీ వసుదేవులకు ఎనిమిదో వ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు.
·
వసుదేవుడు రాత్రికిరాత్రి
గోకులంలో తన స్నేహితుడైన నంద గోపాలుడు ఇంటికివెళ్లి, నందగోపాలుడి భార్య యశోద
పక్కన తన పసివాడిని పడుకోబెట్టి ఆమె పక్కన ఉన్న ఆడపిల్లలు తీసుకుని చేరుకున్నాడు
·
నందగోపునిఇంటిపక్కనవసుదేవుడురెండవభార్యరోహిణిఉంది. ఆమెకుమారుడుబలరాముడు.
·
కంసుడు
చిన్నిక్రిష్ణుడుగురించి తెలిసి చంపడానికి మొదట పంపించింది–పూతనఅనేరాక్షసి.
·
ఆ రాక్షసి గోపిక రూపంలో
గోకులానికి చేరుకుంది.
·
మరొకసారి ఉయ్యాలలోలో
పడుకున్న కృష్ణుడు చంపడానికి కాకాసురుడు కాకి రూపంలో వచ్చాడు.
·
కృష్ణుడినోట్లోవిశ్వాన్నిచూసింది - యశోద
·
దేవతమూర్తులుగాఏవిమారినవి–మద్దిచెట్లు
3. వినాయక చవితి
ప్రక్రియ :వ్యాసం
ఇతివృత్తం : సంస్కృతి,
సంప్రదాయాలు
Content :
·
గణాలకు అధిపతి
అయినందువల్ల గణపతి అని, విశిష్టమైన నాయకుడైన
అందువల్ల వినాయకుడు అని, విగ్రహాలకు అధిపతి అయినందువల్ల
విఘ్నేశ్వరుడు అని, బాణం అయిన పుట్ట కలిగి
నందు వలన లంబోదరుడు అని అంటారు.
·
భాద్రపద మాస శుక్లపక్ష
చతుర్థినాడు వినాయక చవితి జరుపుకుందాం.
·
గజాసురుడు అనే రాక్షసుని
సంహరించి కైలాసానికి తిరిగి వస్తున్న సమయంలో, నలుగు పిండితోబొమ్మను
చేసి , జీవంచేసినవినాయకుడు, శివుణ్ణిఅడ్డుకున్నాడు.
·
శివుడువినాయకుడు తలను
వేరు చేశాడు. పార్వతి దేవి రోదించడం
తోప్రమథగణాలువాళ్ళుతెచ్చినఏనుగు తలను బాలుడి మొండేనికి అతికించాడు.
·
గణేశుడి గల వాహనం
అనింద్యుడుఅనేఎలుక
·
కుమారస్వామి గల వాహనం
నెమలి.
·
గణనాయకస్థానంకోసంపెట్టినపరీక్షలోకుమారస్వామి
తండ్రి మాటలుపూర్తికాకముందే ఆతృతతో తన వాహనం ఎక్కి వెళ్ళిపోగా, గణేశుడు నారాయణ జపం
చేస్తూ శివపార్వతుల చుట్టూ భక్తితో మూడు ప్రదక్షిణలు చేశాడు.
·
ప్రాచీన గంధం ముద్గల
పురాణంవినాయకుని 32 రూపాల్లో పూజిస్తారు అని తెలిపింది.
·
వినాయక చవితి రోజున పూలతో
పాటు ప్రత్యేకంగా 21 రకాల ఆకులతో పూజిస్తారు
·
మహారాష్ట్రలో వినాయకచవితి
అత్యంత వైభవంగా చేస్తారు. జాతీయ సమైక్యత కోసం
బాలగంగాధర తిలక్ 1892లోమొదటిసారి
వినాయకచవితినీసాంఘిక సంబరంగా నిర్వహించాడు.
·
పురాణాలలోచవితి
నాడుచంద్రుని చూసిన నీలాపనిందలు వస్తాయనిపార్వతీదేవి శపించినట్లు, ఎవరైతే పూజ చేసిపూజ
అక్షతలు తలపై ఎవరు చల్లుకుంటారు వారికిరావనిశాప పరిహారంఇచ్చినట్లు తెలుపుతున్నాయి.
భాషాభాగాలు :
• సర్వనామం : నామవాచకానికి బదులుగా వాడే పదాలను
సర్వనామాలు అంటారు.
ఉదా : లక్ష్మి తెలివైన బాలిక ఆమె రోజు కథల
పుస్తకం చదువుతుంది.
లక్ష్మి - నామవాచకం ఆమె - సర్వనామం,
- ఈ క్రింది వాక్యాలలో సర్వనామాలను
గుర్తించండి.
1. రహీం బడికి వెళ్ళాడు. అతడు పరీక్ష రాశాడు -
అతడు
2 అనిత పొలానికి వెళ్ళింది. ఆమె వరి పైరు
లోసింది - ఆమె
3. పిల్లి పాలు తాగింది. అది బయటకు వెళ్ళింది -
అది
4 రవి, ఖాన్, జాన్లు కలసి ఊరికి వెళ్ళారు.
వాళ్ళు అక్కడ బట్టలు కొన్నారు - వాళ్ళు
ప్రక్రియ - వ్యాసం
ఇతివృత్తం - సంస్కృతి - సంప్రదాయాలు
·
ఈపండుగనుఈద్అని, ఈద్–ఉల్–ఫితర్అనివ్యవహరిస్తారు.
·
ఈపండుగఫసలికాలమానంప్రకారంరంజాన్నెలమొదటిరోజునుండిప్రారంభంఅవుతుంది. ఆరోజురాత్రిచంద్రుడిదర్శనంచేసూకొన్నోపటికినుండిముప్పైరోజులుఈపండుగజరుపుకొంటారు.
·
పగలుకనీసంఒక్కచుక్కమంచినీరుఅయినముట్టకూడదునియమంపాటిస్తారు. చాలావరకుఈనెలలోజకాత్పాటిస్తారు.
·
సంవత్సరానికిఒకసారితమఆస్తి, సంపదలపైఓలెక్కాప్రకారంపేదలకుచేసేదానధర్మాలనే “ జకాత్”అంటారు.
·
ఆకలి, దప్పికలకుసంబంధించినఅనుభూతులనుధనికులకుఅనుభవంలోకితెచ్చేపండుగఇదిఅనివారినమ్మకం.
·
ప్రతిరోజుమసీదుకువెళ్లికనీసం 5 రోజులునమాజుచేస్తారు. వీటితోపాటుప్రత్యేకనమాజ్“తరావిహ్ “ చేస్తారు.
·
రంజాన్మాసం లోపవిత్రమైన
ఖురాన్ఉద్భవించిందని మహమ్మదీయుల విశ్వాసం.
·
సూర్యోదయానికి గంటన్నర
ముందే భోజనాలు చేస్తారు ఇలా చేస్తే ఉపవాస ప్రారంభాన్నిసహీరీఅంటారు.
·
పగలంతా ఉపవాసం ఉండి
సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం విడిచిన తార్వత్త నమాజ్ చేస్తారు. ఈ ఉపవాసం విడవడానికి ఇఫ్తార్ అంటారు.
·
రంజాన్నెలతర్వాత షవ్వాల్ నెల ప్రారంభంఅవుతుంది. మొదటి రోజు చంద్ర దర్శనం
చేసుకుంటారు. మరునాడు ఉపవాస దీక్షలు
విరమిస్తారు.
·
ఈద్గాకువెళ్లిసామూహిక
ప్రార్ధనలు చేస్తున్నారు.
4. దేశమును ప్రేమించుమన్నా
ప్రక్రియ -
గేయం
ఇతివృత్తం :
దేశభక్తి
గురజాడ అప్పారావు :
కాలం :
1862 - 1915.
జననం : 21 సెప్టెంబరు - 1862
మరణం - నవంబరు 30, 1915,
తల్లిదండ్రులు : కౌసల్యమ్మ, వేంకట రామదాసు,
బిరుదులు : అభ్యుదయ కవితాపిలామహుడు, మహాకవి,
కవిశేఖర, నవయుగవైతాళికుడు, ఆధునిక యుగకర్త
రచనలు : దేశభక్తి,
కన్యాశుల్కం నాటకం, ముత్యాలసరాలు, నీలగిరి పాటలు,
అనువాద నాటకాలు : బిల్పజీయం, కొండు భట్టీయం,
సంస్కృత రచనలు : మాటల మబ్బులు, పుష్పలావికలు,
మెరుపులు, ఋతుశతకం. కథానికలు దిద్దుబాటు,
మీ పేరేమిటి ? మతం - విమతం, సంస్కర్త హృదయం, మెటిల్డా,
విశేషాలు : ముత్యాలసరాలు
అనే మాత్రాఛందస్సును సృష్టించారు.
'దేశమును ప్రేమించుమన్నా' పాఠం "గేయ'
ప్రక్రియకు చెందినది.
" దేశమును ప్రేమించుకున్నా ... అనే
దేశభక్తి గేయం రచయిత - గురజాడ అప్పారావు
తిండి కలిగితే కండ కలదోయి
కండ కలవాడేను మనిపోయి ...... అని అన్నది -
గురజాడ అప్పారావు
దేశాభిమానము నాకు కద్దని
నట్టి గొప్పలు చెప్పుకోకోయి
పూరియమైనను, వాదమేలు
కూర్చి జనులకు చూపవోయి - గురజాడ దేశభక్తి గేయం
"దేశమును ప్రేమించుమన్నా'
కళారత్నాలు:
ప్రక్రియ -
గేయం
ఇతివృత్తం -
కళలు - కళాకారులు.
పై గేయంలోని అలంకారం - అంత్యానుప్రాసాలంకారం
తెలంగాణ ప్రముఖ పేరిణి నాట్యకళాకారుడు .
రామకృష్ణ
తెలంగాణ పల్లె ప్రజల అందాలు, పల్లె చిత్రాలకు
ప్రసిద్ధి గాంచిన చిత్రకళాశారుడెవరు ? - కాపు రాజయ్య
అడవి అందాలను చిత్రించి, చిత్రకళకే అందాలు
తెచ్చిన తెలంగాణా కళాకారుడెవరు ? - కొండపల్లి శేషగిరిరావు
జానపద కీర్తి జగమంతా చాటి చెప్పిన ఒగ్గు
కళాకారుడు - మిద్దె రాములు
5. చిన్నారి కల
ప్రక్రియ : కథనం
ఇతివృత్తం -
పర్యావరణ పరిరక్షణ
పాత్రలు: ప్రజ్ఞ,కాగితం
సంచులు
ఉద్దేశం :
ప్లాస్టిక్ మనరు ఎలా నష్టం కలిగిస్తున్నదో, దాని వాడకాన్ని ఎందుకు తగ్గించుకోవాలో
తెలిపే ఉద్దేశ్యం ఉన్న పాఠ్యాంశం - చిన్నారి కల
చిన్నారి కల పాఠంలో బాలిక పేరు –ప్రజ్ఞ
ఇప్పుడంతా ప్లాస్టిక్ యుగమే కదా ! కాగితపు
సంచులు ఎవరికి కావాలి ? ఎటుచూసినాప్లాస్టిక్ ! ప్లాస్టిక్ అన్నది - కాగితపు సంచి
ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంతగా
ఉన్నాయి - కాని వాటిని వృథా చేసేంతగామనకు లేవు' అన్న ఈ మాటలు ఎవరివి ? –
గాంధీజీ
భాషా భాగాలు
పనిని తెలిపే పదాలను క్రియాపదాలు అంటారు.
ఉదా : వెళ్ళాడు, వచ్చాడు. ఆడుతున్నాడు.
వస్తున్నాడు మొదలయినవి.
1. తాత గుడికి వెళ్ళాడు.
2. నాన్న పొలం నుంచి వచ్చాడు.
2. రాధ పుస్తకం చదువుతున్నది.
3. పిల్లలు ఆటలు ఆడుతున్నారు.
గుణాలను తెలిపే పదాలను విశేషణాలు అంటారు.
ఉదా : అందంగా, చేదుగా, ఎర్రని, మంచి వంటివి.
1. పాలపిట్ట అందంగా ఉంది.
2. నేను జాతరలో ఎర్రని గాజులు కొన్నాను.
3. వేపకాయ చేదుగా ఉంటుంది.
4. రేష్మ చక్కగా పాడుతున్నది.
5.. రహీం, యూసప్లు ఇష్టంగా ఐడికిపోతారు.
6. సుమతీ శతకం
ప్రక్రియ : పద్యాలు
ఇతివృత్తం - నైతిక విలువలు,
బద్దెన రాసిన శతరం - సుమతీ శతకం
సుమతీ శతక పద్యాలు కందం అనే ఛందస్సులో ఉన్నాయి.
ఉపకారికి నుపకారము
విపరీతము కాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాఁడు నేర్పరి సుమతీ.
చీమలు పెట్టిన పుట్టలు
పాములకిరవైనయట్లు పామరుఁడు తగన్
హేమంబు కూడఁ బెట్టిన
భూమీశులపాలఁ జేరు భువిలో సుమతీ.
తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
దన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ.
ఎప్పుడు సంపద గలిగిన
నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పులుగఁ జెఱువు నిండినఁ
గప్పలు పదివేలు చేరుఁ గదరా సుమతీ.
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపందగున్
కని కల్ల నిజము తెలిసిన
మనుజుఁడె పో నీతిపరుఁడు మహిలో సుమతీ.
బలవంతుఁడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీములచేతఁ జిక్కి చావదె సుమతీ.
కూరిమిగల దినములలో
నేరము లెన్నఁడును గలుగనేరవు మఱియా
కూరిమి విరసంబైనను
నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ.
లావు గలవాని కంటెను
భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండా
గ్రావంబంత గజంబును
మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ.
ఆ మనకు మేలు చేసిన వాడికి మేలు చేయడం గొప్ప
కాదు, మనకు కీడు చేసిన వానికి కూడా మేలు చేయడమే గొప్పదనం అన్న భావం ఉన్న పద్యం -
ఉపకారికి నుపకారం, నెపమెన్నక .
చీమలు పెట్టిన పుట్టలు
పాములకిరవైనయట్లు,అత్యాశతో దాచిన సొమ్ము ఎవరి పాలవుతుంది ? - రాజుల పాలవుతుంది.
బంధువులను బద్దెన వేటితో పోల్చాడు - కప్పలతో
శాంతమే రక్ష, సంతోషమే స్వర్గము అని తెలియజెప్పే
బద్దెన పద్యం - తన కోపమే తన శత్రువు ....
కండబలం కంటే బుధ్ధి బలం గొప్పదని తెలియజేసే
పద్యం - లావుగల వానికంటెను
భాష భాగాలు
విశేషణాలు - వేగం , పెద్దది, అందమైన మొదలైనవి
ఉదా : 1. విండీస్ వేగంగా తొలింగ్ చేసేవాడు.
2. రామప్ప చెరువు చాలా పెద్దది.
3. మంజీరా నదిలోని నీళ్ళు తియ్యగా ఉంటవి.
4. భువనగిరికోలు విశాలంగా ఉన్నది.
5.రామాపురం ఐడిలో అందమైన తోట ఉన్నది.
అర్ధాలు:
భూమీశులు = రాజులు
కల్లలు = అబద్ధాలు
కూరిమి = స్నేహము
హేమం = బంగారం
నిక్కముగా =
నిజంగా
తథ్యము =
తప్పకుండా
7.నేను ..... గోదావరిని
ప్రక్రియ : ఆత్మకథ
ఇతివృత్తం : దర్శనీయ
స్థలాలు
ఉద్దేశం : నదీతీర ప్రాంతాల్లో అనేక పుణ్యక్షేత్రాలున్నాయి.
మన తెలంగాణ రాష్ట్రంలోని దర్శనీయ స్థలాల గురించి తెలపడం ఉద్దేశం
పాఠ్యాంశ విశేషాలు
·
గోదావరి నది
మహారాష్ట్రలో నాసిక్ దగ్గర త్రయంబకం వద్ద పుట్టింది.
·
మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్నది.
·
దక్షిణ
భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే నదుల్లో మొదటిది - గోదావరి
·
గోదావరి
నదిని దక్షిణ గంగ', 'తెలివాహ నది అనే పేర్లతో కూడా పిలుస్తారు.
·
తెలంగాణలో
ప్రవేశించే చోటు - కందకుర్తి, నిజామాబాద్ జిల్లా
·
కందకుర్తి (నిజామాబాద్) లో సంగమేశ్వర ఆలయం ఉంది.
·
తెలంగాణలో
గోదావరి ఉపనదులేవి ? - మంజీరా, హరిదా
·
గోదావరి నది
సప్తగోదావరిగా ఏ ప్రాంతంలో చీలును ? - నిర్మల్
జిల్లా బాదనకుర్తి వద్ద
·
భారతదేశంలో
రెండవ అతి ప్రాచీనమైన సరస్వతి దేవాలయం - బాసర,
·
సరస్వతి
మూర్తిని వేదవ్యాసుడు ఇసుకతో ఇక్కడ ప్రతిష్టించాడని పురాణాలు చెప్తున్నాయి.
·
మంచి గా
చదువు రావాలని బాసర లో చేసే మొక్కు –ఉర్లోభిక్షాటన
చేసి,నిద్ర చేస్తారు.
·
గోదావరి
నదిపై పోచంపాడు దగ్గర ఉన్న ఆనకట్ట - శ్రీరాం
సాగర్ ప్రాజెక్ట్
·
నిర్మల్
జిల్లా బాదనకుర్తి వద్ద గోదావరి నది ఏడు పాయలుగా చీలి ఏ పేరుతో పిలువబడుతున్నది ?
-
సప్త గోదావరి
·
ధర్మపురి
నరసింహ క్షేత్రం ఏ నది ఒడ్డున కలదు ? - గోదావరి నది, జగిత్యాల జిల్లా
·
భూషణ వికాస
శ్రీ ధర్మపుర నివాని, దుష్ట సంహార
నరసింహ దురితదూర !" అని కీర్తిస్తూ ఇక్కడే నరసింహ శతకం శేషప్ప కవి రాశారు.
·
ఇక్కడ రెండు
నరసింహ దేవాలయాలు కలవు – యౌగ నరసింహ స్వామి,ఉగ్ర
నరసింహస్వామి దేవాలయం.ఇసుక తో చేసిన స్తంభం కలదు.
·
ధర్మపురిలో
గోదావరి గుండాల రూపంలో కనిపిస్తుంది. అవి - యమగుండం, బ్రహ్మగుండం, సత్యవతి గుండం, చక్రగుండం.
·
ఇక్కడ
గోదావరి నది ఒడ్డున హన్మంతుని గుడి, సంతోషిమాత, దత్తాత్రేయుడు, శ్రీరాముని గుళ్ళు కూడా ఉన్నాయి.
·
సోమ, బుధవారాల్లో ప్రత్యేకించి గోదావరిని పూజించి మొక్కులు
తీర్చుకొంటారు.
·
గంగా స్నానం - నర్సయ్య దర్శనం',
·
'ధర్మపురి
చూస్తే యమపురి ఉండదు' అనే మాటలు ధర్మపురి ప్రసిద్ధిని తెలియజేస్తున్నాయి.
కోటిలింగాల
:
·
కోటిలింగాల
శాతవాహనుల మొదటి రాజధాని. హాలుడు తన
మూలము గాథాసప్తశతి సంకలనం చేసింది ఇక్కడే.
·
మెగస్తనీస్
ఇండికా' గ్రంథంలో ఈ 'కోటిలింగాల' అనే నగరాన్ని పేర్కొన్నాడు.
·
గోదావరి నది
ఒడ్డున గోదావరిఖని ప్రాంతంలో బొగ్గు గనులు గలవు.
·
రామగుండం
విద్యుత్ కేంద్రం ద్వారా దాదాపు దక్షిణ భారతదేశానికంతా వెలుగు పంచుతున్నది..
·
మంథని మీదుగా
వెళ్తూ, అక్కడ ఒడ్డున
గౌతమేశ్వర, భిక్షేశ్వర ఆలయాలను కలిగి ఉన్న నది - గోదావరి
·
మంత్రకూటంని
ఇప్పుడు మంథని అని పిలుస్తున్నారు. గతంలో దీనిని
మంత్రపురి అనేవారు.
·
కరీంనగరు, ఆదిలాబాదు జిల్లాలను కలిపే వంతెనను గోదావరిపై ఏ ప్రాంతంలో
కట్టారు ? - రాయపట్నం
వద్ద
·
తెలంగాణలో
అతి ప్రాచీనమైన సత్యనారాయణ స్వామి గుడి ఎచట గలదు ? - అదిలాబాద్
జిల్లా గూడంగుట్ట'లో (ప్రస్తుతం : మంచిర్యాల జిల్లా)
·
హాలుడు
గాథాసప్తశతి (700 గాథలు)ని, ప్రాకృత భాషలో ఎక్కడ రచించాడు ? - కోటి లింగాలలో
·
గొప్ప
కోటగోడలు గల నగరం కోటిలింగాలు అని ఏ చరిత్రకారుడు చెప్పెను ? - మెగస్తనీస్ ఇండికా గ్రంథంలో
·
అతి
ప్రాచీనమైన శిక్షేశ్వరుని గుడి ఓంకారేశ్వరుని గుడి, శీలేశ్వర
సిద్ధేశ్వర ఆలయం, మహాలక్ష్మీ ఆలయం ఎచ్చట గలవు ? - మంథనిలో
·
మంథని కొద్ది
దూరంలో మొసళ్ళ సంరక్షణా కేంద్రం గలదు.
·
చెన్నూరులో
ఉత్తర దిక్కుకు ప్రవహించడం వల్ల గోదావరిని ఉత్తర వాహిని గోదావరి అని పిలుస్తారు.
·
చెన్నూరులో
అగస్త్య మహాముని స్థాపించిన అంటా అగస్త్యేశ్వరాలయం, జగన్నాధ
స్వామి ఆలయం ప్రసిద్ధమైనవి.
·
త్రివేణి
సంగమం - కాళేశ్వరం
దగ్గర గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదుల కలయిక.
·
వరంగల్లులో
జరిగే ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర - సమ్మక్క
సారలమ్మ జాతర
·
ఖమ్మం
జిల్లాలో ఉన్న రామాలయం - భద్రాచలం (ప్రస్తుతం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)
·
ఏ ప్రాంతంలో
ఒకే పానమట్టంపై రెండు లింగాలు ఉన్నాయి ? - కాళేశ్వరంలో (కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు)
·
తెలంగాణ
రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి నది ఏ కొండల గుండా
ప్రవహిస్తుంది ? - పాపికొండలు
·
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలిసిపోయే నది - గోదావరి
·
12 సంవత్సరాలకొకసారి
గోదావరి పుష్కరాలు జరుగుతాయి.
·
మొత్తానికి
గోదావరి తెలంగాణాలో ఎక్కువ కిలోమీటర్లు ప్రవహిస్తుంది.
·
తెలంగాణలో
అడవుల జిల్లా అని ఖమ్మం జిల్లాను పిలుస్తారు.
భాషా
భాగాలు
అవ్యయాలు : లింగ, విభక్తి వచనాలు లేనివి
అవ్యయాలు - ప్రతి, ఆను. ఆహా! ఓహో మొదలైన పదాలతో కూడినవి అవ్యయాలు
ఉదా :
1. ప్రతిదినం నేను వ్యాయామం చేస్తున్నాను,
2. తను పిల్లల్ని అనుక్షణం కంటికి రెప్పలా
కాపాడుతుంది.
3. ఆహా! ఈ భవనం ఎంత అందముగా నున్నది.
4. ఓహో! ఈ తోట నందన వనంలా యున్నది.
8. ఎలుక విందు
ప్రక్రియ : గేయకథ
ఇతివృత్తం : భాషాభిరుచి
కవి : దాశరథి
కృష్ణమాచార్య
ఆ పిల్లిని ఎలుక విందుకు పిలవగా, పిల్లి విందు
ఆరగించి, ఎలుక పిల్లలను తినబోగా అక్కడ ఉన్న అన్ని ఎలుకలు పిల్లిపై తిరగబడటం పాఠం
యొక్క సారాంశం.
ఎలుక వచ్చి పిల్లి బావనే మనన్నది ?
అలక వీడి తన యింటికి రమ్మనన్నదీ - ఈ పంక్తులు ఎలుక విందు' లోనివి.
పిల్లిని భోజనానికి పిలిచినదెవరు? - ఎలుక
ఎలుక
తల్లి పిల్లిని ఎక్కడ కూర్చోబెట్టింది ? - వెండి పూల పీట మీద
పిల్లిని రోకలితో తల మీద కొట్టినది - ఎలుక
తల్లి
పిల్లిపోయి ఎక్కడ దాక్కొనెను ? - తీగల పొదలో
పంటసిరి:
ప్రక్రియ : గేయం
ఇతివృత్తం - శ్రమ పట్ల గౌరవం
రచయిత - రావెళ్ళ వెంకట రామారావు
రైతులను ఉత్తేజపరుస్తూ రావెళ్ళ వెంకట రామారావు
రాసిన గేయం - పంటసిరి
కదలరా! వడివడిగ
పదను చెడకుండ
అదనులో విత్తనము
వెదజల్లవలెను ఈ పంక్తులు ఏ గేయంలోనివి - పంటలసిరి
విరామ చిహ్నాలు :
ఫుల్ స్టాప్ ( ) : వాక్యం పూర్తి అయిన చోట ఉంచే
బిందువు ( 1 ) ను వాక్యాంత బిందువు అంటారు.
కామా ) : వాళ్యం మధ్యలో, పేర్ల మధ్యలో అవసరమైన
చోట విరామం ఇచ్చే గుర్తు ( ) ను 'కామా' (స్వల్ప విరామ చిహ్నం) అనిఅంటారు
9. బొమ్మ గుర్రం
ప్రక్రియ :
కథ
ఇతివృత్తం :
పిల్లల స్వభావం
ఉద్దేశం :
పిల్లల మనసులోని భావాలను, ఇష్టాయిష్టాలను తోటి పిల్లలే అర్థం చేసుకోగలరు. కల్మషం
లేని మనసులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో తెలియజేయడమే
ఈ పాఠం ఉద్దేశం.
మూలం
: చిల్డ్రన్ బుక్ ట్రస్ట్ ద్వారా
ప్రచురితమయిన దీపా అగర్వాల్ రాసిన కథ.
పాత్రలు -
రాములమ్మ, రాములమ్మ అమ్మానాన్నలు, చిన్నపాప,గుర్రపు బొమ్మ.
రాములమ్మ తల్లిదండ్రులు సుత్తెలు, పట్టుకార్లు,
గుర్రపు బొమ్మలు తయారు చేసి అమ్మేవారు.
రాములమ్మ దగ్గర ఉన్న గుర్రపు బొమ్మ కావాలని
మారాం చేసి, మంకు పట్టు పట్టింది
- బొమ్మలు కొనటానికి వచ్చిన పాప.
పాప బొమ్మ గుర్రం బదులుగా తన దగ్గరున్న అందమైన
బొమ్మను రాములమ్మకి ఇచ్చివేయటంతో రాములమ్మ సంతోషించింది.
సంభాషణ (ఎవరు ఎవరితో అన్నారు ? )
“నువ్వు వాటితో వాడితే అవి మాసిపోతాయి'. – రాములమ్మతల్లి
“వీళ్లంతా నీకు అన్నయ్యలు వాళ్ళతో కబుర్లు చెప్పు” -;రాములమ్మ తను తయారు చేసుకున్న బొమ్మతో.
విరామ
చిహ్నాలు :
ప్రశ్నార్థకం : వాక్యాలకు చివరన, సందేహాన్ని
వ్యక్తపరిచే చిహ్నం ప్రశ్నార్ధకం (?)
ఉదా : ఎవరు మీరు?
మీ పేరేమిటి?
వాక్యానికి చివర ప్రశ్నార్ధకం (?) ఉంటే ఆ
వాక్యాలను ప్రశార్థక వాక్యాలు అంటారు.
ఆశ్చర్యార్ధకం : ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని,
భయాన్ని మొదలైన భావాలను తెలిపేది ఆశ్చర్యార్థకము (!).
ఉదా : అబ్బో ! ఆ గుర్రపు బొమ్మ ఎంత బాగుందో !
వామ్మో ! ఎంత పెద్ద భవనం !
ఎవరు నేను?
ప్రక్రియ -
గేయం
ఇతివృత్తం -
ప్రకృతి, పర్యావరణం
ఎవరు నేను పాఠంలో తనను గురించి చెప్పుకున్నది ?
- చెట్టు
నా కొమ్మలు ఎక్కి ఎక్కి
నా రెమ్మలు నక్కి నక్కి - అంత్యానుప్రాసాలంకారం
10. మాటల ప్రయాణం
ప్రక్రియ :
కథనం
ఇతివృత్తం :
సామాజిక స్పృహా
పాత్రలు :
రాబర్ట్ (తండ్రి), డేవిడ్ (కొడుకు) మేరి, ఇక్బాల్ (పోస్టు మ్యాన్)
ఉద్దేశం :
మన సామాజిక సేవా సంస్థలలో ఒకటైన తపాలా వ్యవస్థ, దాని ప్రాధాన్యం గురించి
తెలియజేయటమే ఈ పాఠం ముఖ్యోద్దేశం.
డేవిడ్ తీసుకున్న ఉత్తరం ఎవరు రాశారు - మేరి
ఈ ఉత్తరం మేరీ ఎక్కడి నుంచి రాసింది -
బాన్సువాడ (నిజామాబాద్ జిల్లా) (ప్రస్తుతం : కామారెడ్డి జిల్లా)
మేరీ వాళ్ళ నాన్న రాబర్ట్ ఎక్కడ ఉంటారు -
పాల్వంచ (ఖమ్మం జిల్లా) (ప్రస్తుతం : భద్రాద్రి కొత్తగూడెం)
పోస్టాఫీసులోని పోస్టుమ్యాన్ పేరు - ఇక్బాల్
గోపాల్పూర్ నుంచి ఉత్తరం రాసినది - జి. రేణుక
రేణుక ఎవరికి ఉత్తరం రాసింది - జయతి (నయీంనగర్,
హన్మకొండ, వరంగల్ అర్బన్ జిల్లా)
పోస్టు ముందువైపు తేది, ఊరి పేరు, చిరునామా,
ఎవరికి ఎలా పంపించాలన్న విషయాలు ఈ పాఠంలో ఉన్నాయి.
PIN - పోస్టల్
ఇండెక్స్ సంబర్ (Postal Index Number)
పోస్టాఫీసు సేవలు పడిపోవటానికి, వాడకం
తగ్గటానికి కారణం SMS, E-mail సౌకర్యాలు
రావటం.
ఉత్తరానికి కుడి భాగంలో ముందు తేది దాని కింద
ఊరు పేరు వ్రాయాలి.
-ఉత్తరంలో సంభోధన పెద్ద వాళ్ళకు (పూజ్యులైన)
పెద్దలు చిన్నవారికి రాసేటప్పుడు (చిరంజీవి,
ప్రియమైన)
రాయాలనుకున్న ప్రధాన విషయం లేఖ మధ్యలో
వ్రాయాలి.
చివరలో
ఉత్తరం వెనుక భాగంలో ఎమదవైపున ఉత్తరం వ్రాసేవారి పేరు చిరునామా వ్రాయాలి.
లేఖకు కుడివైపున ఎవరికి రాస్తున్నాయో వారి
పేరు, చిరునామా వ్రాయాలి.
ఆరంకెలలో ఎడమ నుండి కుడికి మొదటి అంకె
రాష్ట్రాన్ని, రెండో అంకె మూడో అంకె జిల్లాను, చివరి మూడంకెలు తపాల కార్యాలయాన్నిసూచిస్తాయి.
తెలుగు తిధులు:
తెలుగులో రోజులను తిథులు అని పిలుస్తాం.
నెలలో
మొదటి 15 రోజులు శుక్లపక్షం, తర్వాత 15 రోజులను కృష్ణపక్షం అని పిలుస్తాం.
పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు వచ్చే మొదటి 15
రోజులు - శుక్లపక్షం
పూర్ణిమ తర్వాత పాద్యమి నుంచి అమావాస్య వరకు
వచ్చే 15 రోజులు - కృష్ణపక్షం
1. పాడ్యమి
2. విదియ
3.తదియ
4. చవితి
5. పంచమి
6. షష్ఠి
7. సప్తమి
8. అష్టమి
9. నవమి
10. దశమి
11 ఏకాదశి
12. ద్వాదశి
13. త్రయోదశి
14 చతుర్దశి
15. పూర్ణిమ / అమావాస్య
AUTHOR
SATHISH RAO
9000089049
Post a Comment
8 Comments
Super sir 10th class varsku ilanti material andinchandi sir
ReplyDeletetappakunda mee sahakaram unte andachesthanu
DeleteDownload chedaniki raavatle sir
ReplyDeleteReply SIR download cheyadam ela sir
ReplyDeletedownload cheyaleru kavalsinapudu eppudaina chusukovachu
DeletePDF format cheyandi sir
ReplyDeleteDownload chesukoni chaduvukuntam..... please
Sir TS 7th class telugu pettandi si
ReplyDelete7th TS telugu when will come sir
ReplyDelete