TS TELUGU 6TH CLASS 2021 PART-1
6 వతరగతి

1. అభినందన
ఇతివృత్తం -
దేశభక్తి , శ్రమ గౌరవం
ప్రక్రియ - గేయం
మూలం: స్వరభారతి
కవి : శేషం
లక్ష్మీనారాయణాచార్యులు
జననం : 15.04.1947, మరణం : 17.5. 1998
జన్మస్థలం - కరీంనగర్ జిల్లా నగునూరు
తల్లిదండ్రులు : కనకమ్మ, నరహరి స్వామి
వృత్తి : తెలుగు భాషోపాధ్యాయుడు (రంగారెడ్డి
జిల్లా)
సాహిత్య సృజన : పద్య, వచన, గేయ కవిత్వాలు,
దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డ విమర్శనా
వ్యాసాలు
ప్రత్యేకత : లలిత మనోహరమైన దైవభక్తి దేశభక్తి
గీతాల రచన
ప్రక్రియ : గేయం
అనగా పాడగలిగేది అని అర్ధం,
పాఠ్యాంశ విశేషాలు :
'వందనాలు వందనాలు అభినందన చందనాలివే' అనే
అభినందన గేయం ఏ గ్రంథంలోనిది- స్వరభారతి (గేయ సంకలనం)
అభినందన గేయంలో లక్ష్మీనారాయణాచార్య ఎవరిని
అభినందించాడు - రైతులను, సైనికులను
జైజవాన్ జైకిసాన్ అని పిలుపునిచ్చినవాడు - లాల్
బహదూర్ శాస్త్రి
భరతమాత పురోగతికి ప్రాతిపదికలను ఘనులెవరు -
రైతులు, సైనికులు
కంటికి కనురెప్పలాగ, చేనుచుట్టు కంచెలాగ,
జన్మభూమి కవచమైన ఘనవీరులు - జవానులు
'రుధిరం స్వేదమ్ము కాగ
పసిడిని పండించునట్టి
ప్రగతి మార్గదర్శకులకు వందనాలు' అంటూ శేషం లక్ష్మీనారాయణాచార్య గారు అభినందించినది -
రైతులు.
భరతమాత పురోగతికి
ప్రాతిపదికలను ఘనులు - హాలికులు శేషం లక్ష్మీనారాయణాచార్య అభినందించింది -
సైనికులు
అవిశ్రాంత సేద్యంతో
ఆకలి మంటలను ఆర్పి
దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్ని
దేశకీర్తి బావుటాను ఎగురవేసిన
ఘనజనులు" - హాలికులు, సైనికులు
అర్థాలు:
రుధిరం - రక్తం
హాలికులు - రైతులు
పసిడి =
బంగారం
స్వేదం
-చెమట
ప్రాతిపదిక – ఆధారం
పర్యాయపదాలు:
రైతు = కర్షకుడు, హాలికుడు.
సంధులు:
చందనాలివే = చందనాలు + ఇవే (ఉత్వ సంధి)
ప్రాతిపదికలగు = ప్రాతిపదికలు + అగు (ఉత్వ
సంధి)
కవచమైన = కవచము + ఐన (ఉత్వ సంధి)
ఎగరేసిన = ఎగర + ఏసిన (అత్వ సంధి)
పండించునట్టి = పండించును + అట్టి (ఉత్వ సంధి)
సమాసాలు:
అభినందన చందనాలు - అభినందనతో కూడిన చందనాలు -
తృతీయ తత్పురుష సమాసం
భరతమాత పురోగతి - భరతమాత యొక్క పురోగతి - షష్ఠీ
తత్పురుష సమాసం
దేశభక్తి - దేశమందు భక్తి - సప్తమీ తత్పురుష
సమాసం
ఘనవీరులు - ఘనమైన వీరులు - విశేషణ పూర్వపద కర్మధారయ సమసం
జన్మభూమి కవచం - జన్మభూమి యొక్క కవచం - షష్ఠీ
తత్పురుష సమాసం
అవిశ్రాంతి - విశ్రాంతం లేనిది - సణ్ తత్పురుష
సమాసం
నిర్మలురు
- మలినం లేనివారు - నజ్ తత్పురుష సమాసం
అలంకారాలు :
వందనాలు వందనాలు
అభినందన చందనాలు - వృత్యనుప్రాసాలంకారం
శ్రమదాచని హాలికులకు
తలవంచని సైనికులకు - అంత్యానుప్రాస అలంకారం
వర్ణమాల :
అ, ఆ, ఇ, ఈ వంటి వర్ణాలను అచ్చులు అంటారు.
క, ఖ, గ, ఘ వంటి వర్ణాలను హల్లులు అంటారు.
ద్విత్వాక్షరం : ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన
ఒత్తు చేరితే దాన్ని 'ద్విత్వాక్షరం' అంటారు. - 'క్క
క్ +
క్ + అ = క్క
సంయుక్తాక్షరం : ఒక హల్లుకు వేరొక హల్లుకు
చెందిన ఒత్తు చేరితే దాన్ని 'సంయుక్తాక్షరం' అంటారు. - 'స్య = స్ + య్ + అ
సంశ్లేషాక్షరం : ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ
హల్లులకు చెందిన ఒత్తులు చేరితే దాన్ని 'సంశ్లేషాక్షరం' అంటారు. - క్ + ష్ + మ్ +
ఇ = క్ష్మి
2. స్నేహబంధం
ప్రక్రియ :కథ
ఇతివృత్తం :
నైతిక విలువలు
మూలం : మిత్ర
లాభం
రచయిత : పరవస్తు
చిన్నయసూరి
విశేషాలు : నీతిచంద్రికకు మూలం - విష్ణుశర్మ పంచతంత్రం
ప్రక్రియ : కథ –ఆకట్టుకొనే
కథనం,సరళత,పాత్రకుసంబంధించిన సంభాషణ ముఖ్య లక్షణాలు.
పాత్రలు : కాకి - లఘుపతనకం ఎలుక –
హిరణ్యకం , తాబేలు
- మంథరకం జింక –చిత్రాంగుడు
భయంతోపరిగెత్తుతూవచ్చింది–జింక ( చింత్రంగుడు)
చిత్రాంగుడు తో మొదటగా మాట్లాడింది–మంథరకం
చిత్రాంగుడు తన బాల్యం గురించి చెప్పింది–హిరణ్యకంతో
వలలో చిక్కుకున్న చిత్రాంగుడిని చూసింది -
లఘుపతనకం
వేటగాని వల నుండి చిత్రాంగుని విడిపించినది. -
హిరణ్యకం, లఘుపతనకం
అంతఃపురంలోని రాజపరివారం మాటలు విని మానవ భాషను
నేర్చుకున్నది - చిత్రాంగుడు
ఎలుక ఉపాయం విని నటించిన స్నేహితులు ఎవరిని
కాపాడారు - మంథరకాన్ని
జింక ఏ వయసులో మొదట వేటగాడి ఉచ్చులో
చిక్కుకుంది - 6 నెలలు
సంభాషణ ( ఎవరు ఎవరితో అన్నారు ? )
“ నువ్వు ఎవరివి? ఎందుకు పరిగెత్తుకుంటూ
వచ్చావు?” – మంథరకం
“
ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులం ఇప్పుడు నువ్వు కూడా కలుస్తావు నువ్వు కూడా
మాతోనే ఉండు” – మంథరకం
“ ఎంత ప్రమాదం జరిగింది చిత్రంగా! నీలాంటి మంచి
వాడికి రావాల్సిన అపాయం కాదు ఇది” - లఘుపతనకం.
“
ఇంత పెద్ద ఆపదలో నువ్వెందుకు చిక్కుకున్నావు? కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా?” –
హిరణ్యకం
. “
ఏం కొంప మునిగిపోయిందని వచ్చావు నువ్వు? ” – హిరణ్యకం మంథరకంతో
ప్రపంచమంతా తిరిగి ప్రత్యేక అవసరాలున్న పిల్లల
కోసం పాటుపడినది - హెలెన్ కెల్లర్
హెలెన్ కెల్లర్ అంధురాలు. తన ఆత్మకతను బ్రెయిలీ
లిపిలో రాసింది.
వర్ణమాల :
హ్రస్వాలు : ఒక మాత్రజాలంలో ఉచ్చరించే అచ్చులను
హ్రస్వాలు' అంటారు.
అవి : ఆ - ఇ - ఉ - ఋ - ఎ - ఒ (మాత్ర అంటే
కనురెప్ప పాటు కాలం)
దీర్ఘాలు : రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే
అచ్చులను “దీరాలు" అంటారు.
అవి : ఆ - ఈ - ఊ - ౠ - ఏ-ఐ-ఓ - ఔ
క, చ, ట, త, ప - పరుషాలు
గజ, డ, ద, బ - సరళాలు
ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ,ధ, థ, ఫ, భ - మహాప్రాణాలు,
వర్గయుక్కులు
జ్ఞ , ణ , న, మ - అనునాసికాలు
య, ర, ల, వ - అంతస్థాలు
శ, ష, స, హ - ఊష్యాలు.
ఱ' అక్షరాన్ని ఆధునిక వ్యవహార భాషలో ఉపయోగించడం
లేదు. దీనికి ఐదులుగా 'ర' ను వాడుతున్నారు.
ౘ,ౙ
కూడా వాడుకలో లేవు. చ, జ లను వాడుతున్నారు.
ఉభయాక్షరాలు : మూడు. అవి - సున్న (0)
(పూర్ణబిందువు), అరసున్న 'ఁ', విసర్గ ః.
ఈ మూడింటిని అచ్చులతోనూ, హల్లులతోనూ ఉపయోగించడం
వల్ల వీటిని 'ఉభయాక్షరాలు' అని వ్యవహరిస్తారు.
అరసున్నకు గ్రాంధిక భాషలో ప్రాధాన్యమున్నది.
విసర్గ సంస్కృతి పదాలకు మాత్రమే చేరుతుంది.
పర్యాయపదాలు:
కన్నం : రంద్రం, బిలం, కలుగు, వివరం
కొలను : సరస్సు, చెరువు
స్నేహం : సఖ్యం, నెయ్యం
ప్రకృతి - వికృతులు :
అడవి - అటవి
స్నేహం - నెయ్యం
రాత్రి - రాతిరి
ఆకాశం - ఆకసం
సహాయం - సాయం
3. వర్షం
ప్రక్రియ : ఖండ
కావ్యం
ఇతివృత్తం : ప్రకృతి
చిత్రణ
ఉద్దేశం -
పొగలు సెగలు కక్క వేసవికాలం వెళ్ళిపోయింది. అంతవరకు వేడెక్కిన భూమిని చల్లబరుస్తూ
వర్షాకాలం ప్రవేశించింది. అటువంటి వర్షా కాలపు సొగసును, సామాన్యులపై ఆ వర్షం
ప్రభావాన్ని తెలియజేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం.
కవి :
డా॥ పల్లా దుర్గయ్య
మూలం - పాలవెల్లి అనే ఖండకావ్యం
జననం : 25.05.1914 మరణం : 19.121983
జన్మస్థలం : వరంగల్ జిల్లా మడికొండ (ప్రస్తుతం
: వరంగల్ అర్బన్ జిల్లా)
తల్లిదండ్రులు : నర్సమ్మ, పాపయ్యశాస్త్రి
రచనలు : పాలవెల్లి (ఖండ కావ్యం), గంగిరెద్దు
(ఆధిక్షేప కావ్యం), ప్రబంద వాజ్మయ
వికాసం (పరిశోధనా గ్రంథం), చతురవచోనిధి
(విమర్శనా గ్రంథం), అల్లసానిపెద్దన (విమర్శనా గ్రంథం)
పరిశోధన గ్రంథం : 16వ శతాబ్ది యందలి ప్రబంధ
వాజ్మయం - తద్వికాసం
శైలి : తెలంగాణ పదజాలం, సున్నితమైన హాస్యం
ప్రత్యేకత : ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో
మొదటి ఎం.ఏ పట్టా అందుకున్నవాడు.
ప్రక్రియ
ఖండకావ్యం - వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో
కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం.
కవి నేలను దేనితో పోల్చాడు - రామచిలుకతో
పోల్చాడు.
నడుమంతరఫున్ సిరి కుబ్బువారి గర్వోన్నతి
ఏమవుతుంది. - నిలువునా నీరయి
మహోదధి పాలవుతుంది.
చిటపట, పటపట, పుటపుట, జబుక్కు బలుక్కు అనునవి -
ధ్వన్యనుకరణ శబ్దాలు
ప్రభుపాలితులనక ప్రజలందఱును
ఛత్రపతులయ్యేదెప్పుడు - వర్షాగమమున
నేఱియలు వాటిన నేల నీటితో నాది చూస్తే నీడలు
కనబడుటను కవి దేనితో పోల్చాడు - అద్దములు
తాపినట్లున్నదని
'పులకరించి భూసతి రామచిలుకయయ్యె' అను
వాక్యమునందలి ఉపమేయం - రామచిలుక
జాతీయాలు :
మీసాలు దువ్వు
- గర్వించు
నడుంకట్టు - పూనుకొను
వానదేవుడు ఉన్నత సౌధాల మీద దాడి చేయడం కుదరక
ఎవరిమీద దాడి చేయును - గుడిసెలపై
వర్షం పాఠంలో చీకటిలో శరీరాలను శత్రువుల కప్పజెప్పి
నిద్రపోయినవారు - దరిద్రులు
లింగాలు :
పుంలింగాలు : పురుష వాచక శూలు. (ప్రదీప్,
సందీప్)
స్త్రీ
లింగాలు : స్త్రీ వాచక శబ్దాలు. (గీత, లత)
నపుంసకలింగాలు : పై రెండు కానటువంటి (మానవ
సంబంధం కాని, వాటిని వస్తు, పక్షి, జంతు వాచక శబ్దాలు. (పిల్లి, ఎలుక, చెట్టు)
అర్థాలు:
తాపడం : బంగారంతో పూతపూయడం
కృషికులు :
రైతులు
పయ్యెర : గాలి
వేడిగా : వేగంగా
పర్యాయపదాలు:
సముద్రం : ఉదధి, పయోధి
నింగి : అంబరం, ఆకాశం
భూమి - పుడమి, పృథ్వి
సంధులు :
మహోదధి -మహా + ఉదధి - గుణసంధి
దొరలించినట్టులై - దొరలించిన + అట్టులై - అత్వ సంధి
బొబ్బలెక్కడి = బొబ్బలు + ఎక్కడి ఉత్వసంధి
అప్పఁజెప్పిన = అప్పు + చెప్పిన - సరళాదేశ సంధి
అలంకారాలు:
పులకరించి భూసతి రామచిలుకయ్య హుంకరించి యాబోతులు
అంకివేసె - ఉపమాలంకారం
4. లేఖ
ప్రక్రియ : లేఖ
ఇతివృత్తం : చరిత్ర,
సంస్కృతి
లేఖ -
పరోక్షంగా ఉన్న వారికి సమాచారమును అందించుటకు, స్వీకరించుటకు లేఖలుఉపయోగపడతాయి.
లేఖలను వ్యక్తిగత లేఖలు, వృత్తి లేదా వ్యాపార లేఖలు వంటి విభాగాలు చేయవచ్చు.
లేఖలో ప్రధానం అయినది విషయం.
పాఠ్యాంశ విశేషాలు:
లేఖలలోని భేదాలు : కార్యాలయ లేఖలు, వ్యాపార
లేఖలు, పత్రికలకు లేఖలు, వ్యక్తిగత లేఖలు మొ॥
లేఖ పాఠంలో ప్రస్తావించబడిన దర్శనీయ స్థలాలు -
నాగార్జునసాగర్, వరంగల్, హైదరాబాదు
లేఖ
వ్రాస్తున్న శైలజది ఏ ఊరు -- వేముల
శైలజ ఎవరికి లేఖ వ్రాస్తున్నది - రంగాపురానికి
చెందిన లలితకు
నాగార్జున కొండ పై విశ్వవిద్యాలయాన్ని
స్థాపించినవాడు - ఆచార్య నాగార్జునుడు
స్వయంభూ దేవాలయం, ఖుష్ మహల్, నాట్యమండపం ఎక్కడ
ఉన్నాయి - వరంగల్ కోటలో
తెలంగాణ రాష్ట్ర చిహ్నంలోని శిలాతోరణం ఎక్కడ
నుండి గ్రహించారు - వరంగల్లు
ఇత్తడి కళాఖండాల తయారీకి ప్రసిద్ధి గాంచిన
ప్రాంతం - పెంబర్తి
రామప్ప దేవాలయాన్ని కట్టించినవాడు -
గణపతిదేవుని సేనాని రేచర్ల రుద్రుడు
తెలుగు
భాషకు ప్రాచీన హోదా లభించడానికి కారణమైన జినవల్లభుని శాసనంలోని పద్యాలు -
కందపద్యాలు
సిరి వెలుగులు విరజిమ్మే - సింగరేణి బంగారం
శాతవాహనుల రాజధాని - కోటిలింగాల
శాతవాహన వంశపు తొలిరాజు - శ్రీముఖుడు
కులీకుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు
గుర్తుగా కట్టించిన చారిత్రక కట్టడం - చార్మినార్
1750 ప్రాంతంలో పెద సోమభూపాలుడు కట్టించిన
మట్టికోట ఎక్కడ ఉన్నది - గద్వాల (జోగులాంబ జిల్లా)
కోట లోపల చెన్న కేశవ స్వామి గుడి ఉన్నది.
గుడి ముందు గల గాలి గోపురం ఎత్తు – 90 అడుగుల
ఎత్తు
అష్టదిగ్గజ కవులను పోషించిన గద్వాల
సంస్థానాధీశుడు –చినసోమభూపాలుడు
పిల్లల
మట్టి ఎక్కడ ఉంది - పాలమూరు జిల్లా (మహబూబ్ నగర్ జిల్లా)
రామప్ప దేవాలయాన్ని గణపతి దేవుని సేనాని రేచర్ల
రుద్రుడు కట్టించాడు.
ప్రాచీన తెలంగాణ కవి జినవల్లభుడు రచించిన తొలి
కంద పద్యాలు గల 'కుర్క్యాల శాసనం' కరీంనగర్ జిల్లాలోని బొమ్మలగుట్టలో లభించిందని
ప్రతీతి.
విభక్తి ప్రత్యయాలు :
పదాల మధ్య అర్ధసంబంధాన్ని ఏర్పరచడానికి
ఉపయోగించే వాటిని 'విభక్తి ప్రత్యయాలు' అంటారు.
ప్రత్యయాలు
- విభక్తులు
డు, ము, వులు - ప్రథమా విభక్తి
ని(న్), ను(న్), కూర్చి, గురించి - ద్వితీయా
విభక్తి
చేత(న్), (చేన్), తోడ(న్), తో(న్) - తృతీయా
విభక్తి
కొఱకు(న్), కై (కోసం) - చతుర్థి విభక్తి
వలన(న్), కంటె(న్), పట్టి - పంచమి
కి(న్), కు(న్), యొక్క, లో(న్), లోపల(న్)
- షష్ఠీ విభక్తి
అందు(న్), న(న్) - సప్తమీ విభక్తి
ఓ, ఓరి, ఓయి, ఓసి - సంబోధన ప్రథమా విభక్తి
సంబంధం లేని దానిని గుర్తించటం
దుర్గం, కోట, ఖిల్లా,జాగ - జాగ
గుడి, బడి, దేవాలయం, మందిరం - బడి
శిల, రాయి, దండ, బండ - దండ
గాలం, నీరు, జలం, సలిలం - గాలం
కన్ను, నేత్రం, రెప్ప, నయనం - రెప్ప
5. శతకసుధ
కవి పరిచయాలు:
1.కవి పేరు : బద్దెన
కాలం : 13వ శతాబ్దం
రచనలు: సుమతీశతకం, నీతిశాస్త్ర ముక్తావళి
విశేషాలు :
వేములవాడ చాళుక్య రాజైన భద్రభూపాలుడే బద్దెన లౌకిక నీతులను
అతిసులువుగా కందపద్యాల్లో ఇమిడ్చి సుమతీ
శతకాన్ని వ్రాసాడు.
కవి - ధూర్జటి
కాలం : 16వ శతాబ్దం (క్రీ.శ. 1500-1530)
తల్లిదండ్రులు : సింగమ, నారాయణామాత్యుడు
రచనలు : శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము
(ప్రబంధం), శ్రీకాళహస్తీశ్వర శతకం
విశేషాంశాలు : అతులిత మాధురీ మహిమ అని శ్రీ కృష్ణ దేవరాయ స్తుతించాడు.
కవి : పక్కి వేంకట నరసింహ కవి
కాలం : 17వ శతాబ్దం
రచనలు : కుమారీ శతకం, కుమార శతకం
విశేషాంశాలు : చిన్న చిన్న పదాలతో ఆధునిక
సమాజానికి అవసరమైన నీతులను కవిసులభరీతిలో చెప్పాడు.
కవి : ఏనుగు లక్ష్మణ కవి
కాలం : 18వ శతాబ్దం
నివాసం :
పెద్దాపురం సంస్థానం పెద్దాడ గ్రామం
రచనలు : సుభాషిత రత్నావళి, రామేశ్వర
మాహాత్మ్యం, విశ్వామిత్ర చరిత్రం, గంగామాహాత్యం
విశేషాంశాలు :
భర్తృహరి సుభాషిత త్రిశతిని అనువదించిన కవులలో లక్ష్మణకవి ఒకడు
కవి : కౌకుంట్ల నారాయణరావు
కాలం : 1883-1953
నివాసం : రంగారెడ్డి జిల్లా కౌకుంట్ల గ్రామం
రచన: ప్రభుతనయ శతకం
మకుటం : తనయా!
కవి - శిరినహల్ కృష్ణమాచార్యులు
కాలం : జననం : 13.8.1905, మరణం : 15.4, 1992
జన్మస్థలం
- నిజామాబాద్ జిల్లా మోర్తాడ్
నివాసం : కోరుట్ల
రచనలు :
కళాశాలాభ్యుదయం, రామానుజ చరితం, చిత్రప్రబంధం, రత్నమాల (ఖండకావ్యం),
గాంధీతాత శతకం
బిరుదు : అభినవ కాళిదాసు , తెలంగాణ తొలి శతావధాని
కవి పేరు : : సురోజు బాలనరసింహాచారి
జన్మస్థలం నల్లగొండ జిల్లా, చిన్నకాపర్తి
జననం : 9.5.1946, మరణం : 2.2.2014
రచనలు : కవితాకేతనం, బాలనరసింహశతకం, మహేశ్వర
శతకం, భగవద్గీత కందామ్మతం,వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, భరతసింహ శతకం
బిరుదు : సహజకవి
కవి : డా॥టి.వి. నారాయణ
జననం : 26. 7. 1925
జన్మస్థలం : హైదరాబాదు
రచనలు - జీవనవేదం, ఆరపుత్ర శతకం, భవ్యచరిత
శతకం, ఆత్మదర్శనం - (కవితా సంపుటి)అమర వాక్సుధా స్రవంతి (వ్యాససంపుటి)
విద్యాశాఖ అధికారిగా,పబ్లిక్ సర్వీస్ కమిషన్
సభ్యుడిగా సేవలు అందించారు
పద్యాలు :
పరనారీ సోదరుడై
పరధనమున ఆసపడత పరులకు హితుడై
పరులు దనుఁ బొగడ నెగడక
బరులలిగిన నలుగనతడు పరముఁడు సుమతీ!
- బద్దెన
కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్
జీవవబ్రాంతులై
కొడుకుల్ పుట్టరి కౌరవేంద్రునకనేకుల్ వారిచే
నేగతుల్
వడిసెం బుత్రులు లేని యాశుడునకుం బాటిల్లెనే
దుర్గశుల్
చెడునే మోక్షపదం బపుత్రకునకున్
శ్రీకాళహస్తీశ్వరా!
- ధూర్జటి
చెప్పకు చేసిన మేలు నా
కప్పుడయినంగాని దాని హర్షింపరుగా
గొప్పలు చెప్పిన నదియును
దప్పేయని చిత్తమందు దలపు కుమార్!
- పక్కి వేంకట నరసింహకవి
నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు నా
నీరమె ముత్యముట్లు నళినీదళ సంస్థితమై తనర్చు నా
నీరమె శుక్తిలోఁ బడి మణిత్వము గాంచు సమంచిత
ప్రభన్
పౌరుష వృత్తు లిల్లధము మధ్యము నుత్తము
గొల్చువారికిన్
- ఏనుగు లక్ష్మణకవి
వాదంబు బాడకెప్పుడు
మోదంబున నిన్ను నీవు మురిసి గనుమికన్
భేదంబు సేయకెన్నడు
సాధుల గనుగొన్న సేవ సల్పుము తనయా!
- కౌకుంట్ల
నారాయణరావు
మానవుడే మాధవుండను
జ్ఞానంబున ప్రజల సేవ సలుపు మదియె నీ
మానవతలోని మాన్య
స్థానంటెనె గాంధితాత సద్గుణజాతా!
- శిరిశినగల్ కృష్ణమాచార్యులు
నొసట వెక్కిరించి నోట నవ్వును జూపి
కడుపునిండ విషము గలుగువాడు
కాలనాగుడన్న వడు ప్రమాదంబయా
బాలనారసింహ! భరతసింహ
తప్పుచేసి కూడ తమదగు తప్పును
కప్పిపుచ్చువారు కలుపుతులు
ఒప్పురానిదీవారు గొప్ప మనీషులు
భరతవంశతిలకభవ్యచరిత!
-
డా॥టి.వి.నారాయణు
పాఠ్యాంశ విశేషాలు :
సుమతీ శతకంలో బద్దెన ఈ ఛందస్సులో పద్యాలు
వ్రాసాడు - కందం
పరులలిగిన నలుగనతడు - పరముడు (గొప్పవాడు)
పుత్రులు లేకున్ననూ దుర్గతిని పొందక
మోక్షపథాన్ని పొందినవాడు - శుకమహర్షి
వందమంది పుత్రులున్ననూ మోక్షం పొందక వారి వల్ల
అనేక దుర్గతులు పొందినవాడు - - దృతరాష్ట్రుడు
తను చేసిన మేలును గూర్చి గొప్పలు
చెప్పుకోకూడదని బోధించిన శతకకారుడు - పక్కి వేంకట నరసింహం
ఉత్తములను చేరిన వారిని లక్ష్మణ కవి దేనితో
పోల్చాడు. - ముత్యపు చిప్పలో పడ్డ నీటితో
మధ్యములను చేరిన వారి ప్రవృత్తి ఎట్లుండును -
తామరాకు పై బిందువు వలె ఉండును,
ఏనుగు
లక్ష్మణ కవిచే కాలిన ఇనుముతో పోల్చబడిన వారిఏవరు - అధములు
కౌకుంట్ల నారాయణరావు అభిప్రాయంలో ఎవరు
కనిపించినప్పుడు సేవ చేయవలెను - సాధువులు
మానవుడే మాధవుడనే భావంతో ప్రజలకు సేవచేయవలెనని
ఉద్బోధించినవాడు - గాంధీతాత
నోటితో
నవ్వి నొసటితో వెక్కిరించినట్లనునది –సామెత
సూరోజుబాలనరసింహ అభిప్రాయంలో పాము కంటే
ప్రమాధమైన వారు –
నోటితో నవ్వుతూ,నొసటి తో వెక్కిరిస్తూ,కడుపులో
విషాన్ని పెట్టుకొన్నాడు.
విభక్తి ప్రత్యయాలు
1. చెరువు నందు నీరు నిండుగా ఉన్నది. ( సప్తమి
విభక్తి )
2 చదువుకు మూలం శ్రద్ధయే. ( షష్టి
విభక్తి)
3. చేసిన తప్పును ఒప్పుకునే వారు ఉత్తములు
( ద్వితీయ
విభక్తి)
4. కడుపులో విషం ఉన్నవారు కాలనాగుకంటే
ప్రమాదకారులు. ( షష్టి
విభక్తి)
5. ఘటములో నీరు నిండుగా ఉన్నది.( షష్టి
విభక్తి)
6. దేశభక్తులు దేశం కోసం తమ సర్వం
త్యాగం చేస్తారు.
( చతుర్థి విభక్తి)
7. వాదాలు
పెట్టుకోవడం వల్ల మనసు ప్రశాంతత కోల్పోతుంది. ( పంచమి
విభక్తి)
8. చెరువు
లో బట్టలు ఉతకవద్దు .
( షష్టి విభక్తి)
9. పెద్దల
మాటను గౌరవించాలి.(
ద్వితీయ విభక్తి)
10. పసివాడుపాల
కోసం ఏడుస్తున్నాడు ( చతుర్థి
విభక్తి )
11.
హింసతో దేనినీ సాధించలేము.( తృతీయ
విభక్తి)
12.
అతడు కుంచెతో చిత్రాలు గీతాడు. ( తృతీయ
విభక్తి)
13. రైతు నాగలితో పొలం దున్నుతాడు. ( తృతీయ
విభక్తి)
14. సుస్మిత కంటె మానస తెలివైనది. ( చతుర్థి
విభక్తి )
15. బాలిక
తో బాహుమనాలు తిస్కోవడనికి వేదిక మీదకు ఎక్కారు . ( తృతీయ
తత్పురుష )
ad
భాషా భాగాలు :
అవ్యయం:
లింగ ,
వచన, విభక్తులు లేని పదాలు అవ్యయాలు.
1. నిదానమే ప్రధానం. అట్లని సోమరితనం
పనికి రాదు.
2. మనిషికి వినయం అలంకారం. అయితే
అతివినయం పనికిరాదు.
3. అహా! ఈ ప్రకృతి దృశ్యం ఎంత బాగుందో !
ఈ వాక్యాల్లో ఉన్న 'అట్లని, అయితే, ఆహా!'
మొదలైన పదాలు పుంలింగం, స్త్రీలింగం లేదా నపుంసకలింగానికి చెందిన పదాలు కావు.
అట్లాగే విభక్తులు కావు. ఏకవచన, బహువచనమనే తేడా కూడా లేదు. ఇట్లాంటి పదాలను
'అవ్యయాలు' అంటారు.
సంధులు:
పరధనమునకాసపదక = పరధనమునకు + ఆసపడక - ఉత్వ సంధి
ముత్యమట్లు = ముత్యము + అట్లు - ఉత్వసంధి
భేదంబుసేయకెన్నడు = భేదంబు + చేయకెప్పుడు - గసడదవాదేశ సంధి
స్థానంబనే - స్థానంబు + అనే - ఉత్వసంధి
సమాసాలు :
గొప్పమనీషులు = గొప్పనైన మనీషులు - విశేషణ పూర్వపద కర్మధారయ
సమాసం
చిత్తముదలపు = చిత్తము అందు తలపు - సప్తమీ
తత్పురుష సమాసం
ప్రజల సేవ = = ప్రజల యొక్క సేవ - షష్ఠీ
తత్పురుష సమాసం
భవ్యచరిత = భవ్యమైన చరిత - విశేషణ పూర్వపద
కర్మధారయ సమాసం
అలంకారాలు :
నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు నా
నీరమె ముత్యముట్లు నళినీదళ సంస్థితమై తనర్చు నా
నీరమె శుక్తిలోఁ బడి మణిత్వము గాంచు సమంచిత
ప్రభన్
పౌరుష వృత్తు లిల్లధము మధ్యము నుత్తము
గొల్చువారికిన్
Post a Comment
3 Comments
PDF creat cheyandi sir......
ReplyDeleteమీ వీడియోస్ మరియు పిడిఎఫ్ లు మా ప్రిపరేషన్ ను చాలా సులభతరం చేస్తున్నాయి.. ధన్యవాదాలు సర్.. TS కు సంబంధించి అన్ని సబ్జెక్టుల pdf లు అందుబాటులో ఉంచండి సర్..
ReplyDeleteSir 6th class telugu part 2 cheyandi
ReplyDelete