TS TET 2022 MODEL GRAND TEST BY TPTF

 

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ 

 రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ -TPTF

Reg. No 493/2014, Go. No 167 

ఉపాధ్యాయ అర్హత నమూనా పరీక్ష

PAPER-1

 సమయం :-150 ని. ప్రశ్నలు – 150

మార్కులు : 150


ఒక వైట్ పేపర్ తీసుకుని అందులో క్వశ్చన్ నంబర్ మరియు ఆన్సర్స్ రాసుకుని లాస్ట్ లో కీ చూసుకోగలరు.

పార్ట్-1 శిశు వికాసం & పెడగాజి

1 . క్రింది వాటిలో సరియైన ప్రవచనం

a) వికాసం స్వల్పకాలిక ప్రక్రియ

b) వికాసంలో వైయుక్తిక బేధాలుండవు 

C) వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు

 d)వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము





 2 . పియజే ప్రకారం పిల్లలు వస్తుస్తిరత్వ భావన నేర్చుకొనే దశ?

 a) ఇంద్రియ చాలక దశ

b) పూర్వ ప్రచాలక దశ 

c) మూర్త ప్రచాలక దశ

d)అమూర్త ప్రచాలక దశ




 3. క్రింది వానిలో పూర్వ ముఠా దశ

a) శైశవ దశ

b) కౌమార దశ

c) పూర్వ బాల్య దశ

d) ఉత్తర బాల్య దశ




4 . బండురా సాంఘిక అభ్యాసన ప్రక్రియలో ని అంశాలకు సంబంధించనిది

a) నిబంధనం

b) అవధానము

C) పునర్బలనం 

d) ధారణ





5 . డిఫరెన్షియల్ ఆప్టిట్యుడ్ టెస్ట్ లోని ఉపపరీక్షల సంఖ్య

a)2.             b) 4 

 c)6.             d)8




6. చిన్న పిల్లల్లా ప్రవర్తన, ఉపసంహరణ, పరాధీనత, భయం, ఈర్ష్య వంటి ప్రవర్తనలు ఈ గృహవాతావరణంలో గల పిల్లల్లో ఉంటాయి

a) శిశువును అంగీకరించడం

b)సామరస్యం, మంచి సర్దుబాటు

C) స్థిరమైన, ఖచ్చితమైన క్రమశిక్షణ

d) అతి సంరక్షణ, అతి గారాబం



 7. రవికి హోమ్ వర్క్ చెయ్యాలని లేదు అలాగని ఉపాధ్యాయుని తో తిట్లు తినాలని లేదు. రవి యొక్క సంఘర్షణ

a) ఉపగమ - ఉపగమ

b) పరిహార - పరిహార 

C) ఉపగమ - పరిహార

d) ద్వి ఉపగమ - పరిహార 



8 . సామీప్య వికాస ప్రదేశం (ZPD) అనే భావనను ప్రతిపాదించిన వారు

 a) బండురా 

 b) బ్రూనర్

C) పియజే

d) వైగాట్ స్కి 


9. ఫలదీకరణం చెందిన మానవుల అండంలో ఉండే క్రోమోజోముల సంఖ్య

 a) 20 జతలు 

b) 22 జతలు

 c ) 23 జతలు

d) 16 జతలు


10 . కుక్కను చూసిన అనుభవము గల పిల్లవాడు గాడిదను చూసి దానికి కూడా నాలుగు కాళ్ళు ఉన్నందున కుక్క అని పిలవడంలోని సంజ్ఞానాత్మక ప్రక్రియ

a) అనుగుణ్యం

b) వ్యవస్థీకరణం

C) సాంశీకరణం 

d) సమతుల్యత

  


 11 . రవి గణితానికి చెందిన ఒక ప్రాజెక్టు పని చేస్తున్నాడు ఉపాధ్యాయుడు రవిని గమనిస్తూ ప్రతి 10 నిమిశాలకోకసారి ప్రోత్సహిస్తూ ప్రాజెక్టు పూర్తి చేసేలా చేసాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపయోగించిన పునర్బలనం రకం [ ] 

 a) నిరంతర పునర్బలనం

b) స్థిరకాల వ్యవధులలో పునర్బలనం 

C) స్థిర నిష్పత్తులలో పునర్బలనం

d) చరశీల పునర్బలనం



 12 . ఒక విధ్యార్ధి న్యూటన్ సూత్రాలను ప్రయోగ పూర్వకంగా నేర్చుకొని గుర్తుంచుకున్నాడు, ఇక్కడ స్మృతి రకం [ ]

a) క్రియాత్మక స్మృతి

b) నిష్క్రియాత్మక స్మృతి 

C) సంవేదన స్మృతి 

d) బట్టి స్మృతి 

  

13 . ఎడ్గార్ డెల్ అనుభవాల శంఖువు ప్రకారం క్రింది వానిలో అధిక మూర్త అనుభవం

a) నాటకీకరణ అనుభవాలు

b) క్షేత్ర పర్యటనలు

c) టెలివిజన్ విద్య కార్యక్రమాలు

d)రేడియో రికార్డింగ్, చలనరహిత చిత్రాలు



 14 . వికాసం, పరిపక్వత, అభ్యసనాలు, మధ్యగల సంబంధాన్ని తెలిపే సరైన సమీకరణం

a) అభ్యసనం = f ( పరిపక్వత X వికాసం )

b) వికాసం = f ( పరిపక్వత / అభ్యసనం )

C) అభ్యసనం =f (పరిపక్వత / వికాసం )

d) వికాసం = f ( పరిపక్వత X అభ్యసనం ) 




15 . అభ్యసనం గురించి సరైన ప్రవచనం

a) అభ్యసనం ఒక ఫలితం, ప్రక్రియ కాదు 

b) అభ్యసనం ప్రవర్తనలోని కొన్ని అంశాలను మాత్రమే ప్రభావితం చేస్తుంది

c) అభ్యసనం ఒక బదలాయించబడే ప్రక్రియ 

d) అభ్యసనం ఒక పరిమిత కాల ప్రక్రియ



 16 . మాస్లోవ్ ప్రకారం నిమ్న శ్రేణి అవసరం

a) ఆత్మ ప్రస్తావన అవసరం

b) రక్షణ అవసరం 

C) ప్రేమ, సంబంధిత అవసరం

d) గుర్తింపు, గౌరవ అవసరం 




17. మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే సాంఘిక - సాంస్కృతిక కారకాలకు సంబందించని అంశం

a) వ్యక్తి పెరిగే సమజంలో ఉపయోగించే భాష

b) ఉపాధ్యాయుని బోధనా వైఖరి

C) తల్లిదండ్రుల పెంపక శైలులు

d) శరీరం లోని అంతఃస్రాని గ్రంధులు



 18 . ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యాసన నియమము

   a) సంసిద్ధత

   b) అభ్యాస

   C) ఫలిత

   d)సామీప్యతా 

   


19 . కింది నికషలలో ఒకదానిలో అస్పష్ట ఉద్దీపనలు ఉంటాయి

a) ప్రక్షేపణ

b) నిర్ధారణ 

C) శోదికలు

d) అప్రక్షేపన



20 . సమ్మిళిత విద్య లక్ష్యం

 a) అంగవైకల్యత కలిగిన పిల్లలను రక్షించుట

  b) బుద్ధి మాంద్యం కలిగిన

పిల్లల అవసరాలు తీర్చడం 

C) ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలందరి అవసరాలు తీర్చడం 

d) పిల్లలందరి అవసరాలు తీర్చడం 



21 . పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెందే

జ్ఞానేంద్రియం.

a) వాసన 

b) స్పర్శ

 c) వినికిడి

d) చూపు




22. పిల్లలలో పుట్టుకతో భాషను ఆర్జించే ఉపకరణం ఉంటుంది అని చెప్పినవారు

 a) చాంస్కీ

 b) వైగాట్ స్కీ

 C) కోఫ్కా

 d)పియాజే 

 



23. కింది వాని లో బౌద్ధిక వనరు

a) శాస్త్ర వేత్తలు 

b) జలపాతాలు 

C) వ్యవసాయ క్షేత్రాలు 

d) జంతు ప్రదర్శన శాల




 24. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం 10 + 2 స్థానంలో ఉండే నూతన విద్య విధానం | ]

a) 5+2+3+4.            

b) 5+3+2+4

 c) 5+3+3+4 

 d) 5+3+4+4 



28 . సహచర్య, సహకార అభ్యసనలు రెండూ 

a) ఉపాధ్యాయ కేంద్రీకృతం

b) విద్యార్థి కేంద్రీకృతం

 C) పాఠశాల కేంద్రీకృతం

d) వృత్తి కేంద్రీకృతం 



29 . ఈ సమూహంలో సభ్యులు ఒకరికొకరు దూరంగా ఉంటూ ఎప్పుడు కలుసుకోకపోయిన వారి ఆలోచనలు, విలువలు ఒకేలా ఉంటాయి

a) ముఖాముఖీ

 b) సహా క్రియాత్మక

C) ప్రాథమిక

d) అదృశ్య



 30.పావ్ లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది . ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది 

 a) నిబంధిత ఉద్దీపన

b) నిర్నిబంధిత ఉద్దీపన

 C) నిబంధిత ప్రతిస్పందన

d) నిర్నిబంధిత ప్రతి స్పందన




Part - II తెలుగు కాంటెంట్ & మెథడాలాజి


* క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులిమ్ము


 నిజామాబాదు లో జరిగిన ఆంధ్ర మహాసభలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ తెలంగాణా ఆంధ్రప్రాంత ఏకీకరణకు తీర్మానం చేసింది. పోలీస్ చర్య అనంతరం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ 'ఘనపురం' సమావేశంలో మరోసారి విశాలాంధ్ర నిర్ణయం ప్రకటించింది . విశాలాంధ్ర మహాసభ స్థాయి సంఘ సమావేశం 14 నవంబర్ 1953 నాడు హైదరాబాద్ లో జరిగింది. ఆహ్వాన సంఘ అధ్యక్షులు కొత్తూరు సీతయ్య , ప్రధాన కార్యదర్శిగా N. భోజరాజ్ వ్యవహరించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన అయ్యదేవర కాళేశ్వర రావు విశాలాంధ్ర ఆవశ్యకతను వివరించారు. ఈ సభలో హైదరాబాద్ మంత్రులు పాల్గొనలేదు. గడియారం రామకృష్ణ శర్మ గారు స్వాగత పద్యాలు చదివారు. ఈ పద్యాలు గోలకొండ పత్రికలో ప్రచురించబడ్డాయి. మూడు కోట్ల తెలుగు ప్రజలను ఒకటిగా ముడి వెయ్యాలని దాశరధి కవిత్వం రాసి తన కావ్యానికి మహాంధ్రదోయమని పేరు పెట్టారు.



31. విశాలాంధ్ర మహాసభ స్థాయి సంఘ సమావేశానికి అధ్యక్షత వహించినవారు

a)గడియారం రామకృష్ణ శర్మ

b) దాశరథి కృష్ణమాచార్యులు

c) కొత్తూరు సీతయ్య

d) అయ్యదేవర కాళేశ్వర రావు

32. విశాలాంధ్ర మహాసభ స్థాయి సంఘ సమావేశం ఎక్కడ జరిగింది?

a) నిజామాబాదు

b) ఘనపురం

c) హైదరాబాద్

d) వరంగల్లు



33. 1953 నాటికి ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల్లోని తెలుగు ప్రజలెంతమంది?

a) 2 కోట్లు

b) 3 కోట్లు

c) 4 కోట్లు

d) 5 కోట్లు


34. భారత ప్రభుత్వం హైదరాబాదు రాష్ట్రాన్ని భారత దేశంలో విలీనం చేయడానికి చేపట్టిన చర్య

a) నిజామాబాదు లో తీర్మానం

b) ఘనపురం సమావేశం

C) స్థాయి సంఘ సమవేశం

d) పోలీస్ చర్య



35. గడియారం రామకృష్ణ శర్మ చే స్వాగత పద్యాలు చదువబడిన సమావేశం ?

a) నిజామాబాదు ఆంధ్రమహాసభ

b) హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ ఘనపురం సమావేశం 

c) హైదరాబాదు విశాలాంధ్ర స్థాయి సంఘ సమావేశం

d) వరంగల్లు ఆంధ్ర మహాసభ



36. పద్యాల మధ్య వుండే సంబంధాలను తెలిపే వాటిని ఏమంటారు ?

a) అవ్యయాలు 

b) విభక్తులు

c) క్రియలు

d) విశేషణాలు



37. స్వగతం ఏ పురుషలో ఉంటుంది ?

a) ఉత్తమ.       b) మధ్యమ c) ప్రధమ d) పైవన్నీ 


38. జనవ్యవహరనుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్యరూపంలో వ్యకీకరిస్తూ రాసిన ఏ రచన శేషప్ప కవికి పేరు తెచ్చింది.

a)నరహరి శతకం

b) నృకేసరి శతకం

c) నరసింహ శతకం

d) ధర్మపురి శతకం


39. 'నగ్నసత్యాలు' శతకాన్ని రాసిన వారు ?

a) ధూపాటి సమత్కుమారాచార్య

b) ఆడెపు చంద్రమౌళి

C) అలిశెట్టి ప్రభాకర్

d] రావికంటి రామయ్య గుప్తా




40. ఈ క్రింది వాటిలో పురాతన నాట్యకళ

a) రేలనృత్యం b) గొరవయ్య నృత్యం

) గరగ నృత్యం 4) తప్పెట గుళ్ళు



41. బతకమ్మ పండుగలో 8 వరోజు బతకమ్మ

a) అలిగిన బతకమ్మ

b) వెన్నముద్దల బతుకమ్మ

C) వాన బియ్యం బతుకమ్మ

d) సద్దుల బతుకమ్మ



42. కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు అను సామెతకు అర్థం

a) వీర ప్రయత్నం

b) ఓటమి

C) ప్రయత్నానికి తగ్గ ఫలితం లేకుండుట

d) అల్ప ప్రయోజకమైన పని చేయుట



43. బాహ్య ప్రపంచం తెలియని వానిని గూర్చి తెలియజేయు సందర్భంలో ఉపయోగించే జాతీయం

a) గాలిమేడలు          b) కళ్ళు నెత్తికెక్కు

C) కూపస్థ మండూకం  d) కాలికి బుద్ది చెప్పు




44. మాండలిక లక్షణం కానిది

a) న్యూన ప్రామాణికత ఉండదు

b) నిరీత ప్రాంతాల్లో మాత్రమే వ్యవహరించడం

c) క్రియా రూపాల్లో ప్రాంతీయ వై లక్షణం

d) గ్రంధస్థం అయి ఉండటం

45. ద్రుత ప్రకృతికం కానీ మాట ?

a) కంటె

b) బాలుడు

c) నేను

d) తాను



46. ముఖయంత్రంలో ధ్వని పుట్టి పై భాగాలను ఏమంటారు?

a) ప్రయత్నం

b) జిహ్వ

C) స్థానం

d) కరణం



47. ఆనంద్ రవికి ఆర్థిక సహాయం చేశాడు. ఈ వాక్యంలోని క్రియనుభవిష్యత్ కాలంలోకి మార్చి రాస్తే

a) ఆనంద్ రవికి ఆర్థికసాయం చేయలేదు

b) ఆనంద్ రవికి ఆర్థికసాయంచేయడు

c) ఆనంద్ రవికి ఆర్థికసాయం చేస్తున్నాడు

d) ఆనంద్ రవికి ఆర్ధికసాయం చేస్తాడ



48. అనంతర్యార్ధక ప్రత్యయం

a) డున్

b) ఇ/ఈ

C) లా/లావే

d) గా/ లాలే



49. 'నవవిధాలు' సమాసం పేరు

a) తత్పురుష సమాసం

b) బహుప్రీహి సమాసం

c) ద్వంద్వ సమాసం

d) ద్విగు సమాసం



50. 'అమలోదాత్తము' 'దరిదాపు' - అను సమాస పదాలకు విగ్రహ వాక్యాలు

a) అమలమును, ఉదాత్తమును: దరియైనది , దా పైనది 

b) అమలము , ఉదాత్తము: ధరులును, దాపులను 

c) అమలమైనది, ఉదాత్తమైనది: దరియును, దాపుయును d) అమలమూ, ఉదాత్తమూ, దరీ,దాపులూను 



51. దేశిపదముల బాట పట్టించిన తెలంగాణ కవి

a)సోధన 

b) శ్రీనాధుడు 

c) పాల్కురికి 

d) పల్లా దుర్గయ్య .




52. మాతృకలు వీనికి చెందినది

[ ] 

a) చతుర్ పార్శ్వ ఉపకరణాలు

b) త్రి పార్శ్వ ఉపకరణాలు 

C) ద్విపార్శ్వ ఉపకరణాలు

d) ఏక పార్శ్వ ఉపకరణాలు 




53. వంతపాటగల కళారూపం ఏది ?

[ ] 

a) హరికధ

b) యాక్షగానం 

c) బుర్రకధ

d) తోలుబొమ్మలాట 




54. “నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే మరి నీ బ్రతుకు పేజీలు తిరగేసేదేవరో" అన్నవారు

a) సినారే

 b) దాశరధి 

 c) అలిశెట్టి 

 d) వరవరరావు 

 

55 . యాదగిరి గుట్టలో ప్రతినెల "అష్టోత్తర శత కలశాభిషేకం" ఏ నక్షత్రంలో జరుపుతారు

a) ఆరుద్ర.                 b) రేవతి 

 C) స్వాతి                  d) పునర్వసు 

 


56 .కొందరు మాట్లాడేటప్పుడు మొదట నెమ్మదిగా మొదలుపెట్టి, పోను పోను వేగం ఎక్కువ చేసి చివరలో అస్పష్టంగా అర్ధరహితంగా మాట్లాడటం అనేది ,

a) ధారాళంగా మాట్లాడలేకపోవడం

b) సమస్వర రాహిత్యం 

C) వేగోచ్చరణ

d) సమవేగ రాహిత్యం 



57. ఉత్తమ పాఠ్యపుస్తక బాహ్య లక్షణం కానిది

a) అట్ట 

b) ధర

c) ముద్రణ

 d) సాహిత్యం

 


 58 . “బాష ఏకలక్షణం గల వస్తువు కాదు. అది సంక్లిష్ట ద్విగ్విషయం" అన్నవారు 

 a) N కృష్ణ స్వామి

b) SK వర్మ మరియు N కృష్ణ స్వామి 

C) SK కృష్ణస్వామి

d) SK వర్మ



 59 . పిల్లల ప్రాజెక్ట్ పనులు ఈ రకమైన మూల్యాంకనం లోనికి వస్తాయి

a) నిర్మాణాత్మక మూల్యాంకనం

b) సంగ్రహణత్మక మూల్యాంకనం

 C) సంచిత మూల్యాంకనం

d) లోప నిర్ధారణ మూల్యాంకనం 



60 . ఒక గంట కాలంలో 20నిముషాలు ఒక్కో తరగతికి ప్రత్యక్ష బోధనకు మిగతా 40 నిముషాలు మానిటర్ సహాయం లేదా స్వయం అభ్యసనానికి కేటాయించటం - దీనికి చెందినది గా చెప్పవచు

a) బహుళ తరగతి బోధన

b) పర్యవేక్షణత్మక అధ్యయనం 

C) స్వయం అభ్యాసన పద్ధతి

d) నియోజన పద్ధతి


Part - III

English Content & Methodology


90 . The number of syllables in the word

"Internationalization" is

a)6

b)9

c)7

d) 8



Part-3 maths & method

Note:-

ఇక్కడి నుండి పిక్చర్స్ పై క్లిక్ చేస్తూ టెస్ట్ attempt చేయండి.

చాలా మంది అభ్యర్థులు Pdf లో TEXT చిన్నగా ఉంది అనడం వల్ల ఇలా వెబ్సైట్ అందుబాటులో ఉంచాను.

PDF Download చేసుకోవాలంటే  క్రింది లింక్ ద్వారా pdf మరియు👇 Key Download చేసుకోగలరు.

Download This Grand Test PDf👈

Download Key👈









Key:-




 

Post a Comment

2 Comments