10వ తరగతి తో 44,228 ఉద్యోగాలకు నోటిఫికేషన్.ఈరోజే చివరి తేది పూర్తి వివరాలు.

 



దేశవ్యాప్తంగా 44,228 గ్రామీణ డాక్‌ సేవక్‌ (జీడీఎస్‌) పోస్టులను భర్తీ notification విడుదలైంది .రాత పరీక్ష లేకుండానే పదో తరగతిలో సాధించిన మెరిట్‌ మార్కులతో పోస్టల్‌ శాఖలో కొలువు సొంతం చేసుకోవచ్చు.ఎంపికైన వారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం) హోదాలతో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. 

 👉మొత్తం ఖాళీల సంఖ్య: 44,228 (ఆంధ్రప్రదేశ్‌–1355, తెలంగాణలో 981 ఖాళీలు)

జీతాలు:-

బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం)పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.12,000–రూ.29,380 వేత­నం అందుతుంది. అలాగే అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌/డాక్‌ సేవక్‌గా నియమితులైన వారికి నెల­కు రూ.10,000–రూ.24,470 వేతనం లభిస్తుంది. 

వీటితో పాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్స్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలోప్రోత్సాహకం అందిస్తారు. స్వల్పమొత్తంలో హెచ్‌ఆర్‌ఏ కూడా దక్కుతుంది. వీరు రోజూవారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్‌/కంప్యూటర్‌/స్మార్ట్‌ఫోన్‌ లాంటివి పోస్టల్‌శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ ఇలా ఉంటుంది.

అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్తో నియామకాలుంటాయి. ప్రకటలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది. రిజర్వ్ డ్/ అన్ రిజర్వ్డ్ వివరాలు పేర్కొన్నారు. వాటిని పరిశీ లించి, ప్రాదాన్యం ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తోన్నదానికి ఆప్షన్-1 తర్వాత దానికి ఆప్షన్-2... ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్ కేటాయిస్తారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా అందుతుంది.

ఆంధ్రప్రదేశ్లో 1355. తెలంగాణలో 981 ఖాళీలు

👉కటాఫ్ ఎంత?

పోస్టుల సంఖ్య ప్రకారం మారుతుంది.

ఉదాహరణకు.. మే, 2023 నోటిఫి కేష

న్లో ఏపీలో 118, తెలంగాణలో 96 ఖాళీ

లకు గానూ జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ,,

ఇలా అన్ని విభాగాల్లోనూ పదో తరగతిలో వంద శాతం మార్కులు పొందినవారికే అవకాశం దక్కింది. అప్పుడుకారణం. ప్రస్తుతం ఉన్న ఖాళీలప్రకారం.. జనరల్, ఓబీసీ విభాగాల్లో సుమారు95 శాతం, ఎస్సీ, ఎస్టీలైతే 93 శాతం మార్కులు.పొందినవారికి అవకాశం దక్కవచ్చు.


ముఖ్య వివరాలు

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటంతప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకుచెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతివరకు చదవాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 

వయసు: ఆగస్టు 5, 2024 నాటికి 18-40 ఏళ్ల

మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట యసులో సడలింపు వర్తిస్తుంది.

ఫీజు: మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు,ఎస్సీ, ఎస్టీలకు లేదు. మిగిలినవారంతా రూ.100 చెల్లించాలి.

➨ పూర్తి సమాచారం మరియు అప్లై చేసుకోవడానికి క్రింది Red color 🍒 లింక్ ఓపెన్ చేయండి.👇

 

CLICK HERE TO APPLY




ఇలాంటి అప్డేట్స్ రెగ్యులర్ గా పొందడానికి మన వెబ్సైట్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి .






Post a Comment

0 Comments