Army Public Schools లో టీచర్ ఉద్యోగాలు పూర్తి వివరాలు

 


ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులు

తెలుగు రాష్ట్రాల్లో.. సికిందరాబాద్ (ఆర్ కేపీ) సికిందరాబాద్ (బొల్లారం), గోల్కొండల్లో ఆర్మీ పబ్లిక్ స్కూళ్లు ఉన్నాయి.

పాధ్యాయుల నియామకం జరిగే సబ్జెక్టులు: బయాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్, జాగ్రఫీ, హిందీ, మ్యాథమెటిక్స్, పిజిక్స్, సైకాలజీ, సంస్కృతం, పిజికల్ ఎడ్యుకేషన్.


1. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ 50 శాతం మార్కులతో పాసవ్వాలి.

2. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ): గ్రాడ్యుయేషన్,బీఈడీ 50 శాతం మార్కులతో పూర్తిచేయాలి.

3. ప్రైమరీ టీచర్ (పీఆర్): గ్రాడ్యుయేషన్, రెండేళ్ల డీఈఐ ఈడీ/ బిఈఐఈడీ 50 శాతం మార్కులతో పాసవ్వాలి. లేదా బీఈడీ, ఆరు నెలల పీడీపీఈటీ/ బ్రిడ్జ్ కోర్సు 50 శాతం మార్కు లతో పూర్తిచేయాలి.

• ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్టుకు హాజరుకావడానికి సీటెట్/టెట్ తప్పనిసరికాదు. అయితే నియామక సమయానికి సీటెట్/టెట్ అర్హత ఉండాలి.

• ఆన్లైన్ స్క్రీన్ టెస్ట్ జరిగిన 21 రోజుల తర్వాత స్కోర్ కార్డు అందుబాటులో ఉంటుంది. వెబ్సైట్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసు కోవాలి.

వయసు: 01.04. 2024 నాటికి అనుభవంలేనివారు 40 ఏళ్ల లోపు. అనుభవజ్ఞులైతే 57 ఏళ్ల లోపు ఉండాలి.

ఎంపిక ఎలా?

ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

• ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. దీంట్లో సబ్జెక్టు ఆధారిత ప్రశ్నలు ఆడుగుతారు.

• ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు.

• పీజీటీ పోస్టులకు ప్రశ్నపత్రంలో మూడు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-ఏలో బేసిక్ జీకే, కరెంట్ అఫైర్స్, సెప్షన్- కరిక్యులం-ఎడ్యుకేషన్ పాలసీ మేటర్స్, సెక్షన్-సీలో ఆకడమిక్ ప్రొఫిషియెన్సీ ప్రశ్నలు ఇస్తారు.

• టీజీటీ పోస్టులకు సెక్షన్-ఏలో బేసిక్ జీకే-కరెంట్ అఫైర్స్ సెప్షన్-బీలో పెడగాజి, కరిక్యులం-ఎడ్యుకేషన్ పాలసీ మ్యాటర్స్, సెక్షన్-సీలో అకడమిక్ ప్రొఫిషియన్సీ ప్రశ్నలు: అడుగుతారు.

• పీజీటీ పోస్టులకు సెక్షన్-ఏలో బేసిక్ జీకే-కరెంట్ ఆఫైర్స్, సెక్షన్-బీలో పెడగాజి, కరిక్యులం-ఎడ్యుయేషన్ పాలసీ మేటర్స్, సెక్షన్-సీలో ఆకడమిక్ ప్రొఫిషియన్సీ ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్యమైన తేదీలు:-

దరఖాస్తు సమయంలో అభ్యర్థులు మూడు పరీక్ష కేంద్రాలను ఎంచుకోవచ్చు.

• అర్హతలు ఉన్నవారు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకూ పోటీ పడొచ్చు. ప్రతి పోస్టుకూ విడిగా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ఫీజు: రూ.385. 

దరఖాస్తు చివరి తేది: 25.10.2024 

పరీక్ష తేదీలు: నవంబరు 23, 24

 ఫలితాల వెల్లడి: 10.12, 2024

క్రింది లింక్ ద్వారా అప్లై చేసుకోండి,నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకోండి.👇👇👇

  CLICK HERE APPLY /AND NOTIFICATION PDF

Post a Comment

0 Comments