AP 4th CLASS TELUGU 2021
1.గాంధీ మహాత్ముడు
కవి– బసవరాజు
అప్పారావు
అర్థాలు
ప్రణవం = ఓంకారం
మోక్షం = విడుపు
, విముక్తి
తేనెల తేటల మాటలతో
కవి –ఇంద్రగంటి
శ్రీకాంత శర్మ. తెలుగులో
అనుభూతి కవిత్వానికి ప్రతినిధి.
అనుభూతి గీతాలు ఇతని కవితా సంకలనం.
2. గోపాల్ తెలివి
పాత్రలు : ఢిల్లీ
సుల్తాన్,మళవా రాజు జయ చంద్రుడు,జయ చంద్రుడు మంత్రి గోపాల్
సంభాషణలు :
"ఈ భూమి పొడుగు
ఎంత? వెడల్పు ఎంత?"
“ఆకాశంలో ఎన్ని
నక్షత్రాలున్నాయి?" ఢిల్లీ
సుల్తాన్
“రాజా! ఎటువంటి చిక్కు
ప్రశ్నకైనా సమాధానం ఉండకతప్పదు. ఆపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి. ఈ విషయం నాకు
వదిలేయండి. మీరు నిశ్చింతగా ఉండండి.". -
గోపాల్
“నీకు సంవత్సరం గడువు
ఇస్తున్నాను. మళ్లీ ఈనాటికి నీవు జవాబు లతో రావాలి. లేకపోతే నీకు కఠినమైన శిక్ష
విధిస్తాను". ఢిల్లీ సుల్తాన్
*మహాప్రభూ! ఎనిమిది
బండ్లలోని దారంతో భూమి నిలువును కొలిచాను. తక్కిన ఎనిమిది బండ్ల దారం భూమి అడ్డం
కొలత. ఈ దారం కొలుచుకుంటే మీకు భూమి పొడుగు, వెడల్పు తెలిసిపోతుంది.". - గోపాల్
“ఆఁ ఆ లెక్క కూడా
తెచ్చాను. ఇవిగో ఈ పాతిక గొర్రెలు. ఆకాశంలో ఒక్కో నక్షత్రానికి ఒక్కో గొర్రె
వెంట్రుక. ఈ గొర్రెల వెంట్రుకలన్నీ లెక్కించుకుంటే మీకు నక్షత్రాల సంఖ్య ఇట్టే
తెలిసిపోతుంది మహాప్రభూ" -. గోపాల్
అర్థాలు
దర్బార్ – రాజ
సభ
విదూషకుడు = హాస్య
గాడు
చూడగంటి
కవి : తాళ్ళపాక
అన్నమాచార్యులు.
వేంకటేశ్వర స్వామి కేంద్రంగా 32వేళ
సంకీర్తనలురాసలు
రాగం : బృందావనం
, తాళం
: ఖండ
విందు
రచయిత : సోధుం
రామ్మోహన్
పత్రిక రచయిత,నిఘంటు నిర్మాణంచేశారు.విశాలాంధ్ర,వుదయం
పత్రికలో పనిచేశారు.
పాత్రలు : నక్షత్రం,సూర్యుడు,చంద్రుడు,వాయువు
"నాయనా నా కోసం ఏం తెచ్చారు
మీరు?" నక్షత్రం
"అయ్యో! నీ కోసం నేనేమీ తేలేదమ్మా. వాళ్లు
పెట్టింది స్నేహితులతో హాయిగా ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు
రాలేదమ్మా!" సూర్యుడు
“నేను కూడా నీ కోసం ఏమీ తేలేదమ్మా! నేను
సుష్టుగా భోంచేయడానికి విందుకు వెళ్ళాను తప్ప నీకోసం ఏదో ఒకటి తేవాలనుకోలేదు.”
వాయువు
“అమ్మా! నువ్వొక పళ్ళెం తీసుకురా! నీ కోసం
అత్యంత రుచికరమైన పదార్థాలను తెచ్చాను. నేను విందులో ఏ పదార్థం తింటున్నా నువ్వే
గుర్తుకు వచ్చావంటే నమ్ము!" చంద్రుడు
3. దేశమును ప్రేమించుమన్నా
కవి : గురజాడ
అప్పారావు
తెలుగు సాహిత్యం లో వాడుక భాషనుప్రవేశ
పెట్టాడు.కన్యాశుల్కం నాటకం రచన
ఒట్టి = ఎది
లేని
కద్దు = కలదు,ఉన్నది
తెలుగు తల్లి
పిల్లల మర్రి వేంకట హనుమంత రావు
రచనలు : అంధ్రాభ్యుదయం,కాపు
పాటలు,సాహిత్య సంపద.
కందిరీగ కిటుకు
రావూరి భరద్వాజ (5.7.1927 - 18.10.2013)
గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. 'విమల'
ఈయన రాసిన తొలి కథ.
'అపరిచితులు', 'కథాసాగరము' వంటి 37 కథా
సంపుటాలు, 'ఉడుతమ్మ ఉపదేశం', 'కీలుగుర్రం' వంటి 43 పిల్లల కథలు, కరిమింగిన
వెలగపండు, జల ప్రళయం' వంటి 17 నవలలు రాశారు.
వీరి 'పాకుడు రాళ్లు' నవలకు జ్ఞానపీఠ పురస్కారం
వరించింది.
జ్ఞానపీఠ పురస్కారం, కళా ప్రపూర్ణ , కేంద్ర
సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియెట్ భూమి
నెహ్రూ పురస్కారం, రాజాలక్ష్మీ ఫౌండేషన్
అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం,
కళారత్న (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం), లోక్ నాయక్
ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు.
4. పరివర్తన
కవి పరిచయం
వెంకట పార్వతీశ కవులు
బాలాంత్రపు వెంకటరావు , జననం 1882 మరణం:1955
జన్మస్థలం : మల్లాము, తూర్పుగోదావరి జిల్లా
ఓలేటి పార్వతీశం : జననం 1880 మరణం:1970
జన్మస్థలం : పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా
పడవ నడపవోయి
కవి:వింజమురి శివ రామారావు.,.
రచనలు : గోర్కీ కథలు,కల్పవల్లి ఖండకావ్యం
బిరుదు : కళా
ప్రపూర్ణ
5. సత్య మహిమ
కవి : అవధాని
రమేష్ కాలం : 20వ శతాబ్దం
ఈ గేయకథ అవధాని రమేష్ గారి రచన 'గుజ్జనగూళ్ళు'
నుండి తీసుకోబడింది.
ఈయన ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా అవుకు అగ్రహారంలో
జన్మించారు.
ఈయన తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యశాస్త్రి, సావిత్రమ్మ.
ఈయన రచనలు " కాసుల పేరు', 'ప్రతీకారం', 'మూడు మంచి కథలు'.
అర్థాలు
మహిమ = గొప్పతనం
అకలంక = మచ్చలేని, చెడుగుణాలు లేనట్టి
చరితుండు = చరిత్ర కలవాడు; ప్రవర్తన కలవాడు
సత్య వ్రతంబు = ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం
నిత్యంబు = ఎల్లప్పుడు
గతి - జీవితం గడిచే విధానం
తెన్నులు చూచి = ఎదురు చూసి
మోము - ముఖం
తత్తరం = గాబరా
ఆర్తి = దుఃఖం
దీనత = దారిద్ర్యం
కరుణ = దయ, జాలి
మిరుమిట్లు
= మెరుగులు
6. ముగ్గులో సంక్రాంతి
పాత్రలు : అనూష,ఆదిత్య,అత్తమ్మ
“భోగిరోజు సాయంత్రం రేగుపళ్ళు, తెనగలు, చెరుకు
ముక్కలు, చిల్లర డబ్బులు, బంతిపూల రేకులు కలిపి భోగిపళ్ళు పోస్తారు.
ధనుస్సంక్రమణం అంటే సూర్యుడు ధనుస్సురాశిలో
ప్రవేశించడం. దీనినే 'ధనుర్మాసం' అని కూడా అంటారు.
మనకు
ఆహారాన్ని అందించే పశువులను కనుము పండుగ నాడు ఇలాగే పూజిస్తారు.
దక్షణాయనం నుండి ఉత్తరాయణానికి సూర్యుడు
ప్రవేశిస్తాడు
అర్థాలు
పద్మం = తామరపువ్వు
విశిష్టత = గొప్పతనం, ప్రత్యేకత
సంబరం = సంతోషం
రాశి = నక్షత్రాల గుంపు
కలశం = చిన్నకుండ లేదా చెంబు
ఆయనం = గమనం
రంజాన్
ముస్లింలు జరుపుకునే పండుగలలో పవిత్రమైన పండుగ
రంజాన్.
దీన్ని “ఈద్" అని, 'ఈద్-ఉల్-ఫితర్' అని
కూడా అంటారు. ఈ పండుగ
ఇస్లాం కేలండర్ ప్రకారం రంజాన్ నెల మొదటి
రోజునప్రారంభమవుతుంది. ఈరోజు రాత్రి చంద్ర దర్శనం కాగానే మసీదుల్లో “తరావీ నమాజ్'
అనే ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
రంజాన్ నెల అంతా ఉపవాసాలు ఉంటారు.
తెల్లవారుఝామున నాలుగు గంటలకే నిద్ర లేస్తారు. సూర్యోదయానికి సుమారు గంటన్నరముందే
భోజనం చేస్తారు. దీనిని 'సహరి' అంటారు.
పగలు ఉపవాసం ఉంటారు. సూర్యాస్తమయం తరువాత
ఉపవాసదీక్ష విరమిస్తారు. దీనిని 'ఇప్తార్’ అంటారు.
'జకాత్' చేస్తారు. జకాత్ అంటే సంవత్సరానికి
ఒకసారి ఆదాయం, సంపదపై ఒక లెక్క
ప్రకారం పేదలకు దానధర్మాలు చేయటం. రంజాన్ నెల
చివర్ల రోజు చంద్రదర్శనంతో 'షవ్వాల్' నెల
మొదలవుతుంది.
ఆ
మరునాడు పెద్దయెత్తున 'ఈద్' పం జరుపుకుంటారు. అందరూ కొత్తబట్టలు ధరించి 'ఈద్ గాహ్'
కి వెళ్ళి, సామూహిక ప్రార్థనలు చేస్తారు.
7. పద్య రత్నాలు
అర్థాలు
లెస్స = మిక్కిలి
/ బాగుగా
తెరువరి = బాటసారి
నిగ్రహించు = ఎదురించి
కురుచ = పొట్టి
తనరు = వర్ధిల్లు
దినపూర్వ = ఉదయకాల
చాయ = నీడ
కుజన = చెడ్డవారి
మానవత్వం = మనిషి
కి ఉండే సహజ గుణం
లేమి = పేదరికం
జీవధనం = ప్రాణం
వీరగంథం
త్రిపురనేని రామస్వామి: సూత పురాణం, పల్నాటి పౌరుషం,.
బిరుదు
– కవి
రాజ
8. బారిష్టర్ పార్వతీశం
మొక్కపాటి నరసింహశాస్త్రి: పశ్చిమ
గోదావరిజిల్లా, నరసాపురం
లో జన్మించాడు.
రచనలు - బారిష్టర్ పార్వతీశం, మొక్కుబడి,అభ్యుదయం ,పెదమామయ్య
కచ్చికలు = కాల్చిన పిడకలు
అంగవస్త్రం =
తువ్వాలు
చాదు = పిండితో తయారుచేసిన బొట్టు
దేశవాళీ దువ్వెన = చెక్కతో చేసిన దువ్వెన
అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర,
పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ,
(పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తర ఫల్గుణి), హస్త,
చిత్త, స్వాతి, అనూరాధ, జ్యేష్ఠ, మూల,
పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం,
పాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.
ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున
27 నక్షత్రాలకు వారి పాదాలని, వాటిని 9 పాదాలకు ఒక రాశి చొప్పున 12 రాశులుగా మన
పెద్దలు విభజించారు.
అవి మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం,
కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మీనం.
పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకు, ఆ పేరు
పెట్టారు. అశ్వినీ ఆశ్వీయుజమాసం, కృత్తిక ఉంటే కార్తీక మాసం... ఇలా.
ఇవన్నీ చంద్రమానం మీద ఆధార ఉన్నాయి. మన ప్రాచీన
రైతులు వ్యవసాయ విజ్ఞానాన్ని
సూర్యమాన, చంద్రమాన ఆధా పొందుపరిచారు. సూర్యుడు
ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ
కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు.
సంవత్సరానికి 27 కార్తెలు. కార్తెలు, నెలలు,
రాశుల వారీగా పైరులకు వాతావరణం ఎలా ఉంటుందో సామెతల రూపంలో అందరికి అర్ధమయ్యేలా
చెప్పుకున్నారు."
"అశ్విని కురిస్తే అంతా నష్టం"
“భరణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు
గింజట"
ఏరువాక పాట
బిరుదు రాజు రామరాజు – వరంగల్ జిల్లాదేవునూర్ ,
తెలుగు జానపద
రామాయణం,తెలుగు సాహిత్యోధ్దారకులు రచనలు.
9. రాజు – కవి
గుర్రం జాషువా (28.9.1895- 24.7.1971)
ప్రశస్తమైన పద్యశిల్పం, సులలితమైన ధార,
దళితులు, అట్టడుగు వర్గాల పట్ల
అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం
జాషువా కవిత్వ లడ్డూలు.
గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. నవయుగ
కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ
బిరుదులున్నాయి.
'పిరదౌసి', 'గబ్బిలము',
క్రీస్తు చరిత్ర' మొదలైనవి ఈయన రచనలు.
అర్థాలు
సౌధం = భవనం
ప్రబలటం = ఎక్కువ కావటం
రాజదండం = రాజు శాసనం
ధనమయం = ధనంతో నిండినది
గండవితతిమయం = రాళ్ళతో కూడినది
ఆత్మగౌరకాములు = తమ గౌరవాన్ని కోరుకొనేవారు
ప్రస్తుతింతురు=పొగుడుతారు
సుధ = అమృతం
వెయ్యేళ్ళ కవినోయ్
కవి : అడవి బాపిరాజు ,
రచనలు
– నారాయణరావు,హిమబిందు,శశికళ,గోనగన్నారెడ్డి,గంగిరెద్దు
![]() |
author Satish rao Sri Sai tutorial |
Post a Comment
2 Comments
Telangana Telugu material pettandi sir
ReplyDeleteyou did a great job by bringing the material to us
ReplyDelete