AP SCERT new TEXT BOOKS DOWNLOAD HERE

టెట్టు డీఎస్సీలో ఒక్క మార్కు కూడా మిస్ అవ్వకూడదు అంటే కచ్చితంగా చదవవలసిన పుస్తకాలు ఏవైనా ఉన్నాయంటే అవి "ఎస్. సి. ఆర్. టి" కి సంబంధించిన అకాడమీ పుస్తకాలు మాత్రమే. 




                                          


TET,DSC లో వచ్చే ప్రతీ ప్రశ్న అకాడెమీ టెక్స్ట్ బుక్ నుండే ఇస్తారు.కాబట్టి అర కొర సమాచారం ఇచ్చే బయటి మెటీరియల్ లలో ఉన్న సమాచారం అంత క్లారిటీగా ఉండదు. అనవసరమైన సమాచారం ఇవ్వడం వలన అవసరమైన వాటిని పై ఏకాగ్రత పెట్టే అవకాశం ఉండదు. టెట్టు డి ఎస్ సి కి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని స్కూల్ బుక్స్ ని చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అయితే చెట్టుకు మాత్రం మూడవ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదివితే సరిపోతుంది. డీఎస్సీ కి మాత్రం ఎనిమిదో తరగతి లో ఉన్నటువంటి అంశాలను తర్వాతి తరగతుల్లో అంటే 9 మరియు 10 వ తరగతిలో వాటికి సంబంధించి పూర్తి సమాచారం ఇస్తారు. అటువంటి పాఠ్యాంశాలను మాత్రం పదవ తరగతి వరకు చదవాల్సిన అవసరం ఉంటుంది.
మూడవ తరగతి నుంచి 8వ తరగతి వరకు కంటిన్యూషన్ లో లేకుండా తొమ్మిదవ మరియు పదవ తరగతి లో ఉన్నటువంటి పాఠ్యాంశాలను చదవాల్సిన అవసరం లేదు.



                                          


ప్రతి టెట్టు డీఎస్సీలో అన్ని ఎస్సీఆర్టీ బుక్స్ కు సంబంధించిన అట్టల నుంచి కూడా మూడు నాలుగు ప్రశ్నలు వస్తున్నాయి అంటే ఈ పోటీ పరీక్షల్లో స్కూల్ బుక్స్ అనేటివి ఎంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి అని అర్థం చేసుకోగలరు. ప్రతి అభ్యర్థి కూడా ఈ పాఠ్య పుస్తకాలు చదువుతూ సొంతంగా నోట్సు ప్రిపేర్ చేసుకుని ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా నేర్చుకుంటే టెట్లో 120కి పైగా మార్కులు పొందొచ్చు. అదేవిధంగా డీఎస్సీ లో జాబు ని పొందడమే కాకుండా మంచి ర్యాంకు ను కూడా సాధిస్తారు. ఒక హిందువుకు  భగవద్గీత ఏ విధంగా ఉంటుందో, ముస్లింకు కురాన్ ఏ విధంగా ఉంటుందో, ఒక క్రిస్టియన్ కు బైబిల్ ఏ విధంగా ఉంటుందో, ప్రతీ టెట్ డీఎస్సీ కి ప్రిపేరయ్యే  అభ్యర్థులకు ఆ విధంగా ముఖ్యమైనవి స్కూల్ బుక్స్.
నూతన పుస్తకాలను క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.👇👇




                                          

Post a Comment

1 Comments