దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 136 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో దాదాపుగా 8,700 టీచర్లు వర్క్ చేస్తూ ఉంటారు. అందులో అవసరం మేరకు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి ఆర్మీ పబ్లిక్ స్కూల్ కు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పోస్టులు రెగ్యులర్ లేదా ఫిక్సెడ్ విధానంలో వీటిని భర్తీ చేస్తారు.
దీనికి సంబంధించి నటువంటి ఎంపిక విధానం మూడు దశల్లో ఉంటుంది మొదటి దశ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. దీనిని OST ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. దీనిని 19 మరియు 20 ఫిబ్రవరి 2022న కండక్ట్ చేస్తారు.
ఈ లైన్ స్క్రీనింగ్ టెస్ట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూ ఎంపిక చేస్తారు ఇది రెండవ దశలో ఉంటుంది. మూడవ దశలో టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన నైపుణ్యాలు కంప్యూటర్ నైపుణ్యాలను పరిశీలన చేస్తారు. ఈ మూడు దశల్లో మంచి స్కోరు సాధించిన అభ్యర్థులకు దేశం లో ఉన్నటువంటి 136 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో ఎక్కడైనా కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది.
దీనికి సంబంధించి నటువంటి విద్యార్హతలు ఈ క్రింది ఫోటోలో అందుబాటులో ఉంటాయి.
దీనికి అప్లై చేసే టీచర్ అభ్యర్థులకు కచ్చితంగా పాఠశాలలో పనిచేసిన అనుభవం ఉండాలి. ఐదు సంవత్సరాలకు పైగా బోధన చేసిన ఉపాధ్యాయులకు 57 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు.
ఐదు సంవత్సరాల కంటే తక్కువ బోధన అనుభవం ఉన్నవాళ్లు 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ వ్రాయడానికి అవసరం లేదు. కానీ ఈ మూడు దశల్లో మంచి స్కోరు సాధించి ప్రైమరీ టీచర్ గా గాని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ గా గాని పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ గా గాని ఎంపిక అయిన తరువాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఈ అన్ని అర్హతలు ఉండవలసిన అవసరం అనేది ఉంటుంది. ప్రతి అభ్యర్థి కూడా ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ లో 50 శాతం మార్కులు పొందవలసి ఉంటుంది. దీనికి సంబంధించి నటువంటి ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్ సిబిటి ద్వారా కనెక్ట్ చేస్తారు. దానికి సంబంధించి నటువంటి మోక్ టెస్ట్ యొక్క లింకు కూడా ఈ ఈ వెబ్ సైట్ లో మనకు అందుబాటులో ఉంది ఈ క్రింది లింకుల ద్వారా వాటిని పొందే అవకాశం ఉంటుంది.
Click to write mock test👈👈
Notification pdf link👈👈
CLICK TO APPLY ARMY PUBLIC SCHOOL NOTIFICATION👈👈
Post a Comment
1 Comments
🙏
ReplyDelete