TET 2014 PREVIOUS PAPER-1 ప్రశ్నలు ఎలా వచ్చాయో చూద్దాం రండి
PREVIOUS PSYCHOLOGY
PAPER-1 - MARCH -2014
శ్రీ సాయి ట్యుటోరియల్ ప్రీవియస్ క్వశ్చన్స్
1. సుమంత్ లెక్కలు బాగా చేస్తాడు. కానీ చదరంగం బాగా ఆడలేదు. ఇది దేనికి ఉదాహరణ..
1) చరశీల వైయుక్తిక భేదాలు
2) అంతర వ్యక్తిగత భేదాలు
3) వ్యక్యంతర్గత వైయుక్తిక భేదాలు
4) నిర్మాణాత్మక వైయుక్తిక భేదాలు
2)ఒక ప్రాథమిక పాఠశాలలో 10 మంది విద్యార్ధులు కలరు. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం నియమించాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య?
1) 1 2)2 3)4 4)3
3)ఈ గ్రంధి యొక్క స్రావకం వ్యక్తి ఉద్వేగాల పై సూటిగా ప్రభావం చూపుతుంది.
1) అధివృక్క గ్రంథి
2) పీయూష గ్రంథి
3) పార్వ అవటుగ్రంథి
4) అవటు గ్రంథి -
4)ఈ క్రింది వాటిలో మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి లక్షణం కానిది?
1) సాంఘిక పరిపక్వత కలిగియుండుట
2) ఉద్వేగ పరిపక్వత కలిగియుండుట
3) స్వీయ క్రమశిక్షణ
4) తన స్వంత ఊహాలోకంలో మరియు కల్పనలో
జీవిస్తాడు
5). రాజు ఇంటిపని పూర్తి చేయనందుకు ఉపాధ్యాయుడు
ఇతర విద్యార్ధుల ముందు మందలించాడు. ఇంటికి వచ్చిన తరువాత రాజు అకారణంగా తన చెల్లెలుపై అరచాడు.
1) తాదాత్మీకరణము
2) దమనము
3) విస్థాపనము
4) ప్రతిగమనము
6)చరం ఒక ప్రయోక్త విద్యాసాధనపై కంప్యూటర్ ఆధారిత బోధన యొక్క ప్రభావంను అధ్యయనం చేయాలను కున్నాడు. ఇక్కడ పరతంత్ర చరము?
1) విద్యార్థుల సాధన
2) కంప్యూటర్ ఆధారిత బోధన
3) ప్రయోగశాల పరిసరాలు
4) ప్రయోక్త
7)ఈ క్రింది వానిలో ప్రాజెక్టు పద్ధతికి సంబంధించినది. 1) వరుసగా కృత్యాలు ఇమిడి ఉంటాయి
2) చేయటం ద్వారా అభ్యసనము
3) అసహజము
4) అభ్యాసకుని కేంద్రీకృతము
8. విశాంత్ పది ప్రయత్నాలలో 20 అర్థరహిత పదాలను నేర్చుకొన్నాడు. ఒక వారం తరువాత అవే పదాలను తిరిగి నేర్చు కోమన్నప్పుడు, అతను కేవలం నాలుగు ప్రయత్నాలలో నేర్చుకొన్నాడు. అతని పొదుపు గణన (సేవింగ్ స్కోరు )
1) 50%. 2)40%. 3) 14% 4) 60%
9)పావ్ ప్రయోగంలో నిబంధిత ప్రతిస్పందన 'వివరణ' చెందుటకు కారణం.....
1) నిర్నిబంధిత ఉద్దీపన లేకపోవడం,
2) ఉన్నత క్రమ నిబంధిత ఉద్దీపన లేకపోవడం
3) ఉన్నత క్రమ నిబంధిత ఉద్దీపన ఉండడం
4) నిర్నిబంధిత ఉద్దీపన ఉండడం
10. 'మెంటాలిటీ ఆఫ్ ఏప్స్' గ్రంథ రచయిత... ( )
1) లెనిన్
2) కోహెలెర్
3) థార్నడైక్
4) పావ్లోవ్
11. డెజువు అనేది.............
1) గ్రీకు పదం
2) ఆంగ్ల పదం
3) ఫ్రెంచి పదం
4) లాటిన్ పదం
12. ఆహారం మరియు నిద్ర దీని క్రిందకు వస్తాయి.. ( )
1) రక్షణ అవసరాలు
2) శారీరక అవసరాలు
3) ఆత్మ ప్రస్తావన అవసరాలు,
4) ప్రేమ మరియు తత్సంబంధిత అవసరాలు
13. సావిత్రి సంస్కృతాన్ని అర్ధం చేసుకోలేదు కాని
భగవద్గీతలోని శ్లోకములను బాగా చెప్పగలదు.
శ్లోకములను అభ్యసించుటలో సావిత్రి యొక్క స్కృతి?
1) బట్టీ స్కృతి
2) తార్కిక స్కృతి
3) సంవేదన స్కృతి
4) నిష్క్రియాత్మక స్కృతి
14. ఈ క్రింది వాటిల్లో సరియైనది కానిది.
1) రేనెన్స్ ప్రోగ్రెసిన్ మాట్రిస్ - అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష
2) ఆర్మీ అల్ఫా టెస్ట్ - సామూహిక ప్రజ్ఞా పరీక్ష
3) భాటియా టెస్ట్ బ్యాటరీ - వయుక్తిక ప్రజ్ఞా పరీక్ష
4) వెస్లర్స్ ఇంటలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ - సామూహిక"ప్రజ్ఞా పరీక్ష
15. గత అభ్యసన ప్రస్తుత అభ్యసనము ఆటంకపరుస్తుంది,
ఇది...............
1) ప్రతిగమనం
2) దమనం
3) పురోగమన అవరోధం
4) తిరోగమన అవరోధం
16. థార్నడైక్ యొక్క యత్న-దోష సిద్ధాంతమును ఇలా కూడా అంటారు
1) ఆర్ - రకం అభ్యసన
2) పరికరాత్మక వాదం
3)పిల్లి సిద్ధాంతం
4) సంధానవాదం
17. ఒక బాలుని ప్రజ్ఞాలబ్ది 45. ఆతనిని ఈ విధంగా
వర్గీకరించవచ్చు......
1) బుద్ది హీనుడు.
2) మూడుడు
3) ప్రతిభావంతుడు
4) అల్పబుద్ది కలవాడు
18. అభ్యసన వైకల్యం గల వారికి సాధారణంగా పద్ధతిఉపయోగిస్తారు. దీనిలో అనగా.. ( )
1) వృత్తి సంబంధమైన
2) భాషాసంబంధమైన ,
3) విలువైన
4) దృష్టిసంబంధమైన
19. అభ్యసనం కొరకు చేపట్టే మదింపు యొక్క ప్రధాన
ఉద్దేశ్యము.
1) ఎలా బోదించాలి
2) ఏమి బోదించాలి
3) ఎప్పుడు బోదించాలి
4) ఎందుకు బోదించాలి
20) ఈ విధమైన నాయకత్వంలో నాయకుడు ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటాడు..
1) నిరంకుశ నాయకత్వం
2) ప్రజాస్వామ్య నాయకత్వం
3) లైపెజ్ ఫేర్ నాయకత్వం
4) అనుమతించే నాయకత్వం
21. ఈ క్రింది వానిలో ఒకటి ప్రవర్తనా సమస్య కాదు
1) సంఘ వ్యతిరేక ప్రవర్తన
2) కఠినమైన, ధ్వంసం చేసే ప్రవర్తన
3) తనకే దెబ్బలు తగిలించుకునే ప్రవర్తన
4) పరీక్షలలో తక్కువ మార్కులు తెచ్చుకోవటం
22) విద్య, సామాజిక భద్రత అనేవి బాలల హక్కులలో క్రింది వర్గీకరణలో ఉంటాయి.
1) జీవించే హక్కు
2) అభివృద్ధి చెందేహక్కు
3) స్వేచ్చ హక్కు
4) రక్షణ హక్కు
23) జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం-2005 ప్రకారం పాఠ్య ప్రణాళికాభివృద్ధికై నిర్దేశించిన సూత్రాలలో లేనిది?
1) అభ్యసనంలో బట్టి పద్ధతి లేకుండా నిర్ధారించడం 2) జ్ఞానాన్ని పాఠశాల బయట, జీవితానికి అనుసంధానం చేయుట
3) పరీక్షలు నమ్యత కలిగి ఉండివాటిని తరగతి గదితో సమైక్య పర్చబడడం
4) అభ్యసనం పాఠ్య పుస్తకాల చుట్టూ ఉండడం
24. ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం కానిది...
1) అభ్యసనం సార్వత్రికమైనది.
2) అభ్యసనానికి సంచిత స్వభావం ఉంటుంది.
3) పెరుగుదల లాగ అభ్యసన కూడా ఒక దశ తరువాత ఆగిపోతుంది
4) అభ్యసన శారీరక పెరుగుదల, మానసిక పరిభిట్పై ఆధారపడి ఉంటుంది
25)అనిర్దేశిత మంత్రణమును ఇలా గూడా అంటారు? 1) సహాయార్థి కేంద్రిత మంత్రణము
2) సమస్యా కేంద్రిత మంత్రణము
3) కౌన్సిలర్ కేంద్రిత మంత్రణము
4) శ్రేష్టగ్రహణ (మిశ్రమ) మంత్రణము
26. ఈ క్రింది వానిలో ఒకటి ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతి?
1) సమస్యా పరిష్కార పద్దతి
2) అన్వేషణా పద్ధతి
3) ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి
4) ప్రాజెక్టు పద్ధతి
27. క్రింది వాటిలో వికాస సూత్రం కానిది? ( )
1) వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉంటుంది.
2) వికాసం నిరంతర ప్రక్రియ.
3) వికాసాన్ని ప్రాగుక్తికరింపవచ్చు.
4) వికాసం సంచితమైనది.
28. ఒక శిశువు ఆట బొమ్మకు జీవమున్నట్లు తలచి, దానితో ఆడుకొంటున్నది, అలంకరిస్తున్నది మరియు మాట్లాడుతున్నది. ఆ శిశువు ఉన్న సంజ్ఞానాకత్మక వికాశ దశ.
1) పూర్వ ప్రచాలక దశ
2) ఇంద్రియ చాలక దశ
3) అమూర్త ప్రచాలక దశ
4) మూర్త ప్రచాలక దశ
29. కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం వ్యక్తులు నైతికంగా ఈ స్థాయికి మించి పెరగదు?
1) పూర్వ సంప్రదాయ స్థాయి
2) పూర్వనైతిక స్థాయి
3) ఉత్తర సాంప్రదాయక స్థాయి
4) సాంప్రదాయక స్థాయి
30. చోమ్ స్కీ ప్రతిపాదించిన సిద్ధాంతము.........
1) నైతిక అభివృద్ధి. 2) భాషాభివృద్ధి,
3) మానసిక రుగ్మత 4) సాంఘిక అభివృద్ధి
ఆన్సర్ కీ:-
PREVIOUS PAPER-1 - MARCH -2014
1.3 2.2 3.1 4.4 5.3 6.1 7.3 8.4 9.1 10.2 11.3
12.2 13.1 14.4 15.3 16.4 17.1 18.4 19.1 20.1 21.4 22.2 23.4 24.3 25.1 26.3 27.1 28.1 29.4. 30.2
Post a Comment
4 Comments
Tqq
ReplyDeleteSuper
ReplyDeleteSuper. Very useful
ReplyDelete25/30 marks i got
ReplyDelete