విద్యా దృక్పథాలు పుస్తకం పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి.
NOTE:-
క్రింది రెడ్ కలర్ లో ఉన్నటువంటి లింకు ద్వారా విద్యా దృక్పథాలు అకాడమీ పుస్తకం పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోగలరు.
విద్యా దృక్పథాలు
విద్య-పరిమిత, విస్తృత అర్థాలు (Narrow and broader Meanin education)
విద్య అనేది ఏకరూప వివరణ ఇవ్వలేనిది. విద్య చాలా విస్తృతమైన పరిధిని కలిగి ఉంది చెప్పవచ్చు. విద్య అంటే విద్యార్థి పాఠశాలలో నేర్చుకునే జ్ఞానంగా లేదా జీవితానుభవాలు , కలిగే జ్ఞాన వికాసంగా నిర్వచించవచ్చు. ఇలా విద్య సంకుచిత విస్తృత అర్థాలను కలిగి ఉంది పాఠశాల వ్యవస్థ ద్వారా నేర్చుకొనే అంశాలు సంకుచితంగాను, వీటితో పాటు జీవితానుభవాలు జోడించి నేర్చుకొనే జ్ఞానాన్ని విస్తృతంగాను చెప్పవచ్చు.
పరిమితార్ధం : పరిమితార్థంలో విద్య అంటే వ్యక్తి అభివృద్ధి. పాఠశాలలో ఏర్పాటు చేసిన కొన్ని అంశాలు, కార్యక్రమాల ప్రభావాల ఫలితం : క్రమబద్దమైన విద్యావిధానం కేవలం 3R's (Reading, writing and Arithmetic) కు మాత్రమే పరిమితమై పట్టాలు పొందడానికి ఉపయుక్తమైంది.
విస్తృతార్థం : విస్తృతార్థంలో విద్య అంటే కేవలం 3R's చదవటం (Reading), రాయటం (Writing) లెక్కించటం (Arithmetic) మాత్రమే కాదు, జీవితమే విద్య, ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇది తల్లి గర్భం నుంచి మృత్యువు (womb to tomb) వరకు సాగుతూనే ఉంటుంది. విద్య మానవ జీవితంలో జరిగే అవిరామ కృషి, విస్తృతారంలో ప్రతి అనుభవం విద్యాపరమైన విలువ కలిగి మానవుడి ప్రవర్తనను పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పు చేయుటకు ఉపయోగపడుతుంది. అపరిమితమైనదే కాకుండా సంపూర్ణ మూర్తిమత్వాభివృద్ధికి తోడ్పడుతుంది. విశ్వమానవుణ్ణి తయారు చేస్తుంది. ఈ 1.0.2 విద్య-పాశ్చాత్య తత్వవేత్తల అభిప్రాయాలు (Western concept of Education)
క్రింది లింక్ ద్వారా విద్యా దృక్పథాలు Pdf డౌన్లోడ్ చేసుకోండి.👇👇
విద్యా దృక్పథాలు
గురించి పాశ్చాత్య విద్యావేత్తల అభిప్రాయాలు కొన్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది.
“తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య” - సోక్రటీస్ సంతోషాన్ని, బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య"
- ప్లేటో “దృఢమైన శరీరంలో దృఢమైన మనసును రూపొందించేదే విద్య" - అరిస్టాటిల్ “మనుషులను సార్ధకులుగా తయారుచేసేదే విద్య” - కొమినియన్ , “సహజమైన, సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య" - పెస్టాలజి “జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేదే విద్య" - ఫోబెల్ “శిశువు తన ఉత్తమ సామర్ధ్యాల ద్వారా తనవంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలిగించేదే విద్య” - టి.పి.సన్ “తన పరిసరాలను నియంత్రించగలిగే, తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకలశక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య” -
జాడ్యూయీ “మనస్సును నియంత్రించటమే విద్య" - ఎమర్సన్ వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేది సరైన విద్య - డెక్టార్ “సంపూర్ణ జీవితానికి సమాయత్త పరచటమే విద్య " - స్పెన్సర్ “పరిణతి చెందిన వారు పరిణతి చెందనివారిపై చూపు ప్రభావమే విద్య" - రెడిన్ రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అణచివేసే సమాజ నిర్మితిలో అణగారిన వ్యక్తుల సృజనాత్మకతను వెలికితీసి స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందింపచేసేదే విద్య' - (పాలో ప్రిమరి)
పైన తెలిపిన పాశ్చాత్య తాత్వికవేత్తల నిర్వచనాల సారాన్ని సంగ్రహంగా పరిశీలిస్తే “విద్య” సాధించవలసిన లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఈ నిర్వచనాలు ఎక్కువగా ఆచరణాత్మకతకు ప్రాధాన్యతను ఇస్తున్నట్లుగా గ్రహించవచ్చు.
విద్య లక్ష్యం కేవలం వ్యక్తి అంతర్గత శక్తులను వెలికితీయడం కాదు, ఆ అంతర్గత శక్తులను ఎలాఉపయోగించాలో కూడా తెలుపుతుంది. ఈ నిర్వచనాలలో కొన్ని ఆధ్యాత్మికతలను
పెంపొందిస్తున్నప్పటికిని కొన్ని భౌతికతకు ప్రాధాన్యతను ఇస్తూ ఆ విద్య ద్వారా భౌతిక సంపద సృష్టికి (creativity/productivity) మార్గం చూపుతున్నదని తెలుస్తున్నది.
విద్య అనే పదం “విద్” అనే సంస్కృత పదం నుంచి ఆవిర్భవించింది. 'విద్' అంటే తెలుసుకోవడం, సంభవించడం, కనుగొనడం, భావించడం, అవగాహన అనే వివిధ అర్థాలున్నాయి. కాబట్టి విద్య అంటే వీటన్నింటి సమ్మేళనం వల్ల కలిగే జ్ఞానం అని చెప్పగలం. విద్యకు సమానార్థం ఉన్న ఆంగ్లపదం "Education- ఎడ్యుకేషన్” లాటిన్ భాషలోని ఎడ్యుకేర్ (ఎడ్యుసిడ్) అనే పదాల నుంచి పుట్టింది. ఎడ్యుకేషన్ లోని 'E' అంటే out of అని 'duco' అంటే వృద్ధిలోకి తీసుకురావటం (To bringup) అనే అర్థం వస్తుంది. దారి చూపటం (To lead forth) అనే భావాన్ని ఇస్తుంది.
జ్ఞానం అంటే కేవలం సమాచార సేకరణే కాకుండా పొందిన జ్ఞానాన్ని సరైన రిలి జీవనస్థితిగతుల్లో ఆచరించే నైపుణ్యం అని చెప్పవచ్చు, అప్పుడే అది విజ్ఞానమవుతుంది. విదు
1.0.3 విద్య - భారతీయ విద్యా, తత్వవేత్తల అభిప్రాయం (Indian concept of Education
'విద్' అనగా తెలుసుకొనడం (విద్ అనేది సంస్కృత ధాతువు నుంచి ఆవిర్భవించింది. మొదట తనను తాను తెలుసుకొనడం, అనంతరం దివ్యత్వం గురించి తెలుసుకొనడం ఆత్మనుగూరి తెలుసుకొనడం అనే ఉదాత్తమైన భావనల నుంచి ఆవిర్భవించిందే విద్య. విద్య అపరిమితమైనది. ఇది వ్యక్తి సంపూర్ణ మూర్తిమత్వానికి తోడ్పడుతుంది, దీనికి పరిధి లేదు. విశ్వ మానవుడిని తయారుచేస్తుంది. విద్య-నిర్వచనాలు
“వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయుట ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడునదే విద్య" - గాంధీజీ “వ్యక్తి పరిపూర్ణ వికాసం, పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యల పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య” - రాగూర్ “శిశువు అభివృద్ధి, జీవితాంతం కొనసాగే ప్రక్రియ” - జాకీర్ హుస్సేన్ “మానవుని నిస్వార్థ తత్పరునిగా, స్వావలంబకుడిగా తయారు చేయునది విద్య”- వేదాలు
“మోక్ష సాధనే విద్య”. - ఉపనిషత్తులు • “ఆత్మ సాక్షాత్కారం పొందటమే విద్య". - శ్రీ శంకరాచార్య
“మానవునిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయుటయే విద్య" - స్వామి వివేకానంద
"ప్రజల అవసరాలకు, ఆశయాలకు తగినట్టుగా ఉన్నదే అసలైన విద్య” -డి.ఎస్.
కొఠారి
పై నిర్వచనాలను గమనిస్తే విద్య అనేది సమగ్రమైనది. దాని ప్రభావానికి అనుగుణ్యంగా జరిగే మార్పులను తగనుగుణంగా సమతుల్యం చేసి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా రూపొందించడానికి తోడ్పడుతుంది. సూక్ష్మంగా పొందే విద్య పాఠశాల ద్వారా అందించబడుతుంది. స్థూల లభించే విద్య సమగ్రమైనది. ఇది జీవితానుభవాలను జోడించి నిరంతరం కొనసాగే ప్రక్రియ 1.1 విద్య, దాని స్వభావం (Nature of Education)
- భారతీయ, పాశ్చాత్య విద్యావేత్తల అభిప్రాయాలను గమనిస్తే విద్య స్వభావం అంశాలతో కూడిన విశిష్ట లక్షణాలను మేళవిస్తుంది.
1.2 భారతదేశంలో స్వదేశీ ఎలిమెంటరీ విద్యావిధానం - చారిత్రాత్మక దృష్టి : (Elema Education in India - Historical perspective)
భారత ఉపఖండంలో విద్య ప్రాధాన్యత ఎంతగానో ఉంది. సనాతన కాలం.
రంగం ఆరంభం నుంచి అంతకుపూర్వం వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులు మొదలగువాటి ఆధారంగా విద్యావిధానం అమలులో ఉండేది.
ప్రాచీన విద్యావిధానం, బోధనా విద్యా విధానాలు చాలావరకు సాంప్రదాయిక పద్ధతులో కొనసాగాయి. ముఖ్యంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే చాతుర్వర్ణాలుగా విభజింప బడినారు. పురాణాలు, రామాయణ, భాగవత, భారత ఇతిహాసాల్లో గురుశుశ్రూషలుచేసూ ఆశ్రమ విధానంలో విద్యను అభ్యసించేవారని మనకు తెలుస్తుంది. విద్యాబోధనకు ఒక నియమిత కాలం, అలాగే నియమిత అంశాలు బోధించాలనే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా అవసరం. అవకాశం, సందర్భానుసారంగా బోధించబడేవి. వార్షిక పరీక్షలు అనే భావన కాకుండా ధర్మసూత్రాలు, సత్యం, న్యాయం, సామాజిక ప్రాతిపదికన వ్యక్తి అభిరుచిని బట్టి ఆయా రంగాలలో వారికి తర్ఫీదు ఇచ్చేవారని మనకు తెలుస్తుంది. అంతిమంగా పరీక్షలు నిర్వహణ-పోటీలు, ప్రతిభాపాటవముల ప్రదర్శన, యోధులకు సన్మానం మొదలైనవి జరుపబడినట్లు తెలుస్తుంది. అనంతరకాలంలో మతఛాందస భావాలతో కూడిన విద్యావిధానం కొనసాగినట్లుగా తెలుస్తుంది. మతబోధనలు, ధర్మ ప్రవచనాలు, గణితం, తర్కశాస్త్రం, న్యాయశాస్త్రంలో వృత్తి విద్యలు, శ్రమకు ప్రాధాన్యత ఇవ్వబడింది.
అనంతర కాలంలో హిందూమతంలో భేదభావాలు, శైవ, వైష్ణవ, చార్వాక, వీరవైష్ణవ, వీరశైవ ప్రాబల్యాలు, విద్యావిధానంలో కొంత సంస్కరణలు తెచ్చినప్పటికిని, సామాజిక కట్టుబాట్లు, నియమ నిబంధనలు, విలువల ఆచరణ తగ్గి మత బోధకులు, గురువుల ఆలోచనల్లో వికృతి ఆలోచనలు చోటు చేసుకోవడం జరిగింది. జైన, బౌద్ధమతాల ఆవిర్భావం అనంతం విద్యావిధానంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. బౌద్ధంలో మహాయాన, హీనం జైనమతంలో శ్వేతాంబరులు, దిగంబరులు అనే వర్గ పోరాటాలు కొనసాగాయి. అయినప్పు ప్రజల్లో విద్యపట్ల మంచి శ్రద్ధ ఏర్పడింది. వాటికి అనుగుణంగా ఆనాటి ఆంగ్లేయులు, ఆలోచనల వల్ల మన విద్యావ్యవస్థలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్యాలు నలంద, తక్షశిల, కాశీ, అయోధ్య వంటి ప్రదేశాల్లో విద్యాపీఠాలు, విశ్వవిద్యాల ప్రారంభించబడినాయి. బౌద్ధమత ప్రాబల్యం కలిగిన రాచరిక స్థానాల్లో విదా మేధోమథనం, ధర్మసమ్మేళనాలు జరిగినాయి.
క్రింది లింక్ ద్వారా విద్యా దృక్పథాలు Pdf ను డౌన్లోడ్ చేసుకోగలరు.👇👇
CLICK HERE TO DOWNLOAD Perspective Education Pdf
విద్యా దృక్పథాలు
“శరీరంలోనూ, మనస్సులోనూ, ఆత్మలోనూ నిక్షిప్తమైన అత్యున్నత శక్తులను బయటకు తీయుటయే విద్య” అని ఒకరంటే “జీవితమే విద్య" అని మరొకరన్నారు. నాగరిక ప్రపంచంలో విద్య అందరికి అవసరమే. మానవ సామాజిక జీవితం మారుతోంది. దీని నేపథ్యంలో విద్య అర్థం, స్వభావం కూడ మారుతూ ఉంటుంది. మానవ పరిణామక్రమంలో విద్య స్వభావం కూడ గతిశీలమైనది. విద్య భావం అపరిమితమైనది. ఇది మానవ చరిత్రలో అతి ప్రాచీనమైనది.
విద్య గర్భస్థ శిశువు నుంచి మరణించే వరకు నిరంతరం కొనసాగే ప్రక్రియ. మనిషి వివిధ దశల్లో పొందిన విజ్ఞానం, అనుభవం విద్యగా గమనించాలి. విద్య అనేది ఒక క్రమమైన పద్ధతిలో కొనసాగే ప్రక్రియ. ఇందులో ఒకస్థాయి అనంతరం మరోస్థాయిలో ప్రగతిని కొనసాగించేదేకాని ఖండికలుగా ఒక స్థాయిని వదలి మరొక స్థాయి నుంచి ఆరంభించడం సాధ్యంకాదు. విద్యాసంస్థల్లో ఒక పద్ధతి ప్రకారం నిర్వర్తించబడుతుంది. విద్య అనేది వ్యక్తి నుంచి ఆరంభమై వ్యక్తుల సమూహం (society), సమాజంలోని అందరికి ఆవశ్యకమైనదని చెప్పవచ్చు. అనగా వ్యక్తి ప్రగతియే సామాజిక ప్రగతి, కాబట్టి విద్య అన్ని రంగాలను ప్రభావితం చేస్తుంది. విద్య వ్యక్తిలో పరివర్తన, ప్రవర్తన మార్పులను ఆశిస్తూ మానవ ప్రగతికి దిశానిర్దేశాన్ని సూచిస్తుంది. విద్య ఒక సుశిక్షణ దానిద్వారా వ్యక్తిలో క్రియాశీలత, సృజనాత్మకత, ప్రయోజనాత్మకతను
పెంపొందిస్తుంది. విద్యలేని జీవితం పశుతుల్యం, సకల ప్రాణులకు విద్య సహజాతంగా వస్తుంది. కాని మానవుడు మాట్లాడే జంతువు, అతనికి వివేచన, విచక్షణ విద్య ద్వారా మాత్రమే లభిస్తుంది. విద్య అనేది మానవుల్ని - ఇతర ప్రాణులకంటే, అలాగే విద్యలేని మానవుని కంటే ఉన్నత భావాలు కలిగిన నిపుణత గల వ్యక్తిగా రూపొందిస్తుంది. విద్యయే బలం, విద్యయే ధనం, విద్యావంతుడు ఎక్కడైనా రాణించగలడు. సమాజ ప్రగతికి, ఆరోగ్యకరమైన సమాజానికి విద్య ఎంతగానో ఆవశ్యకతను కలిగియుంది. కాబట్టి విద్య స్వభావం - ఇదమిద్దంగా ఇంతే అని చెప్పలేం. చాలా విస్తృతమైన పరిధిని కలిగిఉంది.
Post a Comment
11 Comments
Upload full book this is upto118 page only
ReplyDeleteUpload full book
ReplyDeleteHello sir please upload full book
ReplyDeleteHello sri sai tutorial upload full book ok
ReplyDeletePlease upload full book
ReplyDeleteCopy pest ha 😁😞
ReplyDeleteమొతం బుక్ పి డి ఎప్ పెడితే పెట్టాండి కాని ఇలా సగం సగం పిడిఎప్ లు మాత్రం పెట్టకండి.
ReplyDeletePlease upload full book
ReplyDeleteసార్ కంప్లీట్ బుక్ పెట్టండి ప్లీజ్
ReplyDeleteSir complete book paytadi
ReplyDeleteMotham book PDF pettandi sir
ReplyDelete