DSC 2022 కి చాలా ముక్యమైన జాతీయ విద్యావిధానం 2020. NEP 2020 TELUGU&ENGLISH VERSION PDF
Note:-
క్రింద ఇంగ్లీషు మరియు తెలుగు మీడియం కు సంబంధించిన లింక్స్ అందుబాటులో ఉన్నాయి వాటిపై క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోగలరు.
జాతీయ విద్యావిధానం 2020
ఉపోద్ఘాతం సంపూర్ణ మానవ సామర్ధ్యాన్ని సాధించేందుకు, నిష్పాక్షికమైన, న్యాయబద్ధమైన సమాజాన్ని స్థాపించేందుకు, జాతీయ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు విద్యే మౌలికమైనది.
క్రింది👇లింక్ ద్వారా డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి.
NEP 2O2O TELUGU VERSION PDF DOWNLOAD👈👈👈
CLICK HERE TO ENGLISH VERSION PDF👈
తద్వారా 2030 ఎజెండాలోని సంక్లిష్టమైన టార్గెట్లను, లక్ష్యాలను, నిలకడతో కూడిన అభివృద్ధి లక్ష్యాలను (సస్టైనబుల్ డెవెలప్మెంట్ గోల్స్- ఎస్ డి జి) సాధించవచ్చు.
జ్ఞానంలో ప్రపంచమంతా వేగంగా మార్పులకు గురవుతోంది. బిగ్ డాటా, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటి రంగాలలో వస్తున్న ప్రగతి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అంతగా నైపుణ్యం అవసరం లేని ఉద్యోగాలను అనేకయంత్రాలే నిర్వహించవచ్చు.
అయితే ప్రత్యేకించి గణితం, కంప్యూటర్ సైన్స్, డాటా సైన్స్ ల విషయంలో మాత్రం విజ్ఞాన శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలు, బహుశాస్త్ర విషయ సామర్థ్యాలతో కలగలసి నైపుణ్యంతో కూడిన ఉద్యోగాల ఆవశ్యకత చాలా పెరుగుతోంది.
వాతావరణ మార్పు, పెరుగుతున్న కాలుష్యం, తరుగుతున్న ప్రకృతి వనరుల కారణంగా ప్రపంచ ఇంధన, నీటి, ఆహార, పారిశుధ్య అవసరాలను ఎలా తీర్చాలి అనే విషయంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
క్రింది👇లింక్ ద్వారా డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి.
NEP 2O2O TELUGU VERSION PDF DOWNLOAD👈👈👈
తత్ఫలితంగా కూడా ముఖ్యంగా జీవశాస్త్రం, రసాయన శాస్త్రం,భౌతికశాస్త్రం, వ్యవసాయం, వాతావరణ విజ్ఞానం, సామాజిక శాస్త్రం రంగాలలో నూతన నైపుణ్యంతో కూడిన శ్రామిక శక్తి అవసరం ఎక్కువవుతోంది.
అంటువ్యాధులు, మహమ్మారులు ప్రబలిపోతున్నందు వల్ల అంటువ్యాధుల యాజమాన్యం విషయంలో పరస్పర సహకారంతో కూడిన పరిశోధనలు, రోగనిరోధక టీకాలు, పెరుగుతున్న సామాజిక సమస్యలు మొదలైనవాటి కారణంగా బహుశాస్త్ర విషయాలతో కూడిన విద్య ఆవశ్యకత ఎక్కువవుతోంది.
భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా, ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎదుగుతున్న క్రమంలో మానవ విజ్ఞాన శాస్త్రాలకు, కళలకు ఎంతో డిమాండ్ ఏర్పడుతోంది.
ఈ నిజానికి వేగంగా మారుతున్న ఉపాధి రంగం, ప్రపంచ జీవావరణ వ్యవస్థల వల్ల పిల్లలు కేవలం నేర్చుకుంటే సరిపోదు, ఎలా నేర్చుకోవాలో అనే దానిని కూడా నేర్చుకోవాల్సి వుంటుందనేది అంతకంతకూ స్పష్టమవుతోంది.
అందువల్ల విద్య తక్కువ కంటెంట్ తో, తార్కికంగా ఎలా ఆలోచించాలి, సమస్యలను ఎలా పరిష్కరించాలి, సృజనాత్మకంగా ఎలా వుండాలి, బహుశాస్త్ర విషయాలను ఎలా అలవర్చుకోవాలి, పరిశోధనాత్మకంగా ఎలా వుండాలి, మారుతున్న రంగాలలో నూతన వస్తువును ఎలా అవగాహన చేసుకోవాలి, ఎలా అలవర్చుకోవాలి అనే దిశలో ఎక్కువగా ముందుకు సాగాలి. బోధనాశాస్త్రం విద్యను మరింత అనుభవసహితంగా, సమగ్రంగా, సంఘటితంగా, జిజ్ఞాసను రేకెత్తించేదిగా, శోధనాత్మకంగా, నేర్చుకునే వ్యక్తి కేంద్రంగా, చర్చలపై ఆధారపడేదిగా, సులభమయ్యేదిగా ఉండాలి.
క్రింది👇లింక్ ద్వారా డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి.
NEP 2O2O TELUGU VERSION PDF DOWNLOAD👈👈👈
Post a Comment
2 Comments
NEP 2020 English version please
ReplyDeleteI will try
ReplyDelete